DRDO Robot: సొరంగంలో చిక్కుకున్న కార్మికుల కోసం డీఆర్డీవో రోబోలు

వెంటిలేషన్​ సహా కూలీలకు ఆహారం అందజేత

Courtesy: Twitter

Share:

DRDO Robot: గత 9 రోజులుగా ఉత్తరాఖండ్లో(Uttarakhand) కూలిన సొరంగంలో(Tunnel) చిక్కుకున్న 41 మంది కార్మికులకు ఆహారం అందిచడమే కాకుండా వారికి వెంటిలేషన్ సౌకర్యం(Ventilation facility) కల్పించేలా చర్యలు తీసుకున్నారు అధికారులు. ఇందుకోసం డీఆర్డీఓ(DRDO) తయారు చేసిన రెండు ప్రత్యేకమైన రోబోలను(Robot) టన్నెల్లోపలికి పంపించారు.

ఉత్తరాఖండ్లో(Uttarakhand) కూలిన సొరంగంలో 9 రోజులుగా చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను కాపాడేందుకు అధికారుల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. నేపథ్యంలో కూలీల భద్రత కోసం సొరంగం లోపల ఆరు అంగుళాల వెడల్పు ఉన్న పైపును ఏర్పాటు చేసినట్లు ఎన్హెచ్ఐడీసీఎల్​ (NHIDCL) డైరెక్టర్ అన్షు మనీశ్ఖల్ఖో(Anshu Manish Khalkho) వెల్లడించారు. అంతే కాకుండా రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) తయారు చేసిన 20, 50 కిలోల చొప్పున బరువున్న 2 రోబోలను కూడా సొరంగం లోపలికి పంపినట్లు ఆయన తెలిపారు. ఇవి లోపల ఉన్న వారికి ఆహార పదార్థాలను అందించడమే కాకుండా ప్రత్యేకంగా వెంటిలేషన్సౌకర్యాన్ని(Ventilation facility) కూడా కల్పించనున్నాయని చెప్పారు. టన్నెల్లో(Tunnel) చిక్కుకున్న కార్మికులను బయటకు రప్పించేందుకు ఇరువైపులా డ్రిల్లింగ్ పనులు ప్రారంభించినట్లు తెలిపారు.

'రోబోలను(Robot) లోపలికి ప్రవేశపెట్టడం అనేది మేము సాధించిన మొదటి విజయంగా భావిస్తున్నాం. ఇప్పుడు వారిని బయటకు తెచ్చేందుకు జరుగుతున్న అన్ని ప్రయత్నాలు సఫలీకృతమైతే మాకు అది రెండో విజయం. దీన్ని అమలుపరచడం చాలా కీలకమైన అంశం. పైపుల ద్వారా సొరంగంలో చిక్కుకున్నవారికి ఆహారాన్ని అందిస్తున్నాం. దీంతో వారు మానసికంగా కొంత మెరుగవుతారు. వారితో కమ్యునికేట్(Communicate)​ అవ్వడానికి కూడా మేము ప్రయత్నిస్తున్నాం' అని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న అధికారి తెలిపారు.

చార్ధామ్(Chardham)​ మార్గంలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్లో ఎన్డీఆర్ఎఫ్(NDRF)​, ఐటీబీపీ(ITBP), బీఆర్(BRO) భద్రతా దళాలు సహా అంతర్జాతీయ నిపుణులు భాగస్వాములయ్యారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామి(Pushkarsingh Dhami) తెలిపారు. అలాగే కేంద్ర సాంకేతిక ఏజెన్సీలు కూడా ప్రక్రియలో ముందున్నాయని.. వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వం కావాల్సిన సహకారం కూడా అందిస్తోందని సీఎం చెప్పారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా ప్రాణాలతో బయటకు తీసుకురావడమే తమ ప్రధాన కర్తవ్యమని పుష్కర్సింగ్ ధామి(Pushkarsingh Dhami) స్పష్టం చేశారు. కూలీలతో మాట్లాడేందుకు కావాల్సిన మొబైళ్లు, ఛార్జర్లు, వాకీ టాకీలను కూడా అధికారులు సమకూర్చామని తెలిపారు. తద్వారా సొరంగం లోపల పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం సొరంగంలో చిక్కుకున్న కూలీలందరూ క్షేమంగానే ఉన్నారని.. త్వరలోనే వారంతా బయటకు వస్తారనే అశాభావం తమకుందని పుష్కర్సింగ్ధామి అన్నారు. ప్రధాని మోదీ(PM Modi) సైతం సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

సొరంగం(Tunnel) ఉన్న కొండ పైభాగం నుంచి నిలువుగా తవ్వి, వెడల్పైన గొట్టాన్ని పంపించడం ద్వారా కూలీలను బయటకు తీసుకురావాలనే ప్రయత్నాలను అధికారులు ప్రస్తుతం పక్కనపెట్టారు. మధ్యలో గట్టిరాయి అడ్డుగా ఉండడం దీనికి కారణం. దీని బదులు శిథిలాలకు ఒక చివరి నుంచి మరో చివరికి 60 మీటర్ల మేర డ్రిల్లింగ్(Drilling) చేయడమే మేలు అని 'జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ' సభ్యుడు సయ్యత్అటా హస్నైన్(Ata Hasnain)​ తెలిపారు. ఒకవేళ నిలువుగా తవ్వాలంటే అత్యంత కచ్చితత్వం ఉండాలని, ఏమాత్రం తేడా వచ్చినా బాధిత కూలీలను చేరుకోలేమని అంతర్జాతీయ నిపుణుడు ఆర్నాల్డ్డిక్స్(Arnold Dix)​ హెచ్చరించారు.

ఉత్తరకాశీలోని(Utharakasi) సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు గత 9 రోజులుగా చేపట్టిన చర్యలు, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్పై (Rescue operation) 48 గంటల్లోగా సమాధానమివ్వాలని ఉత్తరాఖండ్ హైకోర్టు(High Court).. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ఏజెన్సీలను సోమవారం కోరింది. టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్కు(Rescue operation) సంబంధించిన పిల్పై విచారణ సందర్భంగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. క్రమంలో కేసు తదుపరి విచారణను నవంబరు 22కి వాయిదా వేసింది హైకోర్టు.

నవంబరు 12 బ్రహ్మకల్‌ - యమునోత్రి (Brahmakal - Yamunotri) జాతీయ రహదారిపై.. సిల్క్యారా- దండల్గావ్‌(Silkyara-Dandalgaon) మధ్య సొరంగాన్ని తవ్వుతుండగా కొండచరియలు విరిగిపడి 41 మంది కార్మికులు చిక్కుకుపోయారు. తొమ్మిది రోజుల నుంచి వారిని బయటకు తీసుకువచ్చేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.