Destination Wedding: డెస్టినేషన్ వెడ్డింగ్ గురించి మాట్లాడిన మోదీ

ఈ విషయం కలవరపరుస్తుంది అంటూ..

Courtesy: Twitter

Share:


Destination Wedding: ఇప్పుడు చాలామంది డెస్టినేషన్ వెడ్డింగ్ (Destination Wedding) చేసుకోవడానికి మక్కువ చూపిస్తున్నట్లు కనిపిస్తుంది. రాజకీయ నాయకులు, సినీ రంగానికి చెందిన వారు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు అందరూ కూడా చాలా వరకు డెస్టినేషన్ వెడ్డింగ్ (Destination Wedding) ప్లానింగ్ కి ఓటు వేసుకుంటున్నారు. భారత దేశంలో కాకుండా ఇతర దేశాలకు వెళ్లి వివాహాలు జరుపుకోవడం ఆచారాలుగా మార్చుకుంటున్నారు. తమకు నచ్చిన ప్రాంతంలో భారతీయులు పెళ్లి (Marriage) జరుపుకుంటూ ఉండడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఇటీవల మన్ కీ బాత్ సందర్భంగా మాట్లాడడం జరిగింది. 

ఈ విషయం కలవరపరుస్తుంది అంటూ..: 

మన్ కీ బాత్ 107వ ఎడిషన్ సందర్భంగా, భారతీయులు జరుపుకుంటున్న విదేశీ వివాహాల తీరుపై ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఆదివారం ప్రశ్నించారు. కొన్ని పెద్ద కుటుంబాలు విదేశాల్లో వివాహాలను నిర్వహించడం వంటి విషయాలు తనని కలవరపరుస్తున్నాయంటూ మాట్లాడారు నరేంద్ర మోదీ (Narendra Modi), భారతదేశం డబ్బు నిజానికి భారతదేశ (India) తీరాన్ని విడిచిపెట్టకుండా చూసేందుకు దేశంలోనే ఇటువంటి వేడుకలను నిర్వహించాలని ఆయన కోరారు.

ప్రస్తుతం జరుగుతున్న పెళ్లిళ్ల (Marriage) సీజన్ గురించి ప్రధాని మాట్లాడుతూ, ఈ ఏడాది దాదాపు రూ. 5 లక్షల కోట్ల వ్యాపారం జరగవచ్చని కొన్ని వాణిజ్య సంస్థలు అంచనా వేస్తున్నాయి. వివాహాల కోసం షాపింగ్ చేసేటప్పుడు మాత్రమే భారతదేశం (India)లో తయారైన ఉత్పత్తులను ఎంచుకోవాలని ఆయన ప్రజలను కోరారు.

పెళ్లి (Marriage) టాపిక్ వచ్చినప్పటి నుండి, ఒక విషయం తనని చాలా కాలంగా కలవరపెడుతోందని... ఈ విషయాన్ని తమ కుటుంబ సభ్యులతో చెప్పుకోకుండా ఇంకెవరితో చెప్పుకోగలను అంటూ మాట్లాడారు మోదీ (Narendra Modi). ఒక్కసారి ఆలోచించండి... ఈ రోజుల్లో కొన్ని కుటుంబాలు విదేశాలకు వెళ్లి పెళ్లిళ్లు (Marriage) చేసుకునే కొత్త వాతావరణం సృష్టిస్తోంది. ఇది అవసరమా అంటూ ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు.

భారతదేశాన్ని ఎన్నుకోండి: 

విదేశాల్లో పెళ్లిళ్ల (Marriage) ట్రెండ్‌ను ఆపివేస్తే, భారత ప్రజలకు ఇలాంటి కార్యక్రమాల్లో సేవలు అందించే అవకాశం లభిస్తుందని ప్రధాని మోదీ (Narendra Modi) అన్నారు. మీ పెళ్లి (Marriage) గురించి పేదలు కూడా తమ పిల్లలకు చెబుతారు. మీరు ఈ 'వోకల్ ఫర్ లోకల్' మిషన్‌ను విస్తరించగలరా? అంటూ, మన దేశంలో ఇలాంటి వివాహ వేడుకలు ఎందుకు నిర్వహించకూడదు అని ప్రధాని ప్రశ్నించారు నరేంద్ర మోదీ (Narendra Modi).

విదేశాల్లో పెళ్లిళ్ల (Marriage)ను ఇష్టపడే చాలామంది ఇప్పుడు భారత్‌లో లేనప్పటికీ, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే వ్యవస్థలు కూడా అభివృద్ధి చెందుతాయని నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. ఇది చాలా పెద్ద కుటుంబాలకు సంబంధించిన అంశం అని, తాను చెప్పిన విషయం ఖచ్చితంగా ఆ పెద్ద కుటుంబాలకు చేరుతుందని ఆశిస్తున్నానని ప్రధాని మోదీ (Narendra Modi) అన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని, దేశ నిర్మాణానికి బాధ్యత వహిస్తే, ప్రపంచంలోని ఏ శక్తి కూడా ఆ దేశాన్ని అభివృద్ధి చేయకుండా ఆపలేదని నరేంద్ర మోదీ (Narendra Modi) సూచించారు. 

ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే చాలామంది డెస్టినేషన్ వెడ్డింగ్ (Destination Wedding) చేసుకున్న సెలబ్రిటీ లో మనం చూసుకోవచ్చు. దీపికా పదుకొనే & రణవీర్ సింగ్, జాన్ అబ్రహం మరియు ప్రియా రుంచల్, అనుష్క శర్మ & విరాట్ కోహ్లీ, లావణ్య త్రిపాఠి & వరుణ్ తేజ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది కూడా డెస్టినేషన్ వెయిటింగ్ చేసుకున్న దంపతులు ఉన్నారు. అయితే పెళ్లిళ్ల (Marriage) కోసం ఖర్చు పెట్టే ఖర్చు నీ భారత దేశంలో ఖర్చు పెడితే చాలా బాగుంటుంది అంటూ, డెస్టినేషన్ వెడ్డింగ్ (Destination Wedding) పేరుతో విదేశాలలో పెళ్లిళ్లు (Marriage) చేసుకోవడం వల్ల, భారతదేశానికి (India)సంబంధించిన డబ్బు వేరే దేశానికి ఖర్చు అవుతుంది అంటూ, ప్రతి ఒక్కరూ తమ సొంత భారతదేశం (India) లోనే వివాహాలు జరుపుకుంటే మంచిది అంటూ మాట్లాడారు నరేంద్ర మోదీ (Narendra Modi).