AP High Court : ఏపీ హైకోర్టు సంచలన తీర్పు.. ఇద్దరు ఐఏఎస్‌లకు జైలు శిక్ష

జగన్ పై దాడి కేసులో ఎన్ఐఏ కౌంటర్ దాఖలు

Courtesy: Pexels

Share:

AP High Court : ఇద్దరు ఏపీ ఐఏఎస్ (AP IAS) అధికారులకు హైకోర్టు (High Court) నెల రోజుల జైలు శిక్ష విధించింది. కోర్టు ధిక్కరణ పాల్పడినందుకు వెయ్యి రూపాయల జరిమానా కూడా విధించింది.

కోర్టు ధిక్కరణకు (Contempt of Court) పాల్పడ్డారని ఇద్దరు ఐఏఎస్లకు (IAS) నెల రోజుల జైలు శిక్ష విధిస్తూ ఏపీ హైకోర్టు (AP High Court) కీలక తీర్పు ఇచ్చింది. ఐఏఎస్ (IAS) అధికారులు జె. శ్యామలరావు(J. Shyama Rao), పోలా భాస్కర్కు (Pola Bhaskar) జైలు శిక్ష (Imprisonment) విధించింది. ఇద్దరు ఐఏఎస్లకు రూ. వెయ్యి చొప్పున జరిమానా కూడా విధించారు. నీరు-చెట్టు అంశంపై హైకోర్టు (High Court) ఆదేశాలను ధిక్కరించారని హైకోర్టు (High Court) తేల్చింది. వచ్చే నెల 8 లోపు రిజిస్ట్రార్జ్యుడీషియల్‌ (Registrar Judicial) వద్ద లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది.

  1. ముందు రాష్ట్రంలో జరిగిన నీరు-చెట్టు పనుల బిల్లులు (Bills of Water-Tree Works) కూడా ఇప్పటికీ చెల్లించలేదు. అవన్నీ చాలా వరకు చిన్న మొత్తాలే. వీరంతా కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశించినా బిల్లులు చెల్లించకపోవడంతో కోర్టు ధిక్కరణ కేసులూ (Contempt of Court) నమోదయ్యాయి. ధిక్కరణ కేసులకు సంబంధించినవే ఇంకా రూ.270 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. ఇవి కాక మరో రూ. 400 కోట్లకు పైగా పెండింగ్బిల్లులు (Pending Bills) ఉన్నాయి. వాటిని తక్షణమే చెల్లించాలని కాంట్రాక్టర్లతో పాటు బిల్డర్ల అసోసియేషన్‌ (Builders Association) వరుసగా వినతులు సమర్పిస్తున్నా చెల్లించలేదు. రహదారులు భవనాల శాఖ (Roads And Buildings Department) గత ఆర్థిక ఏడాదిలోనే బిల్లులు చేసి చెల్లించాల్సిన బకాయిలు రూ.332 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. బడ్జెట్మంజూరు (Budget sanction) లేక దాదాపు రూ. 500 కోట్ల బిల్లులు సీ.ఎఫ్.ఎమ్.ఎస్.లో అప్లోడ్ చేయలేదు. పంచాయతీరాజ్శాఖలోనూ రూ.430 కోట్ల వరకు చెల్లింపులు చేయాల్సి ఉంది.

వీటికి చెల్లింపులు చేయకపోవడంతో బాధితులు కోర్టుకు వెళ్లారు. చెల్లించాలని కోర్టు తీర్పు (Court judgment) ఇచ్చినా చెల్లించకపోగా.. ఎంపిక చేసుకున్న కొందరికే మంజూరు చేస్తూ.. మిగిలిన వారి విషయంలో వివక్ష చూపుతోంది. హైకోర్టు(High Court) జోక్యంతో కొంతమందికి ఉపశమనం లభించినా.. ప్రభుత్వం బిల్లులను చెల్లించలేదంటూ హైకోర్టులో దాఖలైన కోర్టు ధిక్కరణ వ్యాజ్యాల సంఖ్య వేలల్లో ఉంది. నేషనల్జ్యుడీషియల్డేటా గ్రిడ్‌ (National Judicial Data Grid) ప్రకారం.. 2023 అక్టోబర్‌ 23 వరకూ దేశ వ్యాప్తంగా లక్షా 17 వేల 324 కోర్టు ధిక్కరణ కేసులు హైకోర్టుల్లో పెండింగ్ల్లో ఉన్నాయి. ఇందులో అత్యధికంగా అలహాబాద్హైకోర్టులో 25 వేల 719 ధిక్కరణ కేసులుంటే.. రెండో స్థానంలో ఉన్న ఏపీ హైకోర్టులో 13 వేల 312 ధిక్కరణ కేసులు ఉన్నాయి. గతంలో కోర్టు ధిక్కరణ కేసుల్లో (Case of Contempt of Court) పలువురు ఐఏఎస్లకు (IAS) ఇలాగే శిక్షలు పడ్డాయి. అయితే డివిజన్ బెంచ్ కు వెళ్లి ఎలాగోలా బయటపడ్డారు. శిక్షలు పడిన తర్వాత కోర్టు ఉత్తర్వులు అమలు చేసి బయపడ్డారు. ఇప్పుడు కూడా అదే చేస్తారా లేకపోతే.. జైలుకు వెళ్తారా అన్నది చూాడాల్సి ఉంది.

ఏపీ హైకోర్టులో రెండో కేసులో ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి (Chief Minister YS Jaganmohan Reddy) దాఖలు చేసిన పిటిషన్పై జాతీయ దర్యాప్తు సంస్థ మంగళవారం కౌంటర్దాఖలు చేసింది. నాలుగేళ్ల తర్వాత తనపై ఎయిర్పోర్టులో (Airport) కత్తితో దాడి ఘటనలో కుట్ర జరిగిందని ఆరోపిస్తూ విజయవాడ ఎన్ఐఏ కోర్టులో సీఎం పిటిషన్ వేశారు. ఎన్ఐఏ కోర్టు విచారణ చేపట్టింది కానీ కేసును కొట్టివేసింది.

తాజాగా సీఎం హైకోర్టులో(High Court) మరో పిటిషన్ వేశారు. సీఎం పిటిషన్పై కౌంటర్ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. మంగళవారం ఎన్ఐఏ దాఖలు చేసింది. విమానాశ్రయంలో నిందితుల ప్రవర్తనపై ఎన్ఐఏ సమగ్ర వివరణ ఇచ్చింది. నిందితుడు శ్రీను (Srinu) జగన్వద్దకు వచ్చి వైఎస్ఆర్సీ 160 సీట్లు గెలుస్తుందని చెప్పి దాడికి పాల్పడ్డాడని ఎన్ఐఏ పేర్కొంది. కేసులో సాధారణ దర్యాప్తు కొనసాగుతుందని, లోతైన దర్యాప్తు పూర్తయినందున తదుపరి దర్యాప్తు అవసరం లేదని ఎన్ఐఏ (NIA) తెలిపింది.