Errabelli Dayakar Rao: పాలకుర్తి మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చెందింది

Errabelli Dayakar Rao: పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి, బీఆర్‌ఎస్‌(BRS) అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు(Errabelli Dayakar Rao) సోమవారం జనగాం జిల్లా పాలకుర్తి(Palakurthy) అసెంబ్లీ సెగ్మెంట్‌లోని తహశీల్దార్‌ కార్యాలయంలో తొలి సెట్‌ నామినేషన్‌(Nomination) దాఖలు చేశారు. ప్రజల ఆశీర్వాదంతో ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచానని, సీఎం కేసీఆర్‌(CM KCR) దీవెనలు, ప్రజాబలంతో మరోసారి విజయం సాధిస్తానని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురైన పాలకుర్తి సెగ్మెంట్‌ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు(CM […]

Share:

Errabelli Dayakar Rao: పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి, బీఆర్‌ఎస్‌(BRS) అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు(Errabelli Dayakar Rao) సోమవారం జనగాం జిల్లా పాలకుర్తి(Palakurthy) అసెంబ్లీ సెగ్మెంట్‌లోని తహశీల్దార్‌ కార్యాలయంలో తొలి సెట్‌ నామినేషన్‌(Nomination) దాఖలు చేశారు. ప్రజల ఆశీర్వాదంతో ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచానని, సీఎం కేసీఆర్‌(CM KCR) దీవెనలు, ప్రజాబలంతో మరోసారి విజయం సాధిస్తానని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ధీమా వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురైన పాలకుర్తి సెగ్మెంట్‌ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు(CM KCR) అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దారన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 50 పడకల ఆసుపత్రితో పాటు అత్యధికంగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు(Double bedroom houses), బొమ్మెర, వల్మిడి ఆలయాలను పునరుద్ధరించి ఆధ్యాత్మిక(spiritual), పర్యాటక కేంద్రం(Tourist center)గా తీర్చిదిద్దారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ స్థలం లేని కొన్ని గ్రామాల్లో నా జేబులోంచి డబ్బులు చెల్లించి కొనుగోలు చేశానని చెప్పారు.

ముదిరాజ్‌(Mudiraj) సామాజికవర్గానికి చెందిన సరస్సుల ఆక్రమణకు పాల్పడ్డారని కాంగ్రెస్‌(Congress) నేతలు చేస్తున్న ఆరోపణలను మంత్రి తిప్పికొట్టారు. చేపల పంపిణీ, చెరువులు, చెరువుల కేటాయింపులు చేసి సమాజాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేసిన ఘనత బీఆర్‌ఎస్‌(BRS) ప్రభుత్వానిదేనన్నారు. ప్రతిపక్ష నాయకుల తప్పుడు వాగ్దానాలకు ప్రజలు మోసపోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. నామినేషన్(Nomination) దాఖలు చేయడానికి ముందు, దయాకర్ రావు తన భార్య ఉష(Usha)తో కలిసి జిల్లా వ్యాప్తంగా పలు దేవాలయాల్లో ప్రార్థనలు చేశారు.

Also Read: Revanth Reddy: తెలంగాణలో రాబోయేది ఇందిరమ్మ రాజ్యమే: రేవంత్ రెడ్డి

10న రెండోసెట్‌ నామినేషన్‌

బీఆర్‌ఎస్‌ పాలకుర్తి(Palakurthy) నియోజకవర్గ అభ్యర్థి, రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు (Errabelli Dayakar Rao) ఈ నెల 10వ తేదీన రెండోసెట్‌ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. నామినేషన్‌ దాఖలు సందర్భంగా పాలకుర్తిలో నిర్వహించే భారీ బహిరంగ సభకు ముఖ్యఅతిథులుగా మంత్రులు తన్నీరు హరీశ్‌రావు(Harish Rao), సత్యవతి రాథోడ్‌(Satyavathi Rathod) హాజరుకానున్నారు. స్థానిక బస్టాండ్‌ సమీపంలో బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో సభా స్థలిని మంత్రి ఎర్రబెల్లి మంగళవారం పరిశీలించారు. 

సభ ఏర్పాట్లపై బీఆర్‌ఎస్‌ నాయకులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్‌ సందర్భంగా నిర్వహించే సభకు రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, సత్యవతి రాథోడ్‌, శాసనమండలిలో డిప్యూటీ చైర్మన్‌ బండా ప్రకాశ్‌, బీఆర్‌ఎస్‌ స్టేషన్‌ఘన్‌పూర్‌ అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌, ఆరోగ్యశ్రీ ట్రస్టు చైర్మన్‌ మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఎన్‌ సుధాకర్‌రావు హాజరవుతారని చెప్పారు. నామినేషన్‌ సందర్భంగా నిర్వహించే సభకు నియోజకవర్గం నుంచి ప్రజలు పెద్ద ఎత్తున హాజరవుతారన్నారు. 

ఎర్రబెల్లి స్కెచ్..!

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Errabelli Dayakar Rao) డబుల్ హ్యాట్రిక్ విజయాలు సాధించి, తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నారు. మాస్ లీడర్ గా పేరుగాంచి నియోజకవర్గం మొత్తాన్ని తన కంట్రోల్ లో పెట్టుకున్నారు. కాగా 1994 నుంచి 2018 వరకు జరిగిన ఆరు ఎన్నికల్లో ఆయన వివిధ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓటమి ఎరగకుండా డబుల్ హ్యాట్రిక్ కొట్టారు. 

చివరిసారిగా పాలకుర్తి (Palakurthy )నియోజకవర్గం నుంచి విజయాన్ని అందుకున్నారు. కాగా రాష్ట్రంలో కాంగ్రెస్(Congress) హవా నడుస్తోందనే ప్రచారం జరుగుతుండటం, స్థానికంగా కూడా ఆయనపై కొంత వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో మంత్రి దయాకర్రావు సెల్ఫ్ డిఫెన్స్ లో పడ్డారు. ఈ మేరకు అపోజిషన్ పార్టీల నుంచి ముఖ్య నాయకులు, యూత్ చేరికలపై దృష్టి పెట్టినట్టు తెలిసింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టి, తన గెలుపు అవకాశాలను మెరుగు పరుచుకోవాలనే ఉద్దేశంతో ఆయన స్కెచ్ గీసి అమలు చేస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గంలో మూకుమ్మడి రాజీనామాలు కూడా ఆయన ప్లాన్ లో భాగంగానే జరిగాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మున్ముందు మరిన్ని చేరికలు జరిగే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.