Alert: అభయ హస్తం పేరుతో ఓటీపీ అడిగితే చెప్పొద్దు.. అధికారుల సూచన

Abhaya Hastam : తెలంగాణలో అభయ హస్తం దరఖాస్తుల పేరును ఆసరాగా చేసుకుని సైబర్ నేరస్థులు కొత్తరకం మోసాలకు తెరలేపారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

Courtesy: IDL

Share:

హైదరాబాద్: తెలంగాణలో అభయ హస్తం దరఖాస్తుల పేరును ఆసరాగా చేసుకుని సైబర్ నేరస్థులు కొత్తరకం మోసాలకు తెరలేపారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలనలో అభయ హస్తం దరఖాస్తుదారులను టార్గెట్ చేసుకుని సైబర్ అటాక్స్ జరుగుతున్నాయని హెచ్చరించారు.  తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఐదు గ్యారెంటీల అమలు కోసం ప్రజాపాలన పేరుతో ప్రజల నుంచి అభయహస్తం దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభించిన విషయం తెలిసిందే.  2023  డిసెంబర్ 28 నుంచి  2024 జనవరి 6 వరకు పది రోజుల పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. రాష్ట్రవ్యాప్తంగా.. పది రోజుల్లో మొత్తం 1,25,84,383 దరఖాస్తులు వచ్చాయి.   

ఈ  5 గ్యారంటీల కోసం అప్లై చేసుకున్న వారిని లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు ఇప్పుడు టార్గెట్ చేశారు. లబ్దిదారులకు ఫోన్ చేసి మీకు ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు, గ్యాస్ సిలిండర్ మంజూరు అయిందని చెప్తూ, మీ ఫోన్ నెంబర్‌కు ఓటీపీ వస్తుందని ఓటీపీ చెప్పాలంటూ కొత్తరకం మోసాలకు పాల్పడుతున్నారు. ఎంతో కొద్దీగా అకౌంట్లో దాచుకున్న డబ్బులను దోచుకుంటున్నారు. అయితే ఇలాంటి ఫేక్ కాల్స్ తో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెప్తున్నారు. ఎవరికీ కూడా ఓటీపీలు షేర్ చేయోద్దని అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక నిన్నటి వరకు అభయహస్తం తీసుకున్న దరఖాస్తులను అధికారులు వాటిని ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ప్రత్యేక సాఫ్ట్ వేర్‌లో ఎంటర్ చేసే ప్రక్రియ మొదలు పెట్టారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత అందులోని అర్హుల జాబితాను సిద్ధం చేయనున్నారు. 

ప్రజాపాలన పేరుతో ఎవరైనా ఓటీపీల కోసం ఫోన్ చేస్తే చెప్పవద్దని అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ప్రాసెస్‌ ప్రారంభించలేదని పోలీసులు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మీ వ్యక్తిగత విషయాలు కానీ ఓటీపీ కానీ ఎవరికీ చెప్పొందంటూ సూచిస్తున్నారు. ఎవరైనా ఇలాంటి కాల్స్ వస్తే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.

ప్రజాపాలన కోసం కాంగ్రెస్ సర్కార్ ప్రత్యేకంగా ఓ వైబ్ సైట్ ను రూపొందించింది. ఈ వైబ్ సైట్(www.prajapalana.telangana.gov.in) ను సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రారంభించనున్నారు.   ప్రతి 4 నాలుగు నెలలకోసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే మహా లక్ష్మీ పథకంలో భాగంగా ఉచితంగా బస్సుతో పాటు రాజీవ్ ఆరోగ్య శ్రీ బీమా పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.