Rahul Gandhi: మేడిగడ్డ బ్యారేజ్ సందర్శించిన రాహుల్ గాంధీ

ఇటీవల మేడిగడ్డ (Medigadda) ప్రాజెక్ట్ (Project) బ్యారేజ్ (barrage) పిల్లర్స్ కు సంబంధించి వార్తలు వెలువడుతున్నాయి. బ్యారేజ్ (barrage) మధ్యలో ఉన్న రెండు మూడు పిల్లర్లు నీటిలో కృంగడం ప్రతి ఒక్కరినీ భయాందోళనకు గురిచేస్తుంది. అయితే కన్స్ట్రక్షన్ లోపాలు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, పూర్తి కేసీఆర్  (KCR) ప్రభుత్వం వైఫల్యం అంటూ నిలదీస్తున్నారు తెలంగాణ (Telangana) ప్రతిపక్ష నాయకులు. ఈ క్రమంలోనే ఇటీవల రాహుల్ గాంధీ (Rahul Gandhi) (Rahul Gandhi) మేడిగడ్డ బ్యారేజ్ (Medigadda) సందర్శించడం జరిగింది.  […]

Share:

ఇటీవల మేడిగడ్డ (Medigadda) ప్రాజెక్ట్ (Project) బ్యారేజ్ (barrage) పిల్లర్స్ కు సంబంధించి వార్తలు వెలువడుతున్నాయి. బ్యారేజ్ (barrage) మధ్యలో ఉన్న రెండు మూడు పిల్లర్లు నీటిలో కృంగడం ప్రతి ఒక్కరినీ భయాందోళనకు గురిచేస్తుంది. అయితే కన్స్ట్రక్షన్ లోపాలు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, పూర్తి కేసీఆర్  (KCR) ప్రభుత్వం వైఫల్యం అంటూ నిలదీస్తున్నారు తెలంగాణ (Telangana) ప్రతిపక్ష నాయకులు. ఈ క్రమంలోనే ఇటీవల రాహుల్ గాంధీ (Rahul Gandhi) (Rahul Gandhi) మేడిగడ్డ బ్యారేజ్ (Medigadda) సందర్శించడం జరిగింది. 

మేడిగడ్డ బ్యారేజ్ సందర్శించిన రాహుల్ గాంధీ: 

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన  కాళేశ్వరం (Kaleshwaram) లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ (కెఎల్‌ఐఎస్‌) ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతాపరమైన సమస్యలపై కాంగ్రెస్ (Congress) దృష్టి సారిస్తూ, ఏఐసిసి మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) గురువారం మేడిగడ్డ (Medigadda) బ్యారేజీ (barrage)ని పరిశీలించారు. తెలంగాణ (Telangana) రాష్ట్ర కాంగ్రెస్ (Congress) అధ్యక్షుడు ఎ.రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి రాహుల్ గాంధీ (Rahul Gandhi) మేడిగడ్డ (Medigadda) బ్యారేజీ (barrage) దెబ్బతిన్న పిల్లర్లను పరిశీలించారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ మండలం అంబటిపల్లి గ్రామంలో గురువారం ఆయన ప్రాజెక్టు, దెబ్బతిన్న ప్రాంతాల ఫొటోలు తీశారు.

ఈ సందర్భంలోనే బ్యారేజీ (barrage)ని పరిశీలించేందుకు కాంగ్రెస్ (Congress)‌ నేతలకు అనుమతి నిరాకరించిన పోలీసు అధికారులు, అయితే ఈ క్రమంలోనే అక్కడ వాతావరణం వేడెక్కింది. ధర్నాలకు దిగుతామంటూ చాలామంది ముందుకు రావడం జరిగింది.. తీవ్ర వాగ్వాదం తర్వాత తర్వాత బ్యారేజీ (barrage)ని తనిఖీ చేసేందుకు ఆరుగురు సభ్యులను అనుమతించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ  కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టు పేరుతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజాధనాన్ని ఏ విధంగా లూటీ చేసిందో.. చూసేందుకు తామే స్వయంగా మేడిగడ్డ (Medigadda) బ్యారేజీ (barrage)ని సందర్శించామన్నారు.

అవినీతిలో కూరుకుపోయిన  కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టులో భాగమైన బ్యారేజీ (barrage) నిర్మాణ నాణ్యత లోపించడం వల్లే బహుళ స్తంభాలకు పగుళ్లు ఏర్పడ్డాయని కాంగ్రెస్ (Congress) నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. 

తమ పాలనలో ఇటువంటివి ఉండబోవు అంటున్న రాహుల్: 

కాంగ్రెస్‌ (Congress) ప్రభుత్వం నిర్మించిన ఎస్‌ఆర్‌ఎస్‌పి, ప్రియదర్శిని జూరాల, నాగార్జున సాగర్‌, సింగూరు ప్రాజెక్టులను.. కేవలం ఏడాదిలోపు ముంపునకు గురవుతున్న  కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టులతో పోల్చి చూడాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చిన తర్వాత కెసిఆర్ (KCR) దోచుకున్న సొమ్మునంతా ప్రజలకు పంచుతామన్నారు రాహుల్ గాంధీ (Rahul Gandhi).

రాబోయే ఎన్నికలను కెసిఆర్ (KCR) నేతృత్వంలోని దొరల తెలంగాణ (Telangana) మరియు కాంగ్రెస్ (Congress) నేతృత్వంలోని ప్రజా తెలంగాణ (Telangana) మధ్య పోరుగా అభివర్ణించిన రాహుల్ గాంధీ (Rahul Gandhi), కాంగ్రెస్ (Congress) మహిళలకు మహాలక్ష్మి కింద నెలకు రూ.2,500 చెల్లిస్తుందని అన్నారు. ఈ పథకం ద్వారా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించచ్చు. ప్రస్తుత తెలంగాణ (Telangana) ప్రభుత్వంలో..ప్రజలు గ్యాస్ సిలిండర్‌కు రూ.1,200 చెల్లిస్తున్నారని రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. కానీ కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్యాస్ సిలిండర్ ధర రూ.500కు తగ్గుతుందన్నారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ (Congress)తో పోరాడేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎంలు కుమ్మక్కయ్యాయని, ప్రజా ధనాన్ని మరింత దోచుకుంటున్నాయని రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి ఆరోపించారు. ఇలాంటి పార్టీలకు గుణపాఠం చెప్పాలంటే తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ (Congress) పార్టీని ప్రజలు ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు.