Rajasthan: రాజస్థాన్‌లో దారుణం.. 4 ఏళ్ల చిన్నారిపై ఎస్సై అత్యాచారం

చితకబాదిన గ్రామస్థులు..

Share:

Rajasthan: పోలీస్ శాఖలో ఉన్నతమైన హోదాలో ఉన్న ఓ పోలీస్ ఆఫీసర్ అభం, శుభం తెలియని 4 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం(Rape) చేశాడు. రాజస్థాన్(Rajasthan)​లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. రాష్ట్రంలో అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం(Ashok Gehlot Govt)పై బీజేపీ(BJP) తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.

 

రాజస్థాన్(Rajasthan)​లోని దౌసా జిల్లాలో(Dausa) జరిగింది ఈ ఘటన. సబ్​ ఇన్​స్పెక్టర్​ భూపేంద్ర సింగ్​(Bhupendra Singh).. ఎన్నికల డ్యూటీలో(Election Duty) ఉన్నాడు. కాగా.. అతడిని ఓ 4ఏళ్ల చిన్నారి కనిపించింది. ఆమెను తన రూమ్​లోకి తీసుకెళ్లి రేప్​ చేశాడు. చిన్నారిని పోలీసులు అధికారి రేప్​ చేశాడన్న వార్త.. సంబంధిత గ్రామంలో కలకలం రేపింది. నాలుగేళ్ల చిన్నారి అత్యాచారానికి గురవడంతో ఆగ్రహించిన గ్రామస్థులు పోలీస్​ స్టేషన్​కు వెళ్లి, భూపేంద్ర సింగ్​ను చితకబాదారు. అనంతరం.. పోలీసులు అతడిని అరెస్ట్(Arrest)​ చేశారు.

 

"సమీపంలో నివసిస్తున్న కుటుంబీకుల ఫిర్యాదు మేరకు భూపేంద్ర సింగ్​(Bhupendra Singh)గా గుర్తించిన ఎస్‌ఐ పై రహువాస్ పోలీస్ స్టేషన్‌లో(Rahuas Police Station) కేసు నమోదైంది. మైనర్ బాలికకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు" అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. భారతీయ జనతా పార్టీ (BJP) ఎంపీ కిరోరి లాల్ మీనా (MP Kirodi Lal Meena)కూడా పోలీస్ స్టేషన్‌లో ఉన్నారు. ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని, బాలిక కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించారు. "నేను అమ్మాయికి సహాయం చేయడానికి ఇక్కడకు వచ్చాను" అని ఆయన అన్నారు, " ఎన్నికలు మళ్లీ వస్తాయి, కుటుంబానికి న్యాయం చేయడమే నా మొదటి ప్రాధాన్యత, ఇది సిగ్గుపడాల్సిన సంఘటన." అని ఆయన అన్నారు.

 

రాజస్థాన్‌(Rajasthan)లో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం కేసులో సీనియర్ పోలీసు నిందితుడిగా ఉన్న ఘటన అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని(Ashok Gehlot Govt) ఎన్నికలకు ముందు ఇరుకున పెట్టింది. విస్తీర్ణం పరంగా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం రాజస్థాన్. అత్యాచారాలు అధికంగా జరిగే రాష్ట్రం కూడా ఇదే అని లెక్కలు చెబుతున్నాయి. 2021లో, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB), గణాంకాల ప్రకారం దేశంలో రాజస్థాన్‌లో అత్యధిక అత్యాచారాలు 6,337 జరిగాయి.

 

కాంగ్రెస్(Congress) అధికారంలో ఉన్న ఐదేళ్లలో రాష్ట్రంలో అత్యాచారాలు ఎందుకు పెరుగుతున్నాయని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని బీజేపీ(BJP) ప్రశ్నించింది. నిందితుడిపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వ యంత్రాంగం అతడిని రక్షించే పనిలో పడిందని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా(Shehzad Poonawalla) ఆరోపించారు. తక్షణమే సస్పెన్షన్‌ చేయలేదన్నారు. నిందితుడు పోలీసు అధికారికి సాక్ష్యాలను నాశనం చేయడానికి ఇద్దరు పోలీసులు సహాయం చేశారని, వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని పూనావాలా ప్రశ్నించారు. గెహ్లాట్ కేబినెట్‌లోని రాజస్థాన్ మంత్రి ప్రతాప్ ఖచరియావాస్(Pratap Khachariawas) మాట్లాడుతూ, "ఇటువంటి కేసులలో దోషులను ఉరితీయాలి, నేరాలను నిరోధించడం ప్రతి ఒక్కరి బాధ్యత, దోషులను విడిచిపెట్టకూడదు అని అన్నారు.

 

ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులపై తక్షణమే చర్యలు తీసుకున్నామని రాజస్థాన్ ప్రభుత్వం తన వైఖరిని సమర్థించుకుంది. రాజస్థాన్ డీజీపీ ఉమేష్ మిశ్రా(DGP Umesh Mishra) మాట్లాడుతూ.. ఈ కేసులో కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇచ్చామని.. ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ను విధుల నుంచి తప్పించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.

 

ఇలాంటి సంఘటనలు జరుగుతాయి కానీ దోషులకు ఉరిశిక్ష విధించేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. వాస్తవానికి.. రాజస్థాన్​లో నేరాలు(Crimes) ఇటీవలి కాలంలో ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. గడిచిన 3,4 నెలలుగా ఇక్కడ రేప్​ కేసులు(Rape Cases) ఆందోళనకరంగా మారాయి. ఎన్నికల సమయంలో కాంగ్రెస్​కు(Congress) ఇది తలనొప్పి వ్యవహారమే.  రాజస్థాన్‌లో నవంబర్ 25న ఎన్నికలు జరగనుండగా, రాష్ట్రంలో శాంతిభద్రతలు, మహిళల భద్రత ఇప్పటికే ప్రధాన ఎన్నికల సమస్యలుగా మారాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం, తెలంగాణ ఎన్నికల ఫలితాలతో పాటు రాజస్థాన్ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న వెలువడనున్నాయి.