Singhania Divorce: విడాకులు కావాలంటే ఆస్తిలో 75 శాతం ఇవ్వాల్సిందే..

సందిగ్ధంలో రేమండ్ బాస్

Courtesy: Twitter

Share:

Singhania Divorce: రేమండ్ (Raymond) గ్రూప్ చైర్మన్ గౌతమ్ సింఘానియా(Gautam Singhania) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా ఆయన భార్యతో విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. తాజాగా వీరు విడాకులు(Divorce) ప్రకటించగా, తనకు భరణం కింద ఆస్తిలో 75 శాతం వాటా ఇవ్వాలని ఆయన భార్య డిమాండ్ చేయడం కలకలం సృష్టిస్తోంది.

 రేమండ్ కంపెనీ చైర్మన్ గౌతమ్ సింఘానియా(Gautam Singhania) ఇటీవల తన భార్య నవాజ్ మోడీ సింఘానియాతో(Nawaz Modi Singhania) విడిపోయేందుకు విడాకులకు(Divorce) అప్లై చేశారు. కానీ ప్రస్తుతం ఆయన భార్య విడాకులు ఇవ్వాలంటే అదిరిపోయే షరతు (Condition) విధించారు. భరణం కింద ఆమె తన కుమార్తె నిహారిక, నిషా, తనకు 1.4 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 11,620 కోట్లు) అంటే ఆస్తిలో 75% వాటా రాసివ్వాలని కోరింది. ఎకనామిక్స్ టైమ్స్ తన వెబ్ పోర్టల్ లో ఈ విషయం వెల్లడించింది.

సోర్సెస్ ప్రకారం, సింఘానియా(Singhania) తన భార్య నుండి విడిపోవడానికి పలు షరతులకు అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే కుటుంబ ట్రస్ట్‌ను(Family trust) ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. సింఘానియా సంపదతో పాటు ఆస్తులను ట్రస్ట్‌కు బదిలీ చేయాలని కోరారు. దీనికి గౌతం సింఘానియా(Gautam Singhania) ఏకైక మేనేజింగ్ ట్రస్టీగా ఉంటారు. గౌతమ్ సింఘానియా మరణానంతరం, అతని కుటుంబ సభ్యులకు అతని ఆస్తిని బదిలీ చేయడానికి ఇది అనుమతిస్తుంది. అయితే, ఫ్యామిలీ ట్రస్ట్ ఏర్పాటు సూచనతో నవాజ్ మోదీ(Nawaz Modi )ఏకీభవించడం లేదు. 

దీనిపై నవాజ్ మోడీ సింఘానియా(Nawaz Modi Singhania) మాట్లాడుతూ - గౌతం ప్రతిపాదనపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. దీని గురించి గౌతమ్ సింఘానియాకు మెయిల్ పంపామని, అయితే ఇప్పటి వరకు అతను ఎలాంటి సమాధానం ఇవ్వలేదని ఎకనామిక్స్ టైమ్స్ తెలిపింది. నవాజ్ మోడీ సింఘానియా(Nawaz Modi Singhania) ఆదివారం పంపిన ఇమెయిల్‌కు(Email) ప్రతిస్పందనగా, గత కొన్ని వారాలుగా దీని గురించి చర్చలు జరుగుతున్నాయని, ఇది ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయని వార్తా కథనంలో తెలిపింది. దీనిపై నవాజ్ మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఇదిలా ఉంటే గౌతమ్ సింఘానియా తన భార్య నవాజ్ మోడీ సింఘానియా నుండి విడిపోయిన విషయాన్ని నవంబర్ 13న తెలియజేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఈ విషయం తెలిపారు.

 ఇదిలా ఉంటే తన తండ్రి విజయపత్ సింఘానియాతో(Vijaypat Singhania) విభేదాల కారణంగా కొన్నేళ్ల క్రితం గౌతమ్ సింఘానియా((Gautam Singhania) ) వార్తల్లో నిలిచారు. విజయపత్ సింఘానియా రేమండ్ గ్రూప్‌(Raymond Group) వ్యవస్థాపకుడు కాగా, ఈ గ్రూపు దుస్తుల తయారీలో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. గౌతమ్ సింఘానియా నికర విలువ దాదాపు రూ.11,000 కోట్లు. రేమండ్ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా(Gautam Singhania) ఆస్తుల విషయానికి వస్తే ఆయన నివసించే JK హౌస్ దేశంలోని విలాసవంతమైన ఇళ్లలో ఒకటి. 145 మీటర్ల ఎత్తైన ఈ భవనం ముంబైలోని(Mumbai) అల్టామౌంట్ రోడ్‌లో ఉంది, రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ నివసించే యాంటిలియా కూడా ఇదే ప్రాంతంలో ఉంది. 

గౌతమ్ సింఘానియా(Gautam Singhania) JK హౌస్ 30-అంతస్తుల భవనం ఈ భవనంలో రెండు స్విమ్మింగ్ పూల్స్, హెలిప్యాడ్, స్పా, జిమ్, వినోద సౌకర్యాలు మరెన్నో ఉన్నాయి. ఈ భవనంలో ఖరీదైన కార్లను పార్కింగ్ చేయడానికి ఐదు అంతస్తులు ఉన్నాయి. ఆకాశహర్మ్యం విలువ దాదాపు రూ.6,000 కోట్లు. గౌతమ్ సింఘానియా 1999లో రేమండ్ కంపెనీ ఎండీగా, 2000లో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. గౌతమ్ బాధ్యతలు చేపట్టిన వెంటనే గ్రూపులో చాలా మార్పులు చేశాడు. ఫ్యాబ్రిక్స్, రెడీమేడ్ దుస్తులు, డియోడరెంట్లు, కండోమ్స్ ఇలా వ్యాపారాన్ని విస్తరించడంపై దృష్టి సారించాడు. ఈ సమయంలో అతని తండ్రి విజయపత్ సింఘానియాతో వివాదం మొదలైంది. 

జేకే హౌస్ విషయంలో కూడా తండ్రికొడుకుల మధ్య వాగ్వాదం జరిగింది. గౌతమ్ సింఘానియా(Gautam Singhania) తన తండ్రి తనను ఇంటి నుంచి గెంటేశారని ఆరోపించారు. దీంతో వివాదం కోర్టుకు చేరింది. ఆ సమయంలో కుటుంబ కలహాలు వీధిన పడ్డాయి. తాజాగా సింఘానియా బ్రదర్స్ వివాదం కోర్టుకు చేరింది. విజయపత్ సింఘానియా, అతని సోదరుడు మధుపతి సింఘానియా కూడా ఆస్తుల వివాదంలో పోరాటం చేస్తున్నారు.