Raymond: రేమండ్ వ్యవస్థాపకుడి విషాద గాధ

ఈ బాధలు తప్పవా..

Courtesy: Twitter

Share:

Raymond: డబ్బు కోసం ఎంతోమంది పిల్లలు తమ తల్లిదండ్రులను వీధి పాలు చేసిన సంఘటనలు మనం చూసే ఉంటాము. అయితే కేవలం ఇది మధ్యతరగతి కుటుంబాలకే పరిమితం కాలేదు. పెద్దపెద్ద కుటుంబాలలో ఎటువంటి కలహాలు ఉండవు, డబ్బుకి కొదవే ఉండదు.. ఇంక తల్లితండ్రులకు బాధలే (Sad) ఉంటాయి అనుకోవచ్చు.. కానీ రేమండ్ (Raymond) వ్యవస్థాపకుడి విజయపత్ (Vijaypat) సింఘానియా విషాద గాధ వింటే, ఒక పెద్ద కంపెనీ యజమానికి ఇటువంటి పరిస్థితి ఏమిటా మీరే ఆశ్చర్యపోతారు. 

 

రేమండ్ (Raymond) వ్యవస్థాపకుడి విషాద గాధ: 

 

రేమండ్ (Raymond) MD మరియు ఛైర్మన్ గౌతమ్ (Gautam) సింఘానియా మరియు అతని భార్య, కంపెనీ మాజీ చీఫ్ మరియు గౌతమ్ (Gautam) సింఘానియా తండ్రి, విజయపత్ (Vijaypat) సింఘానియా, నవాజ్ మోడీ సింఘానియా మధ్యలో ఉన్న కొన్ని కలహాల గురించి ఇటీవల గౌతమ్ (Gautam) తండ్రి విజయ పాత్ నోరు విప్పారు. బిజినెస్ టుడేకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో, అతను తన కొడుకుతో తనకి ఉన్న అపోహలు గురించి నోరు విప్పారు. తన కొడుకుకు తన ఆస్తులను వదులుకున్నందుకు విచారం వ్యక్తం చేశాడు. ఇప్పుడు తన తండ్రి రోడ్డు మీద పడడం చూసి, గౌతమ్ (Gautam) సింఘానియా.. సంతోషిస్తూ ఉంటాడని మాట్లాడారు. నిజానికి ఇటువంటి ఒకరోజు వస్తుందని రేమండ్ (Raymond) ఎండి విజయపత్ (Vijaypat) ఎప్పుడు అనుకోలేదని, ఇటువంటి దురదృష్టకరమైన సంఘటనలు ఎదురవుతాయని తమ సొంత కుటుంబమే ఇలా బాధపడుతుందని (Sad) కలలో కూడా ఊహించుకోలేదని వెల్లడించారు. 

అయితే తన కొడుకు గౌతమ్ (Gautam) కి, ఆయనకి మధ్య ఉన్న విభేదాల గురించి, ఇటీవల విడుదల చేసిన అతను రెండో బుక్ లో స్పష్టంగా కనిపిస్తుందని అడిగిన ప్రశ్నకు, రేమండ్ (Raymond) ఎండి విజయపత్ (Vijaypat) సమాధానమివ్వడం జరిగింది. అయితే తన బుక్కు గురించి మాట్లాడడానికి తన సంతోషంగానే ఉందని, నిజానికి అన్ని నిజాలు కూడా తను తన బుక్కులో స్పష్టంగా ఎటువంటి పెద్ద పదాలు వాడకుండా చిన్న చిన్న పదాలతో అందరికీ అర్థమయ్యే విధంగానే రాసినట్లు చెప్పకువచ్చాడు విజయపత్ (Vijaypat). అంతేకాకుండా ఇది ప్రతి తల్లిదండ్రులకు అర్థమయ్యే విధంగా ఉంటుందని, ముఖ్యంగా తమకి ఉన్నదంతా పిల్లలకు ఇచ్చే ముందు ఒక్కసారి తల్లిదండ్రులు ఆలోచించాలని, తమ ఏది ఇవ్వాలనుకుంటున్నామో అది మాత్రమే ఇస్తే బాగుంటుందని మాట్లాడారు. అంతేకానీ అసలు తమ పిల్లలకు ఏది ఇవ్వద్దు అంటూ తను చెప్పట్లేదు అని కూడా వెల్లడించాడు విజయపత్ (Vijaypat). అయితే మీ జీవితం అవ్వకముందే మీకు ఉన్నదంతా పిల్లలకు ఇవ్వడం వారిని పక్కదారి పట్టించింది అవుతుందని ఆయన మరొకసారి తాను చేసిన తప్పును గుర్తు చేసుకున్నారు రేమండ్ (Raymond) ఎండి విజయ పత్. 

విజయ పత్ తన కోడలు, గౌతమ్ (Gautam) భార్య నవాజ్ గురించి కూడా మాట్లాడటం జరిగింది. ఆమె కూడా ఒక పెద్ద కుటుంబం నుంచే వచ్చిందని, నిజానికి ఆమె తండ్రి ఒక సీనియర్ లాయర్ అంటూ గుర్తు చేశారు. అయితే నిజానికి ఎదిగిన మనుషులకు సలహా ఇవ్వడం వారు చేసే పనుల మధ్య వేలు పెట్టడం తనకి నచ్చదు అంటూ, ఒకసారి తాను హెల్ప్ చేయడానికి ముందుకు వెళ్లినప్పటికీ తాము హ్యాండిల్ చేస్తామంటూ బిజినెస్ విషయాల గురించి తన కోడలు మాట్లాడినట్లు విజయ పత్ చెప్పుకొచ్చారు. ఆమె కూడా పెద్ద చదువులు చదివిన ఒక లాయర్, అయినప్పటికీ ఆమె ఎప్పుడూ ప్రాక్టీస్ చేయలేదని వెల్లడించారు. ఒకవేళ తనవైపు నుంచి ఏదైనా సహాయం చేయగలిగితే తప్పకుండా చేస్తానని, కానీ ఎదిగిన పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వడం మనకున్న హక్కు కాబట్టి తాను ఎప్పుడూ కూడా ఎదుట వారి స్వేచ్ఛ గురించి ఆలోచిస్తానని మాట్లాడారు రేమండ్ (Raymond) ఎండి విజయపత్ (Vijaypat).