Telangana: ఆర్ఎస్ఎస్ కాంగ్రెస్ కోసం పని చేస్తుందా: ఒవైసీ

నాలుగు రోజుల్లో తెలంగాణలో ఎన్నికలు

Courtesy: Twitter

Share:

Telangana: ఇప్పటికే చాలా రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల (Elections) జోరు మొదలైంది. నాయకులు తమ మేనిఫెస్టో గురించి ప్రజలకు హామీ ఇస్తూ సన్నాహాలు జరిపిస్తున్నారు. అయితే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ (Telangana) మరియు మిజోరం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల (Elections)కు సంబంధించి ఎలక్షన్ కమిషన్ (Election commission) తేదీలు ఖరారు చేసిన విషయం తెలిసిందే. నవంబర్ 30న తెలంగాణ (Telangana)లో అసెంబ్లీ ఎన్నికలు (Elections) జరగనున్నవేళ, హైదరాబాద్ నుంచి సుమారు 2,290 మంది అభ్యర్థులు (Candidates) పోటీపడుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా తెలంగాణ (Telangana)లో ఆర్‌ఎస్‌ఎస్‌ (RSS) వ్యక్తులు ఢిల్లీ నుంచి వచ్చి కాంగ్రెస్‌ (Congress) కోసం పనిచేస్తున్నారని ఆల్‌ ఇండియా మజ్లిస్‌-ఇ-ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ (Owaisi) ఆరోపించారు. 

కాంగ్రెస్ కోసం పని చేస్తున్నారు:

హైదరాబాద్‌లోని నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో శుక్రవారం పార్టీ అభ్యర్థి మాజీద్ హుస్సేన్ బహిరంగ సభలో ఒవైసీ (Owaisi) మాట్లాడారు. ఈ ఎన్నికల్లో AIMIM అభ్యర్థి మాజీద్ హుస్సేన్ గెలవకుండా చూసేందుకు, RSS వ్యక్తులు ఢిల్లీ నుండి వచ్చి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారని.. వారు (RSS) వారు కాంగ్రెస్ అభ్యర్థికి బహిరంగంగా మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారని, ఒవైసీ (Owaisi) పేర్కొన్నారు. ట్రిపుల్‌ తలాక్‌ చట్టాన్ని ముస్లిం మహిళలకు వ్యతిరేకంగా ప్రయోగిస్తారని తాను బహిర్గతం చేయడం బీజేపీ (BJP), కాంగ్రెస్‌ (Congress)లకు నచ్చలేదని ఒవైసీ (Owaisi) అన్నారు.

గతంలో ఓవైసీ  (Owaisi) సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ (Owaisi)పై హైదరాబాద్‌లో ఓ పోలీసు అధికారిని బెదిరించిన ఆరోపణలపై కేసు నమోదైంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోసం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను పాటించాలని కోరిన పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ను అక్బరుద్దీన్ ఒవైసీ (Owaisi) మంగళవారం బెదిరించారు. తన ప్రసంగాన్ని ఆపాలని కోరడంతో అక్బరుద్దీన్ పోలీసులను బెదిరించాడు. హైదరాబాద్‌లోని లలితాబాగ్‌లో ప్రచారంలో ప్రసంగిస్తున్న AIMIM నాయకుడు, వేదిక నుండి వెళ్లిపోవాలని పోలీసును కోరారు.

కత్తులు మరియు బుల్లెట్ల బెదిరింపులకు గురైన తర్వాత, తాను నిజానికి బలహీనపడ్డాను అని చాలామంది అనుకుంటున్నారని, ఇప్పటికీ తనలో చాలా ధైర్యం ఉందని.. ఎదుటివారిని పరిగెత్తించే సత్తా తనలో ఉందని తనతో పాటు ప్రజలు చెయ్యి కలుపుతారా అంటూ ప్రసంగంలో ప్రశ్నించారు ఒవైసీ (Owaisi). ఈ విషయంలో, అసదుద్దీన్ ఒవైసీ (Owaisi) తన సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ (Owaisi) వ్యాఖ్యలను కూడా సమర్థించారు. రోజుకు ప్రచార సమయం ముగియడానికి ఐదు నిమిషాలు మిగిలి ఉన్నందున అధికారి జోక్యం చేసుకోకూడదని అన్నారు. అభ్యర్థుల ప్రచారానికి రాత్రి 10 గంటల వరకు అనుమతి ఉందని అసదుద్దీన్ ఒవైసీ (Owaisi) తెలిపారు. 

హైదరాబాద్ నుంచి 2,290 అభ్యర్థులు: 

నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల (Elections)కు 2,290 మంది అభ్యర్థులు (Candidates) బరిలో ఉన్నారని, ఎల్‌బీ నగర్ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 48 మంది అభ్యర్థులు (Candidates) బరిలో నిలిచారని ఎలక్షన్ కమిషన్ (Eelection commission) గురువారం వెల్లడించింది. డేటా ప్రకారం, 2,898 నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయి, 608 మంది అభ్యర్థులు (Candidates) తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు, ప్రస్తుతానికి మొత్తం పోటీదారుల సంఖ్య 2,290 కి తగ్గింది.

అభ్యర్థుల సంఖ్య 16కు మించి ఉన్నందున 55 నియోజకవర్గాల్లో రెండు నుంచి ఐదు వరకు అదనపు ఈవీఎంలను ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు ఏర్పాటు చేసేందుకు ఎలక్షన్ కమిషన్ (Eelection commission) ఏర్పాట్లు చేస్తుంది.

హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్, నాంపల్లి, అంబర్‌పేట్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, మలక్‌పేట్, ముషీరాబాద్, సికింద్రాబాద్, ఇబ్రహీంపట్నం, సేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో 16 మందికి పైగా అభ్యర్థులు (Candidates) ఎన్నికల (Elections) బరిలో ఉన్నారు. అతిపెద్ద నియోజకవర్గమైన మేడ్చల్‌లో 67 నామినేషన్లు చెల్లుబాటు కాగా 45 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో 22 మంది పోటీలో ఉన్నారు. గజ్వేల్ (44), కామారెడ్డి (39), ఎల్‌బి నగర్ (48) అత్యధిక అభ్యర్థులు (Candidates) ఉన్న నియోజకవర్గాల్లో ఉండగా, బాల్కొండ (8), నరస్‌పూర్ (11), బాన్సువాడ (7) మరో చివర్లో ఉన్నాయి.