Delhi: కీలక నిర్ణయం తీసుకున్న ఢిల్లీ సర్కారు..

Delhi: గత కొద్ది రోజుల నుంచి ఢిల్లీ (Delhi) నగరం మొత్తం గాలి కాలుష్యంతో సతమతం అవుతోంది. బయటకి వస్తే విపరీతమైన పొగ కారణంగా అసలు ఏమీ కనిపించని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం (Delhi Government) అనేక చర్యలు చేపడుతోంది. అయినా కానీ అక్కడ మాత్రం పరిస్థితులు అదుపులోకి రావడం లేదు. దీంతో ఢిల్లీ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఢిల్లీలో ప్రీ ప్రైమరీ స్కూల్స్ కు […]

Share:

Delhi: గత కొద్ది రోజుల నుంచి ఢిల్లీ (Delhi) నగరం మొత్తం గాలి కాలుష్యంతో సతమతం అవుతోంది. బయటకి వస్తే విపరీతమైన పొగ కారణంగా అసలు ఏమీ కనిపించని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం (Delhi Government) అనేక చర్యలు చేపడుతోంది. అయినా కానీ అక్కడ మాత్రం పరిస్థితులు అదుపులోకి రావడం లేదు. దీంతో ఢిల్లీ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఢిల్లీలో ప్రీ ప్రైమరీ స్కూల్స్ కు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం ఆ సెలవులను (Holidays) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ (Delhi)లో నవంబర్ 10వ తేదీ వరకు పాఠశాలలకు సెలవు ప్రకటించింది. అంతే కాకుండా పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా,రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు కూడా కొన్ని మార్గదర్శకాలను పాటించాలని సూచించింది. 

పంట వ్యర్థాలను కాల్చకండి.. 

ఢిల్లీ (Delhi)లో ప్రతి ఏటా పరిస్థితి ఇలాగే తయారవుతోంది. ఈ పరిస్థితులు తలెత్తడానికి పొరుగున ఉన్న రాస్ట్రాల్లో పంట వ్యర్థాలను కాల్చడం కూడా ఒక కారణంగా తెలుస్తోంది. అందుకే ఢిల్లీ ప్రభుత్వం ((Delhi Gov) ఆ దిశగా చర్యలు తీసుకుంది. పొరుగున ఉన్న పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల వారు పంట వ్యార్థాలను కాల్చడం ఆపేయాలని కోరింది. ఈ పరిస్థితిని కంట్రోల్ (Control) చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. కానీ ఆ చర్యలేవీ అక్కడ పరిస్థితులను మెరుగుపర్చేందుకు ఉపయోగపడడం లేదు. ఫలితంగా ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకూ దిగజారిపోతుంది. 

Also Read: Pollution: ఢిల్లీ కాలుష్యంతో జాగ్రత్త అంటున్న డాక్టర్లు

మరోసారి సరి బేసి విధానం

ఢిల్లీ (Delhi)లోని వాయు కాలుష్యాన్ని నివారించేందుకు కేజ్రీవాల్ (Kejriwal) సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధానిలో స్మోక్ టవర్లు పనిచేయకుండా చూడాలని డీపీసీసీ చైర్‌పర్సన్‌ ను కోరింది. అంతే కాకుండా దేశ రాజధానిలో నవంబర్ 13 నుంచి 20 వరకు వాహనాలకు సరి-బేసి (Odd-even) నిబంధనను అమలు చేయనున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం (Delhi Gov) సోమవారం ప్రకటించింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.ఇటువంటి కీలక నిర్ణయాలు ఎన్ని తీసుకున్నా కానీ అక్కడ మాత్రం వాయు కాలుష్యం తగ్గడం లేదు. అక్కడి ప్రజలు ఈ వాయు కాలుష్యం (Air Pollution) వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

దీపావళి రోజు అవి బంద్.. 

ఢిల్లీ (Delhi) కాలుష్యం పొరుగున ఉన్న రాష్ట్రాలపై కూడా పడుతోంది. వాయు కాలుష్యం ప్రతి ఒక్కరి ఆరోగ్యంపై, ముఖ్యంగా పిల్లలపై ప్రభావం చూపుతుందని ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) మంత్రి అరుణ్ సక్సేనా తెలిపారు. ఆయన మంగళవారం రోజు మీడియాతో మాట్లాడుతూ.. దీపావళి (Deepavali) రోజున సాధ్యమైనంత వరకు పటాకులు కాల్చవద్దని ప్రజలను కోరారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కాలుష్యాన్ని తగ్గించడానికి కట్టుబడి ఉందని, అందుకు తగిన చర్యలు తీసుకుంటోందని పర్యావరణం మరియు అటవీ శాఖ సహాయ మంత్రి సక్సేనా వెల్లడించారు. ఢిల్లీ (Delhi) వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో సరి-బేసి పథకం విఫలమైందని కాంగ్రెస్ పేర్కొంది. ఈ పద్ధతి అనేది ప్రజలకు అనేక సమస్యలు కలిగిస్తోందని ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్ లవ్లీ తెలిపారు. 

ఇప్పటికే గాడీ ఆఫ్ 

ఢిల్లీ (Delhi) వాయు కాలుష్యంతో పడుతున్న ఇబ్బందిని తగ్గించేందుకు ప్రభుత్వం (Gov) అనేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే అక్కడ రెడ్ లైట్ ఆన్ గాడీ ఆఫ్ (Red light on Gadi Off) పద్ధతిని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సిగ్నల్ లో ఉండగా.. రెడ్ లైట్ పడితే వెంటనే వెహికిల్ (Vehicle) ఆఫ్ చేయాలని ఇది సూచిస్తుంది. ప్రభుత్వం ఇన్ని చర్యలు తీసుకుంటున్నా కానీ గాలి నాణ్యత మాత్రం పెరగడం లేదు. ఈ పరిస్థితితో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే దీపావళి తర్వాత పరిస్థితి మరెంత ఘోరంగా ఉంటుందో అని అంతా ఆందోళన చెందుతున్నారు. 

ప్రజలకు అవే శ్రీరామ రక్ష

ఢిల్లీ (Delhi) నగరాన్ని వాయు కాలుష్యం పూర్తిగా కమ్మేసిన వేళ.. ప్రజలకు కొన్ని రక్షణ సాదనాలుగా ఉపయోగపడుతున్నాయి. ఎయిర్ ప్యూరిఫైయర్‌ లు, ఆక్సిజన్ సిలిండర్లు ఢిల్లీవాసులను రక్షించేందుకు నడుం బిగించాయి. ఎయిర్ ప్యూరిఫైయర్‌ లను ఇన్‌ స్టాల్ చేయడం నుంచి ఆక్సిజన్ సిలిండర్‌ ల వరకు ఇలా ఢిల్లీ (Delhi) వాసులను వాయు కాలుష్యం నుంచి కాపాడుతున్నాయి. 

ఇది పరిష్కారం కాదు.. 

ఢిల్లీ (Delhi) వాయు కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నవంబర్ 10వ తేదీ వరకు పాఠశాలలకు సెలవు (Holiday) మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలా చేయడం సరికాదని కొంత మంది పిల్లల తల్లిదండ్రులు వాదిస్తున్నారు. పిల్లలందరి వద్ద ఆన్ లైన్ (Online) క్లాసులు వినేందుకు పరికరాలు ఉంటాయా? అని వారు ప్రశ్నిస్తున్నారు. స్కూళ్లకు బంద్ ప్రకటించి ఫిజికల్ (Physical) క్లాసులు కాకుండా ఆన్ లైన్ క్లాసులు నిర్వహించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఆన్ లైన్ క్లాసుల గురించే కొంత మంది తల్లిదండ్రులు గవర్నమెంట్ ను నిలదీస్తున్నారు. తప్పకుండా అందరు పిల్లలకు ఆన్ లైన్ పరికరాలు ఉంటాయని మనం ఎలా చెబుతాం అంటూ నిలదీస్తున్నారు కొంత మంది పేరెంట్స్.