Scams: ఢిల్లీలో వెలుగులోకి కొత్త స్కామ్

మోసపోయిన జర్నలిస్ట్

Share:

Scams: దేశంలో ప్రతి రోజు కొన్ని వేల స్కామ్స్ (Scams) జరుగుతూనే ఉన్నాయి. అమాయక ప్రజలు స్కామ్స్ (Scams) బారిన పడకుండా ఉండేందుకు పోలీసులు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కానీ స్కామర్లు కొత్త కొత్త ఎత్తుగడలతో అమాయకులను బురిడీ కొట్టిస్తూనే ఉన్నారు. ఆన్ లైన్ (Online) అనేది విరివిగా ఉపయోగంలోకి వచ్చిన తర్వాత అమాయకులను మోసం (Fraud) చేయడం స్కామర్లకు (Scammers) మరింత ఈజీగా మారిపోయింది. ప్లే స్టోర్ యాప్ స్టోర్లలో అనేక సంఖ్యలో యాప్స్ (Apps) ఉన్నాయి. వీటిలో డేటింగ్ యాప్స్ (Dating Apps) కూడా వేలల్లో ఉంటున్నాయి. ఈ యాప్స్ ద్వారా అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) ఇటువంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. వీరు అమాయకులనే టార్గెట్ చేస్తున్నారని అనుకుంటే చదువుకుని సమాజానికి సేవ చేసే వారిని కూడా టార్గెట్ చేస్తున్నారు. తాజాగా ఢిల్లీకి చెందిన ఓ జర్నలిస్ట్ (Journalist) ను బురిడీ కొట్టించిన ఘటన వెలుగులోకి వచ్చింది.  

జర్నలిస్ట్ కే బురిడీ 

ఢిల్లీకి చెందిన ఓ జర్నలిస్ట్ బంబుల్ (Bumble) అనే డేటింగ్ యాప్‌ (Dating App) లో ఓ మహిళను కలుసుకుని ఆమె ద్వారా మోసగించబడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంబుల్‌ అనే డేటింగ్ యాప్ (Dating App) లో ఉన్న ఒక అమ్మాయి తనను సంప్రదించిందని, రాజౌరి గార్డెన్‌ లో కలవాలని కోరిందని ఆ జర్నలిస్ట్ ఆరోపించారు. అందుకు అతడు అంగీకరించి అక్కడికి వెళ్లగా.. ఆ మహిళ అతడిని ఒక బార్ కు తీసుకెళ్లి కొన్ని డ్రింక్స్ ఆర్డర్ చేసిందట. ఆ మహిళ ఆర్డర్ చేసిన డ్రింక్స్ కు దాదాపు రూ. 15,886 బిల్ వచ్చిందని అతడు వాపోయాడు. 

ట్విటర్ లో గోడు వెళ్లబోసుకున్న జర్నలిస్ట్

తనకు జరిగిన అనుభవాన్ని ఆ జర్నలిస్ట్ ట్విటర్ (ఎక్స్) (x) లో పంచుకున్నారు. అర్చిత్ గుప్తా అనే వ్యక్తి.. ఈ విషయాన్ని ట్వీట్ (Tweet) లో వెల్లడించాడు. అతడు బిల్లు మొత్తం కట్టిన తర్వాత ఆ మహిళ తన సోదరుడితో వెళుతున్నానని పేర్కొంటూ బార్ (Bar) నుంచి వెళ్లిపోయిందని వాపోయాడు. ఆ తర్వాత తనకు అందుబాటులోకి రాలేదన్నాడు. ఇక తర్వాత తాను ఆ అమ్మాయి చేతిలో మోసపోయినట్లు అర్థం అయిందని వెల్లడించాడు. ఇటువంటి స్కామ్స్ వల్ల ఇంకా ఎవరూ మోసపోకూడదని ఆ జర్నలిస్ట్ తనకు జరిగిన చేదు అనుభవాన్ని వెల్లడించాడు. పూస గుచ్చినట్లు అతడు చెప్పగా అందరూ అతడికి ధైర్యం చెబుతున్నారు. 

పని చేయని సైబర్ దోస్త్.. 

ఢిల్లీ ప్రభుత్వం ఇటువంటి సైబర్ నేరాల (Cyber Crimes) గురించి అవగాహన కల్పించేందుకు ఎవరైనా మోసగించబడితే కంప్లైంట్ చేసేందుకు సైబర్ దోస్త్ (Cyber Dost) అనే వింగ్ ను ఏర్పాటు చేసింది. కానీ అతడు మోసపోయిన తర్వాత సైబర్ దోస్త్ ను కాంటాక్ట్ చేద్దామని ప్రయత్నిస్తే అది పని చేయలేదని (Not Working) ఆ జర్నలిస్ట్  వాపోయాడు. 1930కి కాల్ చేసినా ఎటువంటి ఫలితం లేదని అతడు వాపోయాడు. ఈ ఘటన మీద చర్యలు తీసుకోవాలని అతడు ఢిల్లీ పోలీస్ ను కోరాడు. 

సర్వసాధారణమయిన ఘటనలు.. 

ఇటువంటి స్కామ్స్ కేవలం ఢిల్లీ అని మాత్రమే కాకుండా అన్ని రాష్ట్రాలలో సర్వసాధారణం (Common) అయిపోయాయి. ఇలా ఇటువంటి స్కామ్స్ కు బలైన చాలా మంది వ్యక్తులు పరువు పోతుందనే ఉద్దేశంతో బయటకు చెప్పడం మానేస్తున్నారు. కొంత మంది ధైర్యంగా బయటకు చెప్పినా కానీ ఎటువంటి ప్రయోజనం ఉండడం లేదు. అప్పటికే ఆ కేటుగాళ్లు బిచానా సర్దేస్తుండడం, లేకపోతే వారిని ట్రేస్ (Trace) చేయడం వంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. సైబర్ క్రైమ్స్ ను కంట్రోల్ చేసే పోలీసులు ప్రయత్నించినా కానీ ఈ దాడులు ఆగడం లేదు. ఇటువంటి ఘటనలు చాలా తరచుగా జరుగుతున్నాయి. ఇలా మోసపోయిన అనేక మంది తమ గోడును సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు. ఈ ఘటనలను పోలీసులు కూడా సుమోటోగా తీసుకుని ఎంక్వైరీలు చేస్తున్నారు. కొన్ని సంఘటనల్లో మోసపోయిన బాధితులే డైరెక్ట్ గా కంప్లైంట్ (Complaint) చేస్తున్నారు. వారి కంప్లైంట్ ద్వారా దర్యాప్తు చేసినా కానీ పోలీసులకు మాత్రం ఎటువంటి క్లూ దొరకడం లేదు. 

జాగ్రత్త పడుతున్న స్కామర్లు.. 

ఒక రకమైన స్కామ్ (Scam) జరిగితే మరోసారి అటువంటి స్కామ్ జరగకూడదనే ఉద్దేశంతో పోలీసులు అలెర్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియా (Social Media) లో అవేర్నెస్ (Awareness) తీసుకొస్తున్నారు. కానీ స్కామర్లు (Scammers) మరింత తెలివి మీరిపోయి.. కొత్త రకం సైబర్ మోసాలకు తెరతీస్తున్నారు. పాత రోజుల్లో బ్యాంక్ (Bank) నుంచి కాల్ చేస్తున్నాం అని చెప్పి డిటేయిల్స్ తీసుకునే కేటుగాళ్లు నేటి రోజుల్లో టెక్నాలజీ పెరగడంతో వారికి ా అవసరం కూడా లేకుండా పోయింది. కేవలం మనం వారి నుంచి వచ్చే కాల్ ను రిసీవ్ చేసుకుంటేనే మనం స్కామ్ కు గురయ్యే రోజులు వచ్చాయి. ఇటువంటి స్కామర్ల కాల్స్ ను అరికట్టేందుకు ఇటు సెల్ ఫోన్ నెట్ వర్క్ కంపెనీలు, అటు ట్రాయ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ స్కామర్లు మాత్రం ఏదో ఒక రూట్లో రెచ్చిపోతూనే ఉన్నారు. అనవసరంగా అమాయకులను మోసం (Fraud) చేస్తూనే ఉన్నారు.

Tags :