Mohammed Shami: యాక్సిడెంట్ కి గురైన వ్యక్తిని కాపాడిన షమీ

షేర్ చేసుకున్న వీడియో..

Courtesy: Twitter

Share:

Mohammed Shami: మహమ్మద్ షామీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఆట తీరు వరల్డ్ కప్ లో అందరూ చూసే ఉంటారు. ముఖ్యంగా వరల్డ్ కప్ (World Cup) సెమీఫైనల్స్ లో షమీ (Mohammed Shami) ఏడు వికెట్లు పడగొట్టి భారత్ జట్టును ఫైనల్స్ కి తీసుకురావడంలో సహాయం చేశాడు. అయితే ఇప్పుడు క్రికెట్ లోనే కాకుండా నిజ జీవితంలో షామీ సహాయం చేయడంలో ఎప్పుడు ముందే ఉంటాడని మరొకసారి చాటి చెప్పాడు షమీ (Mohammed Shami). 

యాక్సిడెంట్ కి గురైన వ్యక్తిని కాపాడిన షామీ: 

భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ (Mohammed Shami) ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశాడు, అందులో అతను రోడ్డు ప్రమాదంలో ఉన్న బాధితుడికి సహాయం చేశాడు. నిజంగా ఒక వ్యక్తికి రెండో జన్మను అందించడం అనేది తనకు చాలా ఆనందంగా ఉందని.. అతను చాలా అదృష్టవంతుడని, ఒకరిని కాపాడడంలో ఉన్న సంతోషం చెప్పలేనిది అంటూ సోషల్ మీడియాలో (Social Media) పోస్ట్ పెట్టాడు షమీ (Mohammed Shami). 

వికెట్లు పడగొట్టడం కలలో చూసా..!: 

వరల్డ్ కప్ (World Cup) లో ఆస్ట్రేలియా తో ఆడిన భారత్ ఓడిపోయినప్పటికీ, ఐసిసి ప్రపంచ కప్ (World Cup) 2023 సెమీ-ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సాధించిన మహమ్మద్ షమీ (Mohammed Shami) స్టార్‌గా అవతరించాడు. 33 ఏళ్ల అతను ఏడు వికెట్లు పడగొట్టాడు, 50 ఓవర్ల ప్రపంచ కప్ (World Cup) చరిత్రలో భారత బౌలర్, అత్యుత్తమ వికెట్లను పడగొట్టిన ఆటగాడుగా పేరు దక్కించుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు కూడా. అయితే సెమీ-ఫైనల్ జరగడానికి ఒక రోజు ముందు షమీ (Mohammed Shami) ఏడు వికెట్లు పడగొట్టడం గురించి కలలుగన్నట్లు ఒక సోషల్ మీడియాలో (Social Media) ఒక వ్యక్తి పేర్కొన్నాడు. అయితే ఇటీవల ఆ వ్యక్తి చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ అయింది. ఇది చూసిన చాలామంది సోషల్ మీడియాలో (Social Media) తమదైన శైలిలో కామెంట్స్ పెడుతున్నారు. తమ ఫ్యూచర్ గురించి కూడా మంచిగా కలగని తమకు చెప్పమంటూ, ఫైనల్ మ్యాచ్ కూడా సవ్యంగా జరిగేలాగా స్క్రిప్ట్ ప్రిపేర్ చేయమంటూ, ఫ్యూచర్లో నెక్స్ట్ యూఎస్ ప్రెసిడెంట్ ఎవరు కాబోతున్నారో చెప్పమంటూ పలు కామెంట్లు చేస్తున్నారు నటిజెన్లు. 

మహమ్మద్ షామికి పెళ్లి ప్రపోజల్: 

నటి-రాజకీయ నాయకురాలు పాయల్ గోష్ (Payal Ghosh) భారత క్రికెటర్ మహ్మద్ షమీ (Mohammed Shami)ని పెళ్లి (Marriage) చేసుకోవాలని కోరికను వ్యక్తం చేసింది. అయితే, ఆమె ఒక షరతు కూడా పెట్టడం జరిగింది. 2023 ICC ODI ప్రపంచ కప్ (World Cup)‌లో అతని అద్భుతమైన ప్రదర్శన తర్వాత, పాయల్ (Payal Ghosh) తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షమీ (Mohammed Shami)కి పెళ్లి (Marriage) ప్రపోజల్ పెట్టినట్లు తెలుస్తోంది. అతను ప్రపంచ కప్ (World Cup) లో ఆడిన నాలుగు గేమ్‌లలో 16 వికెట్లు పడగొట్టాడు. అయితే, షమీ (Mohammed Shami) ఆట తీరుకు ఫ్లాట్ అయిన  పాయల్ (Payal Ghosh), షమీ (Mohammed Shami)కి రెండో భార్యగా ఉండటానికి సిద్ధంగా ఉన్నానని, అయితే తన షరతు ప్రకారం, షమీ (Mohammed Shami) ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలని, ఆ తర్వాత తప్పకుండా అతనిని పెళ్లి (Marriage) చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని పాయల్ (Payal Ghosh) చెప్పుకొచ్చింది. పాయల్ (Payal Ghosh) చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో (Social Media) చెక్కర్లు కొడుతోంది. 

నవంబరు 2013 న వెస్ట్ ఇండీస్ తో జరిగిన టెస్టు మ్యాచ్ లో ఆడి ఐదు వికెట్లను పడగొట్టాడు. మహ్మద్ షమీ (Mohammed Shami)కి గతంలో హసిన్ జహాన్‌తో వివాహమైంది. వారు 2014లో వివాహం (Marriage) చేసుకున్నారు, కానీ విడిపోయారు. ద్రోహం, మ్యాచ్ ఫిక్సింగ్, గృహ హింసకు పాల్పడ్డాడని హసిన్ ఆరోపించడంతో, షమీ (Mohammed Shami)-హసిన్ విడాకులు తీసుకున్నారు. ఈ జంట ఇప్పుడు విడిపోయారు. వీళ్ళిద్దరికీ కూతురు కూడా ఉంది.