Shweta Sharda: మిస్ యూనివర్స్ పోటీలో శ్వేతా శారదా

ఇంతకీ ఆమె ఎవరు?

Courtesy: Twitter

Share:

Shweta Sharda: ప్రతి ఒక్కరికి ఎన్నో కలలు ఉంటాయి. చిన్నతనం నుంచి డాక్టర్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి, లేదంటే యాక్టర్ అవ్వాలి అంటూ చాలామంది కలలు కంటూ ఉంటారు. భారతదేశానికి (India) చెందిన శ్వేతా శారదా (Shweta Sharda) తనకే ఉన్న టాలెంట్ తో ఎన్నో షోలలో పాల్గొనింది. ముఖ్యంగా డాన్స్ అంటే ఆమెకు ప్రాణం. అందంలో అభినయంలో మంచి మార్పులు కొట్టేసిన శ్వేతా శారదా (Shweta Sharda), ఇప్పుడు భారతదేశం (India) తరుపున మిస్ యూనివర్స్ (Miss Universe) బరిలో పోటీ పడుతోంది. తను మిస్ యూనివర్స్ (Miss Universe) పోటీలలో పోటీ పడటమే కాకుండా, తాను పార్టిసిపేట్ చేసిన డాన్స్ షోల ద్వారా, టాలెంట్ ఉంటే చాలు ప్రతి ఒక్కరూ టాలెంట్ సంపాదించుకోవాలి అంటూ ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది.

మిస్ యూనివర్స్ పోటీలో శ్వేతా శారదా: 

శ్వేతా శారదా (Shweta Sharda)ా ఎల్ సాల్వడార్‌లోని శాన్ సాల్వడార్‌లో జరిగే 72వ మిస్ యూనివర్స్ (Miss Universe) పోటీలో భారతదేశానికి (India) ప్రాతినిధ్యం వహించనుంది. శారద, 23, చండీగఢ్‌కు చెందినది. ఇటీవల బరిలో నిలిచిన శ్వేతా శారదా (Shweta Sharda)కు సంబంధించిన ఒక వీడియోలో చూసినట్లయితే, ఉత్సాహభరితమైన పరిచయం ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించింది. మిస్ దివా అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో శారదాకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. మరియు "ఇదిగో మీ LIVA మిస్ దివా యూనివర్స్ 2023 శ్వేతా శారదా (Shweta Sharda)ా వస్తుంది" అని ప్రకటించింది.

శ్వేతా శారదా గురించి: 

శ్వేతా శారదా (Shweta Sharda)ా మే 24, 2000న చండీగఢ్‌లో జన్మించింది. తన తల్లి దగ్గర పెరిగి పెద్దయింది. మోడలింగ్‌లో వృత్తిని కొనసాగించడానికి ఆమె 16 సంవత్సరాల వయస్సులో ముంబైకి వెళ్లినట్లు ఫెమినా నివేదించింది.

శ్రీమతి శారదా డాన్స్ ఇండియా డ్యాన్స్ (Dance), డ్యాన్స్ (Dance) దీవానే మరియు డ్యాన్స్ (Dance) ప్లస్‌తో సహా పలు రియాలిటీ షోల ద్వారా వెండితెరపై తన ప్రతిభను ప్రదర్శించింది. ఆమె డ్యాన్స్ (Dance) రియాలిటీ షో ఝలక్ దిఖ్లా జాలో కొరియోగ్రాఫర్ కూడా మనకు కనిపించింది. శ్వేతా శారదా (Shweta Sharda)ా ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీని పొందింది. జుబిన్ నౌటియాల్ మరియు తులసి కుమార్ పాడిన మస్త్ ఆంఖీన్ పాటలో శ్వేతా శారదా (Shweta Sharda)ా ఇటీవల విడుదలైన మ్యూజిక్ వీడియోలో కూడా మనకి కనిపించింది. ఆమె వీడియోలో గంగూబాయి కతివాడి నటుడు శంతను మహేశ్వరితో స్క్రీన్‌ను పంచుకుంది.

శారదా, ఆగస్టు 28న జరిగిన మిస్ దివా యూనివర్స్ 2023 కిరీటాన్ని గెలుచుకుంది. ఈ కార్యక్రమంలో ఆమె మిస్ బాడీ బ్యూటిఫుల్ మరియు మిస్ టాలెంటెడ్ అవార్డులను గెలుచుకుంది.ఫెమినాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, శారద మాట్లాడుతూ, అమ్మాయిలు వారి కలలను సహకారం చేసుకోవడానికి ముందుకు వెళ్లేలా చేయడమే తన లక్ష్యమని.. మనల్ని మనం నమ్ముతూ పక్క వాళ్ళ అవమానాలను, అనుమానాలను పక్కకి తోస్తూ, మన ముందున్న లక్ష్యాల మీద దృష్టి పెట్టాలి అంటూ మాట్లాడింది. మన మనసుకు ముందు ప్రశాంతత కలిగించాలని, ముందుకు సాగుతూ మన లక్ష్యాలను సాధించగలమని నెరవేర్చుకోగలమని ఆమె స్పష్టంగా చెప్పింది. అయితే ఎప్పటినుంచో తన కలను నెరవేర్చుకోవాలి అనుకుంటున్నా ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ, ఎన్నో అవరోధాలను ఎదుర్కొని, పోరాడి ముందుకు సాగింది. ఇప్పుడు చివరికి మిస్ యూనివర్స్ (Miss Universe) పోటీలలో భారతదేశం (India) తరఫున బరిలో నిలిచింది. ఇప్పుడు జరగబోయే మిస్ యూనివర్స్ (Miss Universe) పోటీలలో భారతదేశం (India) తరపున ప్రతినిత్యం ఇవ్వడమే కాకుండా, భారతదేశానికి (India) పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని, శ్వేతా శారదా (Shweta Sharda) గెలవాలని అందరం కోరుకుందాం. మిస్ యూనివర్స్ (Miss Universe) యూట్యూబ్ ఛానెల్ మరియు Xలో, నవంబర్ 19న ఉదయం 6:30 AM నుండి ప్రారంభమయ్యే మిస్ యూనివర్స్ (Miss Universe) పోటీలో చివరి పోటీని మీరు చూడచ్చు.