దిల్లీలో తన అధికారిక నివాసాన్ని తొలిసారి సందర్శించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) దిల్లీలోని తుగ్లక్ రోడ్డులో ఉన్న సీఎం అధికారిక నివాసం అయిన 23వ నంబర్ బంగ్లాను మంగళవారం సందర్శించారు.

Courtesy: x

Share:

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) దిల్లీ పర్యటనలో ఉన్నారు. రేవంత్ తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా దిల్లీలోని అధికారిక నివాసాన్ని సందర్శించారు. దిల్లీలోని తుగ్లక్ రోడ్డులో ఉన్న సీఎం అధికారిక నివాసం అయిన 23వ నంబర్ బంగ్లాను మంగళవారం సందర్శించారు. ఈ అధికారిక నివాసాన్ని మాజీ సీఎం కేసీఆర్ ఇటీవల ఖాళీ చేయడంతో రేవంత్ తాజాగా భవనాన్ని సందర్శించడం విశేషం. 

తెలంగాణ శాసనసభకు నవంబర్ 30న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మొత్తం 120 స్థానాలకు గానూ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో విజయం సాధించగాా.. బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాల్లో గెలుపొందింది. భాజపా 8 స్థానాల్లో, ఎంఐఎం 7 స్థానాల్లో, ఇతరులు 1 స్థానంలో గెలుపొందారు.