Asaduddin Owaisi: రేవంత్ రెడ్డిపై అసదుద్దీన్ ఒవైసీ ఫైర్

“నువ్వు ఆర్‌ఎస్‌ఎస్ కీలుబొమ్మవి..”

Courtesy: canva

Share:

Asaduddin Owaisi: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్ది రాజకీయ నాయకుల మధ్య విమర్శల దాడి మరింతగా పెరుగుతోంది. తాజాగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై ఎంఐఎం(MIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

 

తాజాగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి ‘ఆర్ఎస్ఎస్ తోలుబొమ్మ’ అంటూ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ‘‘మాపై విమర్శించడానికి మీకు ఏమీ లేదు. మీరు మా బట్టలు, గడ్డాల గురించి మాట్లాడి మాపై దాడి చేస్తున్నారు. దీనినే డాగ్ విజిల్ పాలిటిక్స్(Dog whistle politics) అంటారు. నువ్వు ఆర్‌ఎస్‌ఎస్ కీలుబొమ్మవి. బీజేపీ(BJP), కాంగ్రెస్‌ల(Congress) మధ్య ఎలాంటి తేడా లేదు’’ అని అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

అయితే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆదివారం మాట్లాడుతూ.. కర్ణాటక ఎన్నికల సమయంలో మోదీ(PM Modi), అమిత్ షా(Amith Shah) సన్నిహితుడికి ఒవైసీ తన ఇంట్లో పార్టీ ఇచ్చారని ఆరోపించారు. దీనిపై దర్గా దగ్గరికి రమ్మన్నా, భాగ్యలక్ష్మీ టెంపుల్ దగ్గరకి రమ్మన్నా వస్తానని .. మరి మసీదులో ప్రమాణం చేసేందుకు అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) సిద్ధమా అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఆయన ఒంటిపై షెర్వాణీ ఫైజామా ఉందని అనుకున్నానని.. కానీ షెర్వాణీ(Sherwani) కింద ఖాకీ నిక్కర్ కూడా ఉందని విమర్శించారు.

 

అయితే రేవంత్ రెడ్డి(Revanth Reddy) వ్యాఖ్యలకు అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) తాజాగా కౌంటర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.  ‘‘తెలంగాణ పీసీసీ చీఫ్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యుడిగా చడ్డీ కట్టుకుని ఏబీవీపీకి వెళ్లి, తెలుగుదేశంలో చేరి ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వచ్చారు. కాంగ్రెస్(Congress) గాంధీ భవన్‌ను మోహన్ భగవత్(Mohan Bhagwat) స్వాధీనం చేసుకున్నారని, ఆయన ఎలా కావాలంటే అలా కాంగ్రెస్‌ను నడిపిస్తారని ఎవరో సరిగ్గా చెప్పారు’’ అని అసదుద్దీన్ పేర్కొన్నారు. 

 

పౌరసత్వ సవరణ చట్టం నిరసనలను గుర్తుచేస్తూ.. నిరసనకారులను వారు ధరించిన దుస్తులను బట్టి గుర్తించవచ్చని ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) చెప్పారని ఒవైసీ అన్నారు. ఒవైసీ షేర్వానీ గురించి మాట్లాడేటప్పుడు రేవంత్ కూడా అదే పని చేశారని ఆయన అన్నారు. రాష్ట్రంలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, మరో నాలుగు రాష్ట్రాలతో పాటు ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనున్న నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంది.

 

అసదుద్దీన్ విమర్శలపై కాంగ్రెస్ సీనియర్ నేత, బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి(Adhir Ranjan Chaudhary) స్పందించారు. బీజేపీ(BJP) పోటీని సులభతరం చేయడానికి అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ ఓట్లను చీల్చుతున్నాడని అందరికి తెలుసని,  బీజేపీ నుంచి లంచాలు, డబ్బులు తీసుకుంటున్నాడంటూ సంచలన విమర్శలు చేశారు.

 

బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో మంగళవారం మీడియాతో పాల్పడుతూ అధిర్ రంజన్ చౌదరి(Adhir Ranjan Chaudhary)  ఈ వ్యాఖ్యలు చేశారు. అవినీతిపై యుద్ధం చేస్తామని చెబుతున్న బీజేపీ ముందు తమ పరిస్థితిని చూసుకోవాలని, వారి పార్టీలో అవినీతి కంపును పసిగట్టాలని అన్నారు. లంగాణలో(Telangana) ఇప్పటికే మార్పు తుఫాను మొదలైందని, దీని నుంచి బయటపడేందుకు బీజేపీ(BJP) తమ అత్యంత విశ్వసనీయ నేత అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) ని ఆశ్రయించిందని ఆరోపించారు.

 

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) దేశవ్యాప్తంగా కులగణనకు మద్దతిస్తుండటంతో హిందూ ఓట్లను ఏకం చేసి హిందుత్వం పేరుతో ఎన్నికల్లో పోటీ చేయాలని కలలు కన్న ప్రధాని నరేంద్రమోడీకి అడ్డంకిగా మారిందని ఆయన అన్నారు. హిందూ సమాజంలో వివక్ష ఉందని రాహుల్ గాంధీ చెబుతున్నారని, ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల స్థితిగతులు తెలుసుకునే ఉద్దేశం మోదీకి(PM Modi) లేదని, ఆయన మతతత్వ రాజకీయాలు చేయాలని అనుకుంటున్నారని అన్నారు. కులగణన ఆధారంగా అన్ని ప్రభుత్వ పథకాలు ప్లాన్ చేయాలని తెలిపారు. పశ్చిమ బెంగాల్ లోని జాయ్‌నగర్ లో స్థానిక టీఎంసీ నాయకుడి హత్యపై మాట్లాడుతూ.. 24 గంటలు గడిచినా, హంతకుడు ఎవరో తెలియలేదని ఎద్దేవా చేశారు. రామ మందిరం బీజేపీకి ప్రస్తుతం ఎన్నికల అంశంగా మారిందని, సరిహద్దుల్లో కూడా రామ మందిరం గురించే మోడీ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.