తెలంగాణ ఇంటర్ పరీక్షలకు షెడ్యూల్ విడుదల.. తేదీలివే!

Intermediate examinations: తెలంగాణ విద్యా శాఖ ఇంటర్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు వెల్లడించింది.

Courtesy: IDL

Share:

హైదరాబాద్: తెలంగాణ విద్యా శాఖ ఇంటర్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు వెల్లడించింది. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు షెడ్యూల్‌ విడుదల చేసింది.ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు (జనరల్‌/వొకేషనల్‌ కోర్సులు) ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు నిర్వహించనున్నారు.  ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌, ఫిబ్రవరి 29వ తేదీ నుంచి ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 17వ తేదీన ఎథిక్స్‌ & హ్యూమన్‌ వాల్యూస్‌ ఎగ్జామినేషన్‌, ఫిబ్రవరి 19వ తేదీన ఇన్విరాన్‌మెంటల్‌ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. 

పరీక్షల షెడ్యూల్ ఇదే..

ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్ష తేదీలు..
ఫిబ్రవరి 28 - పార్ట్‌ 2 (సెకండ్‌ లాంగ్వేజి పేపర్‌-1).
మార్చి 1 - పార్ట్‌ 1 (ఇంగ్లీష్ పేపర్‌-1).
మార్చి 4 - పార్ట్‌ 3 (మేథమేటిక్స్‌ పేపర్-1ఏ, బోటనీ పేపర్‌-1, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌-1).
మార్చి 6 -  మేథమేటిక్స్‌ పేపర్‌ 1బి, జువాలజీ పేపర్‌-1, హిస్టరీ పేపర్‌-1.
మార్చి 11- ఫిజిక్స్‌ పేపర్‌-1, ఎకనామిక్స్‌ పేపర్‌-1.
మార్చి 13 - కెమెస్ట్రీ పేపర్‌-1, కామర్స్‌ పేపర్‌-1.
మార్చి 15 - పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-1, బ్రిడ్జి కోర్స్‌ మ్యాథ్స్‌ పేపర్‌-1 (ఫర్ బైపీసీ స్టూడెంట్స్‌).
మార్చి 18 - మోడరన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1, జియోగ్రఫీ పేపర్‌-1.

ఇంటర్‌ రెండో సంవత్సరం పరీక్ష తేదీలు..
ఫిబ్రవరి 29 - పార్ట్‌ 2 (సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2).
మార్చి 2 - పార్ట్‌ 1 (ఇంగ్లీష్‌ పేపర్‌-2).
మార్చి 5 - పార్ట్‌ 3 (మేథమేటిక్స్‌ పేపర్‌ 2ఏ, బోటనీ పేపర్‌ 2, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌ 2).
మార్చి 7 - మేథమేటిక్స్‌ పేపర్‌ 2బి, జూవాలజీ పేపర్‌-2, హిస్టరీ పేపర్-2.
మార్చి 12 -  ఫిజిక్స్‌ పేపర్‌-2, ఎకనామిక్స్‌ పేపర్‌-2.
మార్చి 14 - కెమెస్ట్రీ పేపర్‌ -2,  కామర్స్‌ పేపర్‌-2
మార్చి 16 -  పబ్లిక్‌ ఆడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-2, బ్రిడ్జి కోర్స్‌ మ్యాథ్స్‌ పేపర్‌-2 (ఫర్‌ బైపీసీ స్టూడెంట్స్‌).
మార్చి 19 - మోడరన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2, జియోగ్రఫీ పేపర్‌-2.