Modi: మోదీ సభలో గలాట

ఒక్కసారిగా ఫేమస్ అయిపోయిన లేడీ

Share:

Modi: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి (Election Heat) రాజుకుంది. ఒక్క పార్టీ అని కాకుండా అన్ని పార్టీలు (All Parties) ఓటర్లను ఆకట్టుకునేందుకు నానా తంటాలు పడుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ (BJP) పార్టీ కూడా ఇక్కడి ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నడూ లేని వరాలు కురిపిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు చూస్తున్నాయి. ఇందులో భాగంగానే దేశ ప్రధాని మోదీ (Modi) హైదరాబాద్ కు తరచూ వస్తున్నారు. మొన్నటికి మొన్న బీసీల ఆత్మగౌరవ సభకు విచ్చేసిన మోదీ(Modi)  కొద్ది రోజుల వ్యవధిలోనే ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాదిగల విశ్వరూప సభకు కూడా విచ్చేశారు. 

కీలక ప్రసంగాలు.. 

మోదీ (Modi)  సారధ్యంలోని బీజేపీ పార్టీ ఇప్పటికే తెలంగాణకు బీసీ సీఎం (BC CM) ను చేస్తామని ప్రకటించింది. ఎలాగైనా సరే ఈ సారి రాష్ట్రంలో ఉన్న బహుజనులను మచ్చిక చేసుకునేందుకు సర్వ శక్తులను ఒడ్డుతోంది. అందులో భాగంగానే బీసీని సీఎంగా చేస్తామని ప్రకటించింది. మరో పక్క కాంగ్రెస్ పార్టీ (Congress Party) కూడా బీసీ డిక్లరేషన్ ను ప్రకటించి ముందుకు వెళ్తుంది. ఈ రెండు పార్టీలు బీసీలకు ఏమీ చేయలేదని తామే బీసీల కోసం అనేక పనులు చేశామని రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ (BRS) పార్టీ చెబుతోంది. బీసీ సభకు హాజరైనపుడు తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన సభకు హాజరయ్యానని మోదీ (Modi)  చెప్పుకొచ్చారు. తాను కూడా ఓబీసీ వ్యక్తినే అని ఓబీసీలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేశారు. తాము అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని బీసీ కులాల వారికి మోదీ (Modi)  హామీ ఇచ్చారు. వారు అధికారంలోకి వస్తారో రారో ఇప్పుడే చెప్పలేం కానీ బీజేపీ పార్టీ మాత్రం బీసీ సీఎం నినాదంతో ఎన్నికల్లో విజయం సాధించాలని భారీ స్కెచ్ వేసింది. 

రోజుల వ్యవధిలోనే.. 

ప్రధాని మోదీ (Modi)  రోజుల వ్యవధిలోనే హైదరాబాద్ లో జరిగిన మరో సభకు హాజరయ్యారు. మాదిగ విశ్వరూప సభకు ప్రధాని విచ్చేశారు. ఈ సభను ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సభకు కూడా ఎమ్మార్పీఎస్ (MRPS) అనేక మందిని తరలించింది. అంతే కాకుండా ఎస్సీ వర్గీకరణ కోసం కాంగ్రెస్ పార్టీ మరియు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి స్పష్టమైన హామీ ఇవ్వడం లేదని మందక్రిష్ణ మాదిగ చెబుతున్నారు. మోదీ (Modi)  మాత్రం తమ సమస్యలను తీర్చేందుకు ఇంత దూరం వచ్చారని ఆయన ప్రచారం చేస్తున్నారు. 

ఎమోషనల్ అయిన మందక్రిష్ణ

ఈ సభకు మోదీ (Modi)  వచ్చిన తర్వాత సభ మీద ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందక్రిష్ణ మాదిగ (Manda Krishna Madiga) ఎమోషనల్ (Emotional) అయ్యారు. సభ మీదే ఆయన ప్రధానిని పట్టుకుని కంటతడి పెట్టారు. దీంతో ప్రధాని మందక్రిష్ణను దగ్గరికి తీసుకుని ఓదార్చారు. ఆయన భుజం తట్టి తానున్నానంటూ ధైర్యం చెప్పారు. 

ప్రధాని మాట్లాడుతుండగా గలాట… 

ఈ సభలో మందక్రిష్ణ మాట్లాడిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ (Modi)  మాట్లాడారు. ఇలా ప్రధాని మాట్లాడుతున్న సమయంలో ఓ యువతి లైట్ మాస్ట్ (Light Mast) ఎక్కింది. దీంతో ఆ బాలిక అందరి దృష్టిని ఆకర్షించింది. మోదీ (Modi)  ప్రసంగానికి అంతరాయం కలిగించింది. ఇది గమనించిన మోదీ (Modi)  ఆ యువతిని కిందకు దిగమని అభ్యర్థించాడు. దీంతో కెమెరాలు మొత్తం ఆ యువతిని ఫోకస్ (Focus) చేశాయి. ఒక్కసారిగా అప్రమత్తం అయిన పోలీసులు ఆ యువతిని కిందకు దించారు. అనంతరం ఆమె మీడియాతో (Media) మాట్లాడుతూ దళితులను వర్గీకరించడం సరికాదన్నారు. కేంద్రం చట్టాన్ని సక్రమంగా అమలు చేస్తుంటే, న్యాయవ్యవస్థ బాగుంటే చిన్నారులపై అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయని ఆమె ప్రశ్నించారు. నిత్యావసరాల ధరలు (Rates) పెరిగి మధ్యతరగతి ప్రజలు జీవనం సాగించలేకపోతున్నారని ఆమె అన్నారు. ప్రధానమంత్రి అన్ని వర్గాలు, కులాలు మరియు మతాలకు న్యాయం చేయాలని కోరారు. ప్రధానమంత్రి అందరినీ సమానంగా చూడటం లేదని వాపోయారు. ప్రధాని (Prime Minister) హోదాలో ఉన్న వ్యక్తి తనను ఒక మతంతో  ముడిపెట్టుకోకూడదని అన్నారు. 

నేషనల్ లెవల్ లో గుర్తింపు.. 

ప్రధాని మోదీ (Modi)  సభ కావడంతో లోకల్ మీడియాతో పాటు నేషనల్ మీడియా (National Media) కూడా కవరేజ్ ఇవ్వసాగింది. ఆ అమ్మాయి సరిగ్గా ప్రధాని మాట్లాడుతున్న సమయంలోనే లైట్ మాస్ట్ ఎక్కడంతో కెమెరాలు మొత్తం ఆమెను కవర్ చేయడం స్టార్ట్ చేశాయి. మోదీ కూడా ఆమెను దిగమని అభ్యర్థించడంతో ఆమె లైమ్ లైట్ లోకి వచ్చింది. దీంతో ఆమె ఒక్కసారిగా నేషనల్ వైడ్ గా ఫేమస్ (Famous) అయిపోయింది. ఈ సభలో మందక్రిష్ణ ఏడ్చిన దాని కంటే ఆ యువతే ఎక్కువ హైలెట్ అయింది. అంతే కాకుండా తాను దిగిన తర్వాత మాట్లాడిన మాటలు కూడా అందర్నీ ఆలోచింప విధంగా ఉన్నాయి. తాను తన కోసం కాకుండా మహిళల కోసం, చిన్నారుల కోసం, మధ్య తరగతి వారి కోసం మాట్లాడడం అందన్నీ ఆకట్టుకుంది. దీంతో ఆమె ఎంతో ఫేమస్ అయిపోయింది. ఆమె ప్రధాని సభలో గలాట చేసినా కానీ ఎవరు కూడా ఆమెను విమర్శించడం లేదు. అందుకు బదులు ఆమెను మెచ్చుకోవడం స్టార్ట్ (Start) చేశారు.