స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..

Sankranthi Holidays: రాష్ట్రంలోని విద్యార్థులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. సంక్రాంతి (Sankranti) పండగను పురస్కరించుకొని ఆరు రోజులు సెలవులు ప్రకటించింది.

Courtesy: Top Indian News

Share:

హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యార్థులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. సంక్రాంతి (Sankranti) పండగను పురస్కరించుకొని ఆరు రోజులు సెలవులు ప్రకటించింది. జనవరి 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ సెలవులు ఉంటాయని వెల్లడించింది. ఈ మేరకు పాఠశాల విద్యా డైరెక్టరేట్‌ ప్రకటన విడుదల చేసింది. మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని పాఠశాలలకు ఈ సంక్రాంతి సెలవులు వర్తిస్తాయని పేర్కొంది.

జనవరి 12వ తేదీన సెలవులు ప్రారంభం కానున్నాయి. 13వ తేదీన రెండో శనివారం కావడంతో పాఠశాలలకు సెలవు ఉంటుంది. ఇక 14 ఆదివారం భోగి పండుగ వచ్చింది. 15వ తేదీన సంక్రాంతి కాగా, 16న కనుమ పండుగ ఉంది. ఇక 17వ తేదీన ప్రభుత్వం పాఠశాలలకు అదనంగా సెలవు ఇచ్చింది. మొత్తం ఆరు రోజులు విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. 18వ తేదీన అన్ని విద్యాసంస్థలు యథావిథిగా తెరుచుకోనున్నట్లు ప్రకటనలో వెల్లడించింది.

సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు
సంక్రాంతి పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లేవారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. పండుగను దృష్టిలో పెట్టుకుని 32 ప్రత్యేక రైళ్లను నడపనుంది. సికింద్రాబాద్‌-బ్రహ్మపుర్‌, బ్రహ్మపుర్‌-వికారాబాద్‌, విశాఖపట్నం-కర్నూలు సిటీ, శ్రీకాకుళం-వికారాబాద్‌, సికింద్రాబాద్‌-తిరుపతి, సికింద్రాబాద్‌-కాకినాడ టౌన్‌, సికింద్రాబాద్‌-నర్సాపూర్‌ రూట్లలో ఈ రైళ్లు నడవనున్నాయి.  2024 జనవరి 7వ తేదీ నుంచి జనవరి 27 మధ్య వివిధ తేదీల్లో ఈ రైళ్లు రాకపోకలు కొనసాగించనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు అన్నింటిలోనూ ఫ‌స్ట్ ఏసీ, సెకెండ్ ఏసీ, థ‌ర్డ్ ఏసీతో పాటు స్లీప‌ర్‌, జ‌న‌ర‌ల్ బోగీలు ఉండ‌నున్నాయి.

ప్రత్యేక రైళ్లు ఇవే..  
సికింద్రాబాద్ నుంచి బ్రహ్మపూర్ ( ట్రైన్ నంబ‌ర్ 07089 ) – జనవరి 7, 14 తేదీల్లో
బ్రహ్మాపూర్ నుంచి వికారాబాద్ (07090) – జనవరి 8, 15న‌
వికారాబాద్ నుంచి బ్రహ్మపూర్ (07091) – జనవరి 9, 16న‌
బ్రహ్మాపూర్ నుంచి సికింద్రాబాద్ (07092) – జనవరి 10, 17న‌
విశాఖపట్నం నుంచి కర్నూలు సిటీ (08541) – జనవరి 10, 17, 24 తేదీల్లో
కర్నూల్ సిటీ నుంచి విశాఖపట్నం (08542) – జనవరి 11, 18, 25 తేదీల్లో
శ్రీకాకుళం నుంచి వికారాబాద్ (08547) – జనవరి 12, 19, 26 తేదీల్లో
వికారాబాద్ నుంచి శ్రీకాకుళం (08548) – జనవరి 13, 20, 27 తేదీల్లో
సికింద్రాబాద్ నుంచి తిరుపతి (02764) – జనవరి 10, 17న‌
తిరుపతి నుంచి సికింద్రాబాద్ (02763) – జనవరి 11, 18న‌
సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ (07271) – జనవరి 12న‌
కాకినాడ టౌన్-సికింద్రాబాద్ (07272) – జనవరి 13న
సికింద్రాబాద్ – బ్రహ్మపూర్ (07093) – జనవరి 8, 15న‌
బ్రహ్మాపూర్ – సికింద్రాబాద్ (07094) – జనవరి 9, 16న‌
నర్సాపూర్ – సికింద్రాబాద్ (07251) – జనవరి 10న
సికింద్రాబాద్ – నర్సాపూర్ (07252) – జనవరి 11న