కేటీఆర్ కు బండ్ల గణేష్ కౌంటర్.. ఏమన్నాడో మీరే చూడండి!

సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ నాయకులకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్ గా మారింది.

Courtesy: x

Share:

సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక అంశంపై తనదైన శైలిలో స్పందిస్తూ సినీ నిర్మాత బండ్ల గణేష్ అందరినీ ఆకర్షిస్తుంటారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న బండ్ల గణేష్ అవకాశం వచ్చినప్పుడల్లా పార్టీ పట్ల తన అభిమానాన్ని వ్యక్తపరుస్తూనే ఉంటారు. తాజాగా ఆయన బీఆర్ఎస్ పై విమర్శనాస్త్రాన్ని ఎక్కుపెట్టారు. సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ నాయకులకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్ గా మారింది. 

బీఆర్ఎస్ కు బండ్ల గణేష్ కౌంటర్
తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో గత ప్రభుత్వ పాలన, అభివృద్ధి, ఖర్చులపై కాంగ్రెస్ పాలకులు శ్వేతపత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనికి కౌంటర్ గా కేటీఆర్ స్వేదపత్రం అని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడంపై బండ్ల గణేష్ ఘాటు విమర్శలు చేశారు. తనదైన శైలీలో బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించారు. పవర్ లేనివాళ్లకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎందుకని ప్రశ్నించారు. గడిచిన పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలంటూ నిలదీశారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ పాలకులు ఏంచేశారు, ఎంత దోచుకున్నారు, ఆర్థికంగా ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్లారో తాము చెప్పగలమని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు ఎంత వెనకబడ్డారో కూడా చెప్పగలమంటూ బీఆర్ఎస్ కు కౌంటర్ ఇచ్చారు బండ్ల గణేష్.

ప్రజలు తమ పార్టీని నమ్మారు కాబట్టే కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారని బండ్ల గణేష్ అన్నారు. ప్రజలకు బీఆర్ఎస్ మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెల రోజులు పూర్తి కాకుండానే ఎందుకు మీకు ఇంత బాధ, భయం అంటూ కేటీఆర్ ను ప్రశ్నించారు. అప్పుడే తొందరపడకండి, కొంత సమయం ఇవ్వండి కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా పాలిస్తుందని బండ్ల గణేష్ బీఆర్ఎస్ నాయకులకు సూచించారు. 

రేవంత్ రెడ్డికి పరామర్శ
తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. కాగా జ్వరంతో బాధపడుతున్న ఆయనకు జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో వైద్యులు కొవిడ్ పరీక్షలు నిర్వహించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జ్వరం బారిన పడ్డారని తెలుసుకున్న బండ్ల గణేష్ ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.  ‘గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి విన్నపం. దయచేసి రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా నా ప్రార్థన. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. రాష్ట్ర ప్రజల కోసం మీరు నిండు నూరేళ్లు సంపూర్ణంగా చల్లగా ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్ బండ్ల గణేష్ ట్వీట్ లో పేర్కొన్నారు.