Caste: కులాల ప్రతిపాదిత జనాభా గణన డిసెంబర్ 9కి వాయిదా

టిడిపి మీద ఆరోపించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి

Courtesy: Twitter

Share:

Caste: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ (A.P) ఇలా ప్రతి రాష్ట్రంలో కూడా కుల (Caste) ప్రతిపాదిత జనాభా లెక్కలను వెల్లడించాలని ఎప్పటినుంచో మోదీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రశ్నిస్తూనే ఉంది. ఇదిలా ఉండగా మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ (A.P) రాష్ట్రవ్యాప్తంగా వివిధ కులాల (Caste) ప్రతిపాదిత జనాభా గణనను ప్రభుత్వం నవంబర్ 27 నుంచి డిసెంబర్ 9కి వాయిదా వేసింది. 

డిసెంబర్ 9 కి వాయిదా: 

ఇటీవల జరిగిన ఒక విలేకరుల సమావేశంలో బీసీ (BC) సంక్షేమ శాఖ మంత్రి సీహెచ్‌.శ్రీనివాస వేణుగోపాలకృష్ణ (Ch. Srinivasa Venugopalakrishnan) ఆంధ్రప్రదేశ్ (A.P) కుల (Caste) గణన నిర్వహణ విధివిధానాలను ఖరారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఐదు ప్రాంతీయ రౌండ్‌టేబుల్ సమావేశాలతో పాటు జిల్లా సమావేశాలను నిర్వహించిందని వెల్లడించడం జరిగింది. అయితే, అదనపు వివరాలను సేకరించడానికి మండల స్థాయిలో వాటాదారులతో కూడా ఆంధ్రప్రదేశ్ (A.P) సమావేశాలు నిర్వహించాలని సూచనలు వచ్చాయి. జనాభా గణన సమయంలో సేకరించాల్సిన సమగ్ర వివరాలపై ఆంధ్రప్రదేశ్ (A.P) రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది.

అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని డిసెంబర్ 9న కుల (Caste) గణనను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని వేణుగోపాలకృష్ణ తెలిపారు.  మనం చేసే కుల (Caste) గణన చరిత్ర చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. నాటి ఎన్.చంద్రబాబు ప్రభుత్వం బీసీ (BC)ల పట్ల అమానుషంగా వ్యవహరిస్తోందని మంత్రి ఆరోపించారు. బీసీ (BC)లను పొట్టన పెట్టుకుంటామని, తోక కోస్తామని మాజీ ముఖ్యమంత్రి బెదిరించారని ఆరోపించారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, పార్టీలో బీసీ (BC)లకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వారిని తన అన్నదమ్ములుగా ఆదరిస్తున్నారు సీహెచ్‌.శ్రీనివాస వేణుగోపాలకృష్ణ (Ch. Srinivasa Venugopalakrishna).

అసెంబ్లీ, మండలి, పార్లమెంట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ (BC), మైనార్టీ, మహిళలకు సీఎం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని వేణుగోపాలకృష్ణ మరొకసారి గుర్తు చేశారు. దేశంలోనే సామాజిక న్యాయం చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అని సీహెచ్‌.శ్రీనివాస వేణుగోపాలకృష్ణ (Ch. Srinivasa Venugopalakrishnan) ప్రకటించారు.

కుల (Caste) గణన జరపకుండా అడ్డంకులు సృష్టించేందుకు తెలుగుదేశం ప్రయత్నిస్తోందని మంత్రి ఆరోపించారు. షెడ్యూల్డ్ కులాల (Caste) గణన, వెనుకబడిన తరగతులకు సంబంధించి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఇద్దరు మీడియా అధినేతలు రామోజీరావు, రాధాకృష్ణ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బీహార్‌లో కుల (Caste) గణన జరుగుతున్న తీరును తాము పరిశీలించామని వేణుగోపాలకృష్ణ తెలిపారు. ఏపీలో ప్రతిపాదిత జనాభా లెక్కల కోసం, వారు కొన్ని ప్రధానమైన అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. వివిధ కులాల (Caste) వారి జీవన స్థితిగతులను పరిశీలించాలనే డిమాండ్ చాలా కాలంగా ఉందని సీహెచ్‌.శ్రీనివాస వేణుగోపాలకృష్ణ (Ch. Srinivasa Venugopalakrishnan) నొక్కి చెప్పారు. ఈ అంశం కూడా AP కుల (Caste) గణనలో పరిగణించబడుతుంది. 

యూపీలో కులాల ప్రతిపాదిత జనాభా గణన ఉండబోదు: 

సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే సంగ్రామ్ యాదవ్, యూపీ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ని తమ రాష్ట్రంలో ఏ కులంలో ఎంతమంది ఉన్నారు అని లెక్కింపు చేయడం ఉంటుందా.. అని అడిగిన ప్రశ్నకు, సమాధానం ఇస్తూ, ప్రతిపక్ష పార్టీలు కోరుతున్నట్లుగా రాష్ట్రంలో కుల (Caste) సెన్సస్ అనేది నిర్వహించే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల తేల్చి చెప్పారు.  భారత రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్‌లోని యూనియన్ జాబితాలో జనాభా గణన అంశం అనేది 69వ స్థానంలో ప్రస్తావించడం జరిగింది. జనాభా గణన చట్టం 1948 మరియు సెన్సస్ రూల్స్ 1990 లను భారత ప్రభుత్వం జనాభా గణన కోసం రూపొందించింది, అయితే దీనికి సంబంధించి భారత ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది అన్నారు, యోగి,