Bill: 10 బిల్లులను మళ్లీ అమల్లోకి తీసుకొచ్చిన స్టాలిన్

గవర్నర్ వెనక్కి తీసుకున్న బిల్లులు..

Courtesy: Twitter

Share:

Bill: తమిళనాడు (Tamil nadu) అసెంబ్లీ రోజు ఏకగ్రీవంగా ఆమోదించిన 10 బిల్లులను (Bill) స్టాలిన్ (Stalin) తీసుకురావడం జరిగింది. ఎలాంటి కారణాలు చూపకుండా ఆర్‌ఎన్ రవి వెనక్కి తీసుకున్న పది బిల్లులను (Bill) పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (Stalin) తీర్మానం చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 2020.2023లో రెండేసి బిల్లులను (Bill) సభ ఆమోదించగా, గత ఏడాది మరో ఆరు బిల్లులు (Bill) ఆమోదించబడ్డాయి. 

10 బిల్లులను మళ్లీ అమల్లోకి తీసుకొచ్చిన స్టాలిన్: 

ఇటీవల కాలంలో ఎటువంటి కారణాలు చెప్పకుండా తమిళనాడు (Tamil nadu) గవర్నర్ (Governor) వెనక్కి తీసుకున్న పది బిల్లులను (Bill) మళ్లీ అమల్లోకి తీసుకువచ్చే ఆలోచన చేశారు తమిళనాడు (Tamil nadu) ముఖ్యమంత్రి స్టాలిన్ (Stalin). ఈ విషయాలను చర్చించిన అసెంబ్లీలో, ఏఐఏడీఎంకే (DMK) ఈ చర్యకు మద్దతిచ్చినా మరో సమస్యపై ఆ పార్టీ వాకౌట్ చేసింది. నలుగురు ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ కూడా వాకౌట్ చేసింది. గవర్నర్ (Governor) రవిపై, తన మాటలతో దాడి చేసిన స్టాలిన్ (Stalin), ఎటువంటి కారణం లేకుండా ఆమోదాన్ని నిలిపివేయడం ఆమోదయోగ్యం కాదని అసెంబ్లీలో అన్నారు. అయితే మరోవైపు, తన వ్యక్తిగత ఇష్టాయిష్టాల కారణంగా బిల్లులు (Bill) వాపస్‌ ఇచ్చారని... ఆమోదం తెలపకపోవడం అప్రజాస్వామికం, ప్రజావ్యతిరేకమని, మరోసారి అసెంబ్లీలో బిల్లులు (Bill) ఆమోదించి తనకు పంపితే గవర్నర్ (Governor) ఆమోదం తెలపలేరని అన్నారు.. బీజేపీ పాలిత రాష్ట్రాలను, గవర్నర్ (Governor)ల ద్వారా లక్ష్యంగా చేసుకుంటున్నారని, ఇది స్పష్టంగా ప్రతి ఒక్కరికి కనిపిస్తోందని స్టాలిన్ (Stalin) ఆరోపించారు.

తమిళనాడు (Tamil nadu) రాజ్‌భవన్‌, అధికార డీఎంకే (DMK) మధ్య గత రెండేళ్లుగా పోరు కొనసాగుతోంది. బిజెపి ప్రభుత్వం నియమించిన ఆర్‌ఎన్ రవి చాలా ఆలస్యంగా నీట్ మినహాయింపు బిల్లు (Bill)ను వెనక్కి తీసుకున్నారు.. మళ్లీ ఆ తర్వాత అసెంబ్లీ రెండవసారి ఆమోదించిన తర్వాతనే రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. తన అసెంబ్లీ ప్రసంగంలో తనకు ఇచ్చిన అధికారిక ప్రసంగంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను చదవకుండా దాటవేశారు తమిళనాడు (Tamil nadu) గవర్నర్ (Governor). అంబేద్కర్, పెరియార్, కామరాజ్, అన్నాదురై మరియు కరుణానిధి వంటి నాయకుల పేర్లను చదవడం మానేశాడు. అయితే ఆయన ప్రసంగాన్ని రికార్డు చేయకూడదని అసెంబ్లీ తీర్మానం చేసింది.

కేంద్రాన్ని కోరిన కోర్టు:

గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిని రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఛాన్సలర్‌గా కొంతకాలం నియమించడం జరిగింది. . ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని, ఛాన్సలర్‌గా వైస్ ఛాన్సలర్‌లను నియమించడంలో అనేక రాష్ట్రాలు గవర్నర్ (Governor)‌కు అధికారాలను కూడా రద్దు చేశాయి. అత్యున్నత న్యాయస్థానం తదుపరి విచారణకు ముందే బిల్లులను (Bill) హడావుడిగా వాపస్ తీసుకునే ప్రాసెస్ ద్వారా, రాజ్ భవన్ ఏ బిల్లు (Bill) పెండింగ్‌లో లేదనే అభిప్రాయాన్ని కలిగించడానికి ప్రయత్నించింది. అయితే, అధికార డీఎంకే (DMK) వాటిని మళ్లీ ఆమోదించి, అంతేకాకుండా గవర్నర్ (Governor)‌కు వాటిని ముందస్తుగా మార్చాలని కోరుతోంది, కాబట్టి ఆయన ఒప్పుకోవడం తప్పిస్తే వేరే మార్గం ఉండదు. బిల్లు (Bill)లకు ఆమోదం తెలిపేందుకు గవర్నర్ (Governor)‌లకు గడువు ఇవ్వాలని రాష్ట్రం సుప్రీంకోర్టును కోరింది.

మరి ముఖ్యంగా రాష్ట్ర గవర్నర్ (Governor)లు, ఆర్‌ఎస్‌ఎస్,బిజెపి ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, రాష్ట్ర కేబినెట్ సహాయ, సలహాలకు కట్టుబడి ఉండాల్సిన రాజ్యాంగ అధిపతి, ఎన్నికైన ప్రభుత్వాన్ని అణగదొక్కడం ద్వారా బిల్లు (Bill)లకు ఆమోదం తెలపకుండా రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని అధికార డిఎంకె ఆరోపించింది. అనేక ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు కూడా తమ గవర్నర్ (Governor)‌పై ఇలాంటి ఆరోపణలపై సుప్రీంకోర్టును ఆశ్రయించాయి, ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ సమస్యను తీవ్రంగా పరిగణించింది కూడా. మరి ముఖ్యంగా గవర్నర్ (Governor)ల వ్యవహారం, తీరు గమనించాలి అంటూ తమిళనాడు (Tamil nadu) ప్రభుత్వం కేంద్రాన్ని కోరడం జరిగింది. అయితే గవర్నర్ (Governor)‌పై వచ్చిన ఆరోపణలపై కేంద్రం స్పందించాలని కోర్టు కోరింది.