Transplantation: మొదటి లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్న ఇండియ‌న్

ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..

Courtesy: Unsplash

Share:

Transplantation: చాలామంది చిన్నపిల్లలు పుట్టిన వెంటనే ఏదో ఒక ఆరోగ్య సమస్య కారణంగా భారతదేశంలో ఎంతో మంది చిన్న పిల్లలు పుట్టిన వెంటనే ఏదో ఒక అనారోగ్య సమస్యకు గురవుతున్నారు. మరి ముఖ్యంగా, పెద్ద పెద్ద సర్జరీలు (Surgery) చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సుమారు 25 సంవత్సరాల క్రితం ఒక చిన్న పిల్లవాడికి లివర్ (Liver) ఫెయిల్యూర్ అవ్వగా అప్పుడే పుట్టిన బిడ్డకు లివర్ (Liver) ట్రాన్స్ ప్లాంటేషన్ (Transplantation) ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేశారు డాక్టర్లు (Doctor). అయితే 25 సంవత్సరాల క్రితం ట్రాన్స్ ప్లాంటేషన్ (Transplantation) చేయించుకున్న ఆ బాబు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఎక్కడ ఉంటున్నాడు అనే విషయాలు తెలుసుకుందాం. 

ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..: 

తమిళనాడుకు చెందిన 20 నెలల చిన్నారి సంజయ్ కందసామి, 1998లో భారతదేశపు మొట్టమొదటి విజయవంతమైన పీడియాట్రిక్ లివర్ (Liver) ట్రాన్స్ ప్లాంటేషన్ (Transplantation) చేయించుకున్న అబ్బాయి. ఇప్పుడు, అతని లివర్ (Liver) ట్రాన్స్ ప్లాంట్ అయిన తర్వాత 25 సంవత్సరాల తర్వాత, అతను ఇప్పుడు ఒక డాక్టర్ గా ప్రత్యక్షమయ్యాడు, ప్రాక్టీస్ చేస్తున్న ఒక డాక్టర్ (Doctor) గా అతని జీవితం పూర్తి స్థాయికి చేరుకుంది. కాంచీపురంలోని తన స్వగ్రామంలోని స్థానిక ఆసుపత్రిలో డాక్టర్ (Doctor) గా విధులు నిర్వహిస్తున్నారు. నివేదికల ప్రకారం, ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్ కందసామికి ప్రాణాలను రక్షించే లివర్ (Liver) ట్రాన్స్ ప్లాంటేషన్ (Transplantation) నిర్వహించింది, తద్వారా దేశంలోనే మొదటి పీడియాట్రిక్ లివర్ (Liver) ట్రాన్స్‌ప్లాంటీగా నిలిచింది కూడా. 

తమిళనాడుకు చెందిన కందస్వామి తనకు చిన్నతనంలో జరిగిన లివర్ (Liver) ట్రాన్స్ ప్లాంటేషన్ (Transplantation) కారణంగా ఇప్పుడు తాను పూర్తి ఆరోగ్యంతో డాక్టర్గా (Doctor) మారినందుకు గర్వంగా ఉందని పేర్కొన్నాడు. మరి ముఖ్యంగా అతనికి జరిగిన, లివర్ (Liver) ట్రాన్స్ ప్లాంటేషన్ (Transplantation) తనకి డాక్టర్గా (Doctor) మారే స్ఫూర్తినిచ్చిందని కూడా వెల్లడించాడు 25 ఏళ్ల కందస్వామి. ప్రస్తుతం మేదాంత హాస్పిటల్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ (Liver) ట్రాన్స్‌ప్లాంటేషన్ ఛైర్మన్‌గా ఉన్న డాక్టర్ (Doctor) ఎఎస్ సోయిన్, కందసామికి లివర్ (Liver) ట్రాన్స్ ప్లాంటేషన్ (Transplantation) ఆపరేషన్ తన కెరీర్‌లో గర్వించదగిన క్షణాలలో ఒకటిగా పేర్కొన్నారు. ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా తన 28 ఏళ్ల కెరీర్‌లో ఇది గర్వించదగ్గ క్షణాల్లో ఒకటి అని.. తమ హాస్పిటల్ లో ట్రాన్స్ ప్లాంటేషన్ (Transplantation) చేయించుకున్న ఒక చిన్న బాబు ఇప్పుడు డాక్టర్ (Doctor) గా మారడం చాలా బాగుందని చెప్పుకొచ్చాడు చైర్మన్. అపోలో ఆసుపత్రి వైద్యులు కందసామికి జరిగిన విజయవంతమైన ఆపరేషన్ తో సహా 4,300 లివర్ (Liver) ట్రాన్స్ ప్లాంటేషన్ (Transplantation) ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించారు. 

ట్రాన్స్ ప్లాంటేషన్ అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు: 

సాధారణంగా, కిడ్నీ, లివర్ (Liver) వంటి ట్రాన్స్ ప్లాంటేషన్ (Transplantation) తర్వాత సుమారు 7 నుండి 10 రోజుల వరకు హాస్పిటల్ లోనే ఉండాల్సి ఉంటుంది. అయినప్పటికీ, పూర్తిగా కోలుకోవడానికి, అదే విధంగా తమ పని చేసుకోవడానికి చాలా వారాల నుండి కొన్ని నెలల వరకు పట్టచ్చు. రెగ్యులర్ ఫాలో-అప్, సమయానికి మెడిసిన్ వేసుకోవడం మరియు మూత్రపిండాల పనితీరును పర్యవేక్షించడం వంటి వైద్య బృందం సూచనలను పాటించడం వంటి వాటి మీద పేషెంట్ తప్పకుండా శ్రద్ధ వహించాలి. ఇది సగటు పేషెంట్ రికవరీ రోజులను తగ్గించే అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా కిడ్నీ, లివర్ (Liver) ట్రాన్స్ ప్లాంటేషన్ (Transplantation) జరిగిన తర్వాత ఆహార విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో ఉప్పు శాతం, తాగే నీరు శాతం, పొటాషియం, ఫాస్ఫరస్ వంటివి మన శరీరంలో ఎంత మొత్తంలో ఉన్నాయి, ఇలా అనేక రకాలుగా మనం డైట్ ఫాలో అవుతూ ఉండాలి. నిజానికి మనం రోజు తాగే నీళ్లు మన కిడ్నీ సంరక్షణలో ఎంతగానో ఉపయోగపడుతుంది.

మన జీవన శైలిలో పలు మార్పులు తీసుకురావాలి. ముఖ్యంగా డైట్ విషయంలో, ఫిజికల్ యాక్టివిటీ విషయంలో, ధూమపానం, మద్యపానం ఇటువంటి విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. కిడ్నీ, లివర్ (Liver) ఫెయిల్యూర్ కి ధూమపానం. మద్యపానం ముఖ్య కారణాలు. అందుకనే కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ (Transplantation) జరిగిన అనంతరం ఒకవేళ జ్వరం, నొప్పి, మూత్ర విసర్జనలో మార్పులు, వాపు ఇలాంటివి కనిపించినట్లయితే వెంటనే వైద్యుని సంప్రదించడం మంచిది.