Cab: ఈ క్యాబ్ ఎక్కిన వాళ్ళు నిజంగా వావ్ అంటున్నారు

క్యాబ్ విశేషాలు మీకోసం..

Courtesy: Twitter

Share:

Cab: సాధారణంగా క్యాబ్ (Cab) డ్రైవర్ (Driver)లు ఎక్కడ కస్టమర్లను పిక్ చేసుకోవడం మళ్ళీ వాళ్ళని డ్రాప్ చేయడం వరకు వాళ్ళ పనిగా పెట్టుకుంటూ ఉంటారు. ముఖ్యంగా చాలా క్యాబ్ (Cab) డ్రైవర్ (Driver)లు ఎక్కువ దూరం ప్రయాణం చేసి ఎక్కువగా సంపాదించాలని అనుకునే వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు. అయితే మరి కొంత మంది మాత్రం, తాము చేస్తున్న పనిలోని సంతోషం వెతకాలని, కస్టమర్ల కళ్ళల్లో సంతోషం చూడాలని, తమ క్యాబ్ (Cab) ఎక్కిన వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకుండా మరిన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఒక క్యాబ్ (Cab) డ్రైవర్ (Driver) ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. 

క్యాబ్ విశేషాలు మీకోసం..: 

మనలో చాలా మందికి, మంచి క్యాబ్ (Cab) రైడ్ ఆలోచన అంటే శుభ్రమైన ఇంటీరియర్ మరియు సురక్షితమైన డ్రైవింగ్. అయితే, ఈ క్యాబ్ (Cab) డ్రైవర్ (Driver) ఉచితంగా కూల్ డ్రింక్స్, స్నాక్స్, షూ పాలిష్, సాధారణ మందులు మరియు ఉచిత వైఫై వంటి ఉచిత ఫీచర్‌లను తమ క్యాబ్ (Cab) లో అందిస్తూ, సాధారణ క్యాబ్ (Cab) రైడ్ అనుభవాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లారు. అబ్దుల్ ఖదీర్ అనే వ్యక్తి ఢిల్లీ (Delhi)లోని ఒక క్యాబ్ (Cab) డ్రైవర్ (Driver). ఇటీవలి, ఖదీర్ స్టాక్ క్యాబ్ (Cab) అతని క్యాబ్ (Cab) కస్టమర్ల నుండి చాలా ప్రశంసలను పొందింది. ఇటీవల, ఒక ఇన్‌స్టాగ్రామ్ యూజర్, తాను ఖదీర్ కాంటాక్ట్ నంబర్‌తో పాటు, ఈ ప్రత్యేకమైన క్యాబ్ (Cab)‌ కు సంబంధించిన ఒక ప్రత్యేకమైన వీడియో క్లిప్‌ను పంచుకున్నారు. త్వరలో ఈ వీడియో 4.6 లక్షలకు పైగా లైక్‌లు రావడం విశేషం.

డ్రైవర్ (Driver)‌కి కృతజ్ఞతలు తెలుపుతూ, హెయిర్ బ్యాండ్‌లు, టోఫీలు, నీరు, ఫ్రూటీలు, న్యాప్‌కిన్‌లు, గొడుగుతో సహా ప్రయాణిస్తున్నప్పుడు అవసరమయ్యే దాదాపు అన్ని అవసరమైన వస్తువులను క్యాబ్ (Cab)‌లో ఉన్నాయని.. ఇటువంటి క్యాబ్ (Cab) ఎక్కడం కొత్త అనుభవం అంటూ వీడియో క్లిప్ ద్వారా ఒక ఇంస్టాగ్రామ్ యూజర్ తన క్యాబ్ (Cab) ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాడు. ఇది చూసిన చాలామంది నెటిజన్లు స్పందిస్తూ, తాము కూడా ఈ క్యాబ్ (Cab) లో ప్రయాణించినట్లు, నిజంగా అబ్దుల్ ఖదీర్ క్యాబ్ (Cab) ఎక్స్పీరియన్స్ అద్భుతంగా ఉన్నట్లు కామెంట్లు పెడుతున్నారు. షూ పోలీష్ దగ్గర్నుంచి వైఫై వరకు అన్ని కూడా మనకి ఉచితంగా లభిస్తాయని మరొక యూజర్ కామెంట్ పెట్టాడు. ఈ ప్రత్యేకమైన క్యాబ్ (Cab) లోని వస్తువులను మార్చేందుకు, కస్టమర్లకు సౌకర్యవంతమైన ఎక్స్పీరియన్స్ అందించడానికి నెల నెల, ఈ క్యాబ్ (Cab) డ్రైవర్ (Driver) మూడు వేల రూపాయలు ఖర్చు పెడతాడట. మరి మీరు కూడా ఇటువంటి క్యాబ్ (Cab) లో ప్రయాణించాలనుకుంటే తప్పకుండా ఢిల్లీ (Delhi) వెళ్లాల్సిందే. 

 

లక్షల సంపాదించిన ఉబర్ డ్రైవర్ : 

యునైటెడ్ స్టేట్స్‌లోని నార్త్ కరోలికు చెందిన 70 ఏళ్ల ఉబర్ (Uber) డ్రైవర్ (Driver) ఒక సంవత్సరంలో తన ట్రిప్‌లలో 30 శాతానికి పైగా క్యాన్సిల్ (Cancel) చేయడం ద్వారా సుమారు $28,000 (రూ. 23.3 లక్షలు) సంపాదించాడు (Earn). ఇన్‌సైడర్‌లోని ఒక నివేదిక ప్రకారం, "బిల్" అనే డ్రైవర్ (Driver), తాను 10 శాతం కంటే తక్కువ కస్టమర్లకు ఓకే చెప్పి.. కేవలం సంవత్సరంలో 1,500 ట్రిప్పులకు వెళ్లినట్లు వెల్లడించాడు. 

ఆ వ్యక్తి ఆరు సంవత్సరాల క్రితం రిటైర్ అయ్యి.. ఇప్పుడు ఎక్స్ట్రా ఆదాయాన్ని సంపాదించడానికి (Earn) ఉబర్ (Uber) ప్లాట్‌ఫారమ్‌లో పార్ట్‌టైమ్ పని చేయడం ప్రారంభించాడు. అయినప్పటికీ, తను సమయానికి బట్టి రైడ్స్ (Ride) సెలెక్ట్ చేసుకుంటాడని.. రద్దీగా ఉన్న ప్రాంతాలలో మాత్రమే ఎక్కువగా తాను రైడ్స్ (Ride) ఒప్పుకుంటూ ఉంటానని, ఉబర్ (Uber) డ్రైవర్ (Driver) చెప్పడం జరిగింది. అంతేకాకుండా తను వారానికి 40 గంటలు పని చేయడానికి, తన స్మార్ట్ వర్క్ తో 30 గంటలకు తగ్గించానని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా కరోనా (Corona) సమయంలో కూడా తను పనిచేసినట్లు వెల్లడించాడు డ్రైవర్ (Driver). అంతేకాకుండా, గంటకు 50 డాలర్లు సంపాదించేవాడని (Earn), అయితే మిగిలిన డ్రైవర్ (Driver)లు ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కరోనా (Corona) సమయంలో లేకపోవడమే తన సంపాదనకు కారణం అన్నాడు. అయితే ఇప్పుడు పరిస్థితి మామూలుగా ఉన్నప్పటికీ, తన గంటకి 15 నుంచి 20 డాలర్ల వరకు సంపాదిస్తున్నట్లు వెల్లడించాడు డ్రైవర్ (Driver).