Pawan Kalyan: టాప్ ప్రొడ్యూసర్ కు ప్రమోషన్ ఇచ్చిన పవన్

ఆనందం కలిగిస్తుందంటున్న నిర్మాత

Courtesy: Twitter

Share:

Pawan kalyan: టాలీవుడ్ (Tollywood) లో ప్రముఖ నిర్మాతల్లో ఒకరైన బోగవల్లి వెంకట ప్రసాద్ (బీవీఎస్ ప్రసాద్) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ ప్రేక్షకులను ఆయన సుపరిచితమే. ఎన్నో హిట్ (Hit) సినిమాలను ఆయన తన బ్యానర్ (Banner) ద్వారా అందించారు. మొన్నటి వరకు సినిమా ఇండస్ట్రీకే (Cine Industry) పరిమితం అయిన ఆయన ప్రస్తుతం రాజకీయ రంగంలోకి కూడా దిగారు. రాజకీయ రణరంగంలో ప్రసాద్ (Prasad) తలమునకలయ్యారు. ఆయన జనసేన (Janasena) పార్టీ తరఫున ఖమ్మం అసెంబ్లీ బరిలో నిల్చున్న మిర్యాల రామక్రిష్ణ తరఫున ప్రచారం (Campaign) కొనసాగిస్తున్నారు. ఈ బాధ్యతలను పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan kalyan) ఆయనకు అప్పజెప్పారు. పార్టీ తనకు అందించిన బాధ్యతల పట్ల సంతోషంగా (Happy) ఉన్నట్లు బోగవల్లి తెలిపారు. అంతే కాకుండా ఆయన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan kalyan) గురించి ఆయన విజన్ గురించి కూడా ప్రముఖ మీడియాతో మాట్లాడారు. ఆయన పార్టీ గురించి పార్టీ అధినేత గురించి ఏమని అనుకుంటున్నారో తెలుసుకుందాం..

అత్తారింటికి దారేది వంటి హిట్.. 

బీవీఎస్ఎన్ ప్రసాద్ (BVSN Prasad) పవన్ కల్యాణ్ కు అత్తారింటికి దారేది వంటి హిట్ (Hit) మూవీని అందించారు. ఈ మూవీ పవన్ (Pawan kalyan) కెరియర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతటి హిట్ సినిమాను అందించిన ప్రసాద్ ను పవన్ కల్యాణ్ ఏనాడూ మరచి పోలేదు. కేవలం పవన్ కల్యాణ్ (Pawan kalyan) కు మాత్రమే కాకుండా ఆయన అల్లుడైన సాయిధరమ్ తేజ్ కు ప్రసాద్ హిట్ అందించారు. సాయి కెరియర్ లోనే హిట్ గా నిలిచిన విరూపాక్ష మూవీని ప్రసాద్ అందించడం గమనార్హం. కేవలం ఈ ఇద్దరికి మాత్రమే కాకుండా టాలీవుడ్ లో ఇంకా అనేక మంది హీరోలకు (Heroes) ప్రసాద్ హిట్స్ అందించారు. 

ప్రశ్న: రాజకీయ నాయకుడిగా మీ కొత్త ప్రయాణం ఎలా ఉంది?

నేను నా కొత్త పనిని (Work) ఆనందిస్తున్నాను. అందులో ఎటువంటి సందేహం (Doubt) లేదు. నేను సినిమాల (Cinemas) కోసం చాలా సమయం వెచ్చించాను. ఇప్పుడు నేను పవన్ కల్యాణ్ (Pawan kalyan) జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్నాను. ఎందుకంటే అతను ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశ్యంతో నిజాయితీ మరియు నిబద్ధత కలిగిన రాజకీయ నాయకుడు (Political Leader). అతను చాలా మంచి ఆలోచనలను కలిగి ఉన్న దూరదృష్టి గలవాడు. ఆసక్తికరంగా, సినిమా మరియు రాజకీయాల మధ్య నాకు కొన్ని పోలికలు ఉన్నాయని అతడు తెలిపాడు. రెండూ ప్రజలను ఆకర్షించడానికి ఉద్దేశించబడ్డాయి. ప్రజలే వారి విధిని నిర్ణయిస్తారు. మా అభ్యర్థి మిరియాల రామకృష్ణకు మద్దతుగా నేను ఖమ్మంలో (Khammam) ఉన్నానని తెలిపారు. జనాల స్పందన విపరీతంగా ఉంది. నేను నియోజకవర్గానికి పరిశీలకుడిగా నియమించబడ్డాను, రాబోయే రోజుల్లో మా ప్రచార పురోగతిని నిశితంగా పరిశీలిస్తానని వెల్లడించారు. .

ప్రశ్న: మీరు మొదటిసారిగా ప్రచారానికి వచ్చారా? ఎలా అనుభూతి చెందుతున్నారు?

నిజాయితీగా చెప్పాలంటే, 1985లో కాలేజీలో చదువుతున్న (College Days) రోజుల్లో నా ప్రాంతంలో టీడీపీ టికెట్‌ పై పోటీ చేసిన నా బంధువుల (Relatives) కోసం నేను ప్రచారం చేయడం ప్రారంభించాను. ప్రచారం చేయడం నాకు కొత్తేం కాదు. అయితే, ఇప్పుడు నా వయస్సు రీత్యా ఇంటింటికీ ప్రచారం చేయడం సాధ్యం కాదు. కానీ మా అభ్యర్థికి మద్దతు ఇస్తాను మరియు వీలైనంత వరకు ప్రజలకు (People) చేరువయ్యేందుకు ప్రయత్నిస్తాను. పవన్ టిక్కెట్ల పంపిణీలో యువకులకు ప్రాధాన్యత ఇవ్వడం మరియు సమాజానికి మంచి జరగుతోందని నాకు కూడా సంతోషాన్నిస్తుంది. వచ్చే ఏడాది పార్లమెంట్‌ (Parliament) ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు కూడా సిద్ధమవుతున్నాను.

ప్రశ్న: మీ సినిమా ప్రొడక్షన్స్ ఎలా ఉన్నాయి? 

నా కొడుకు (Son) బాపినీడు మా ప్రొడక్షన్స్‌ ని హ్యాండిల్ చేస్తున్నాడు. కాబట్టి నాకు పొలిటికల్ స్పేస్‌ దొరికింది. అతను మంచి కథలను (Stories) అంచనా వేయడంలో మరియు ఖచ్చితమైన ప్రణాళికతో మరియు నిర్దిష్ట బడ్జెట్‌ లతో బ్లాక్‌ బస్టర్‌ (Blockbuster) లను తీయడంలో సిద్ధ హస్తుడు. యువ నటులు నిఖిల్ మరియు సిద్ధు జొన్నలగడ్డ సినిమాలు మా బ్యానర్ లో ఉన్నాయి. వాటి మొత్తం పర్యవేక్షణ మా కొడుకే చూసుకుంటున్నాడు. కావున నాకు కాస్త పని (Work) తగ్గిందనే చెప్పాలి. 

ప్రశ్న: తెలంగాణ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందా?

ఎన్నికలలో (Election) పోటీ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర పార్టీ క్యాడర్‌ లో విశ్వాసం మరియు నైతిక స్థైర్యం పెరుగుతుంది. అసెంబ్లీ (Assembly) స్థానాలకు అభ్యర్థుల ప్రకటన తర్వాత వారు కొత్త ఎత్తులో ఉన్నారు. రాష్ట్రంలో ప్రత్యర్థి పార్టీల నుంచి పోటీ ఉన్నప్పటికీ మరిన్ని విజయాలు (Wins) సాధించేందుకు మేమంతా కృషి చేస్తున్నాం.

ఇలా జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉన్న ప్రముఖ నిర్మాత ప్రసాద్ ఎన్నో విషయాలను మీడియాతో పంచుకున్నారు. ఈ నెల 30వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. జనసేన (Janasena) పార్టీ తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకుని కొన్ని స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తుంది. మొత్తం 119 స్థానాల్లో కాకుండా కొన్ని పరిమిత స్థానాలను మాత్రమే ఎంచుకుంది. మరి జనసేన (Janasena)  పార్టీ తెలంగాణ ఎన్నికల్లో ఎంత వరకు ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి.