Covid-19 update: దేశంలో ప్రస్తుతం 2669 కొవిడ్ యాక్టివ్ కేసులు!

Covid-19 update: దేశంలో మరోసారి కరోనా వైరస్ విజృంభిస్తోంది. కేరళ, కర్ణాటక నుంచి రాజధాని ఢిల్లీ వరకు కూడా కొత్త వైరస్ వ్యాప్తి కనిపిస్తోంది. ఒగడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 358 కేసులు నమోదయ్యాయి. ఇందులో 300 కేసులు ఒక్క కేరళలోనే వెలుగుచూశాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Courtesy: IDL

Share:

దేశంలో మరోసారి కరోనా వైరస్ విజృంభిస్తోంది. కేరళ, కర్ణాటక నుంచి రాజధాని ఢిల్లీ వరకు కూడా కొత్త వైరస్ వ్యాప్తి కనిపిస్తోంది. ఒగడిచిన  24 గంటల్లో దేశవ్యాప్తంగా 358 కేసులు నమోదయ్యాయి. ఇందులో 300 కేసులు ఒక్క కేరళలోనే  వెలుగుచూశాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.  ఇక దేశంలో గడిచిన 24 గంటల్లో ఆరు మరణాలు సంభవించాయి.కేరళలో ముగ్గురు చనిపోగా కర్ణాటకలో ఇద్దరు, పంజాబ్ లో ఒకరు చనిపోయారు. ప్రస్తుతం దేశంలో 2,669 యాక్టివ్ లు ఉన్నాయి.  ఈ నేపథ్యంలోనే వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి బుధవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించాల్సి వచ్చింది. భయాందోళనలకు గురి కానక్కర్లేదు కానీ, జాగ్రత్తలు మాత్రం తీసుకోవడం తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు. వివిధ దేశాల్లో ఇప్పటికే ఇది తన విజృంభణ చూపుతోంది. సింగపూర్‌లో డిసెంబర్‌ 3 ముందు వారంలో 32 వేల మందికి కరోనా సోకితే, ఆ తరువాతి వారంలో 56 వేల మందికి ఇన్ఫెక్షన్‌ వచ్చిందని సింగపూర్‌ ఆరోగ్య శాఖ వెల్లడించింది. 


తెలంగాణలో ఆరు కేసులు
తెలంగాణలో కూడా కేసులు వెలుగు చూస్తున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 6 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. బుధవారం 538 మందికి పరీక్షలు చేయగా ఆరుగురికి కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయ్యింది. మరో 42 మందికి సంబంధించిన రిపోర్ట్స్ వెలువడాల్సి ఉంది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 14 మంది కొవిడ్‌ చికిత్సలు పొందుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కోవిడ్ కేసులు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వెళ్తే తప్పనిసరిగా మాస్కులు ధరించాలని అధికారులు సూచించారు. 

తెలంగాణలో కోవిడ్ కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయని రాష్ట్ర వ్యాప్తంగా ఆరు కొత్త కేసులు వెలుగు చూశాయని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటికే చికిత్స పొందుతన్న వారిలో ఒకరు పూర్తిగా కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో ఎలాంటి కొవిడ్ మరణాలు నమోదు కాలేదు. కోవిడ్ కేసుల్లో రికవరీ రేటు 99.51శాతంగా ఉన్నట్టు ప్రకటించారు. కోవిడ్ పాజిటివ్ వచ్చి తీవ్రమైన లక్షణాలతో ఉన్న రోగులు ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకోవచ్చని అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలు, రోగులకు అవసరమైన సదుపాయాలను అందించేందుకు సిద్దంగా ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

రాజధాని ఢిల్లీలో 3 మందికి కరోనా సోకినట్లు ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ చెప్పారు. పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా, ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ అన్నారు. ఆక్సిజన్ సిలిండర్ల నుండి వెంటిలేటర్ల వరకు ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.


గత మూడేళ్ళలో దేశంలో 4.5 కోట్ల మంది కరోనా బారినపడ్డారనీ, 5.33 లక్షల మంది మరణించారనీ సర్కారు వారి తాజా లెక్క. ఈ అధికారిక లెక్కలకు అందని, సామాన్య బాధితుల సంఖ్య ఇంతకు అనేక రెట్లు ఎక్కువే ఉండొచ్చని నిపుణుల అంచనా. ఈ పరిస్థితుల్లో టెస్ట్‌లు ఎంత ఎక్కువగా చేస్తే, కరోనా విజృంభణను అంత త్వరగా పసిగట్టి, చర్యలు చేపట్టవచ్చు. అలాగే, కొత్త వేరియంట్లకు ఇప్పుడున్న టీకాలు ఏ మేరకు పనిచేస్తాయో పరీక్షించాలి.