శబరిమలలో అరవణ ప్రసాదంపై ఆంక్షలు.. ఒక్కరికి రెండే డబ్బాలు!

Sabarimala: శబరిమల అయ్యప్పస్వామి అరవణ ప్రసాదంపై ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు పరిమితి విధించింది. ప్రసాదం డబ్బాల కొరత నేపథ్యంలో ఒక్కో భక్తుడికి రెండు డబ్బాలు మాత్రమే అందిస్తామని పేర్కొంది.

Courtesy: Facebook

Share:

శబరిమల అయ్యప్పస్వామి అరవణ ప్రసాదంపై ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు పరిమితి విధించింది. ప్రసాదం డబ్బాల కొరత నేపథ్యంలో ఒక్కో భక్తుడికి రెండు డబ్బాలు మాత్రమే అందిస్తామని పేర్కొంది. కొద్ది రోజుల నుంచి ప్రసాదం కొరత కారణంగా ఒక్కో భక్తుడికి 10 టిన్​లు మాత్రమే అందించేది దేవస్థానం. అయితే మకరజ్యోతి దర్శనానికి ఎక్కువ మంది భక్తులు రానున్న నేపథ్యంలో అరవణ ప్రసాదంపై పరిమితులు విధించింది దేవస్థానం బోర్డు.

 బోర్డు నిర్ణయం పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది. శబరిమలలో అయ్యప్ప ప్రసాదానికి ఎలాంటి కొరత లేదు కానీ  ఆ ప్రసాదాన్ని నింపే డబ్బాల విషయంలో కొరత ఏర్పడినట్లు సమాచారం. దీంతో ఒక భక్తుడికి కేవలం 2 టిన్నులే అందిస్తామని దేవస్థానం బోర్డు పేర్కొంది. త్వరలోనే అరవణ ప్రసాదం డబ్బాల సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తున్నామని దేవస్థానం అధికారులు తెలిపారు. అంతకుముందు పది టిన్నులు మాత్రమే అందించింది. శబరిమలకు  వచ్చే భక్తుల సంఖ్య  క్రమక్రమంగా పెరగడం, మకరజ్యోతి దర్శనానికి ఎక్కువ మంది భక్తులు రానున్న నేపథ్యంలో అరవణ ప్రసాదంపై దేవస్థానం బోర్డు పరిమితులు విధించింది. ఈ నిర్ణయంతో పొరగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. శబరిమలకు వచ్చే అయ్యప్ప భక్తులకు కచ్చితంగా రెండు టిన్నులు సరిపోవు.. ఒకదాన్ని అక్కడే తింటారు. మరోకటి ఇంటికి తీసుకువెళ్తారు. బంధువులు, చుట్టుపక్కల వారికి ఇవ్వడానికి  కష్టం అవుతుంది.  

శబరిమలకు ఈ ఏడాది భక్తుల తాకిడి బాగా పెరిగింది. సంక్రాంతి మకరజ్యోతి వరకు ఆ సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. దీంతో డబ్బాల వాడకం పెరిగింది. ఈ క్రమంలో అందిరికీ ప్రసాదం అందేలా దేవస్థానం బోర్డు ఒక్కో భక్తుడికి రెండు డబ్బాలు మాత్రమే అందించాలని నిర్ణయించింది. గతేడాది 26వ తేదీన 2 కొత్త కంపెనీలకు ప్రసాదం డబ్బాల కాంట్రాక్ట్​ను ఇచ్చింది దేవస్థానం బోర్డు. అయితే అంత మొత్తంలో కంపెనీలో అరవణ ప్రసాదం డబ్బాలను అందించలేకపోయాయి. ఇది డబ్బాల కొరత ఏర్పడటానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. మరోవైపు మకరజ్యోతి ఉత్సవాల్లో భాగంగా జనవరి 13న ప్రసాద శుద్ ధక్రియ, 14న బింబ శుద్ధ క్రియలను నిర్వహించనున్నట్లు కొద్ది రోజుల క్రితం ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు తెలిపింది. 15న మకరజ్యోతి వేడుకను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. భక్తుల కోసం జనవరి 20వ తేదీ వరకు ఆలయం తెరిచే ఉంటుందని పేర్కొంది. అదే రోజున సన్నిధానంలో స్వామివారికి తిరువాభరణం, దీపారాధన ఉంటాయని తెలిపింది. జనవరి 20న పూజల అనంతరం దేవాలయాన్ని మూసివేయనున్నట్లు వెల్లడించింది.

మకరజ్యోతి ఉత్సవాలకు విచ్చేసిన భక్తులకు తగిన ఏర్పాట్లు చేసేందుకు 1800 మంది పోలీసులు బాధ్యతలు స్వీకరించారు. ఇందులో సీనియర్​ అధికారులు ఉన్నారు. యాత్రికులతో పోలీసులు మంచిగా ప్రవర్తించాలని, అంకితభావంతో పనిచేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలని కన్నూరు రేంజ్ డీఐజీ థామ్సన్ జోస్ ఆదేశించారు.