Undavalli: స్కిల్ కేసుపై ఉండ‌వ‌ల్లి వేసిన పిటిష‌న్ వాద‌న‌లు విన్న హైకోర్టు

Undavalli Arun Kumar: స్కిల్ డెవలప్‌మెంట్ కేసు( (Skill Development Case))లో విచారణను సీబీఐ(CBI)కు ఇవ్వాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత

Courtesy: twitter

Share:

Undavalli Arun Kumar: స్కిల్ డెవలప్‌మెంట్ కేసు( (Skill Development Case))లో విచారణను సీబీఐ(CBI)కు ఇవ్వాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్(Undavalli Arun Kumar) వేసిన పిటీషన్‌(Petition)పై విచారణను హైకోర్టు(High Court) వాయిదా వేసింది. ఉండవల్లి పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ పిటిషన్‌పై విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది. ఈ కేసులో ప్రతివాదులకు గతంలో నోటీసులు జారీ చేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసింది.

 

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో (Skill Development Case) విచారణను సీబీఐకు (CBI) ఇవ్వాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arun Kumar) వేసిన పిటీషన్‌పై విచారణను హైకోర్టు (AP High Court) వాయిదా వేసింది. ఉండవల్లి పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ పిటిషన్‌(Petition)పై విచారణను ధర్మాసనం ఈనెల 29కి వాయిదా వేసింది. ఈ కేసులో ప్రతి వాదులకు గతంలో నోటీసులు జారీ చేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై న్యాయవాదులు కోర్టు ముందు ప్రస్తావిస్తూ... ఈ నోటీసులు అందరికీ అందలేదని పేర్కొన్నారు. నోటీసులను అందరికీ అందకపోవడంతో కేసు విచారణను హైకోర్టు ఈ నెల 29కి వాయిదా వేసింది. ఆలస్యంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీకి న్యాయమూర్తి సూచించారు.

 

కాగా.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసును(Skill Development Case) సీబీఐ (CBI) విచారణకు ఇవ్వాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. రెండుమూడు రాష్ట్రాలకు విస్తరించి ఉండటంతో కేసును సీబీఐకి ఇవ్వాలని పిటిషన్‌లో(Petition) ఉండవల్లి కోరారు. ఆర్థిక పరమైన నేరం, జీఎస్టీ ఎగవేత ఉండటం, ఇప్పటికే ఈడీ(ED) కూడా విచారణ చేస్తుందని, అందువలనే సీబీఐ విచారణకు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసినట్లు ఉండవల్లి పేర్కొన్నారు. అయితే ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసును సీబీఐతో విచారణ చేయించాలంటున్న ఉండవల్లిపై టీడీపీ(TDP) నేతలు విమర్శలు చేస్తున్నారు. 

 

కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర సీఐడీ, ఏపీ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌, గంటా సుబ్బారావు, కె.లక్ష్మీనారాయణ, నిమ్మగడ్డ వెంకటకృష్ణ ప్రసాద్‌, డిజైన్‌టెక్‌ సంస్థ, ఆ సంస్థ ఎండీ వికాస్‌ ఖన్వేల్కర్‌, స్కిల్లర్‌ ఎంటర్‌ ప్రైజెస్‌, సీమెన్స్‌ మాజీ ఎండీ సుమన్‌ బోస్‌, మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సహా 44మందిని తన పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చారు.

 

ఈ కేసులో ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్(AG Sriram) వాదనలు వినిపించారు. ఇప్పటికే ఈ కేసు విచారణ ప్రత్యేక విచారణ టీంను ఏర్పాటు చేసామని ఏజీ కోర్టుకు నివేదించారు.ఈ కేసుకు సంబంధించి సీబీఐకు కూడా ప్రభుత్వం సమాచారం ఇచ్చిందని ఏజీ కోర్టుకు వివరించారు. స్కిల్‌ కేసు సీబీఐ విచారణకు ఇవ్వడానికి తమకు అభ్యంతర లేదని ఏజీ శ్రీరామ్‌ కోర్టుకు తెలిపారు. సీబీఐకి ఇవ్వాలని నాలుగేళ్ల క్రితమే తమ వైఖరి స్పష్టం చేసామని వెల్లడించారు. 

కోర్టు తీర్పుపై ఉత్కంఠ

ప్రస్తుతం సీఐడీ(CID) చేస్తున్న ఈ విచారణ విషయంలో కోర్టు తీసుకొనే నిర్ణయం కీలకం కానుంది. ఏపీ ప్రభుత్వం సైతం ఈ కేసును సీబీఐకు(CBI) ఇవ్వటం తమకు అభ్యంతరం లేదని చెప్పటంతో... నోటీసులకు 44 మంది సమాధానాలు కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. అటు స్కిల్ కేసులో చంద్రబాబు రిమాండ్ రిపోర్టు..అరెస్ట్..17ఏ పైన సుప్రీంలో క్వాష్ పిటీషన్(Quash Petition) విచారణ సాగుతోంది. ఇప్పటికే దీని పై సుప్రీంలో వాదనలు పూర్తయ్యాయి. దీపావళి సెలవుల తరువాత తీర్పు వెల్లడిస్తామని కోర్టు స్పష్టం చేసింది. చంద్రబాబు ఆరోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ పైన బయటకు వచ్చారు. ఇటు హైకోర్టులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన పిటీషన్ లో నోటీసులు జారీ కావటంతో..స్కిల్ కేసులో రానున్న రోజుల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే ఉత్కంఠ కొనసాగుతోంది.