Uttar Pradesh: మహ్మద్ ప్రవక్తను అవమానించాడని కండక్టర్‌పై దాడి..

ఎన్‌కౌంటర్ చేసి నిందితుడి అరెస్ట్..

Courtesy: Twitter

Share:

Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. మహ్మద్ ప్రవక్తను (Muhammad prophet) అవమానించడనే ఆరోపణలో ఓ వ్యక్తి బస్సు కండక్టర్‌పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. పదునైన ఆయుధంతో పొడిచాడు. ప్రస్తుతం కండక్టర్‌ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన ప్రయాగ్‌రాజ్‌లో(Prayagraj) జరిగింది. 20 ఏళ్ల యువకుడికి, కండక్టర్‌కి బస్సు టికెట్ ఛార్జీపై(Bus ticket charge) వివాదం మొదలైంది. ఆ తర్వాత అతనిని పొడిచాడు. ప్రవక్త గురించి అవమానకరంగా మాట్లాడినందుకే కండక్టర్‌పై దాడి చేసినట్లు నిందితుడు ఓ వీడియోలో తన నేరాన్ని అంగీకరించాడు.

పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నిందితుడు ప్రయత్నించడంతో ఎన్‌కౌంటర్ (Encounter) చేసి పట్టుకున్నారు. పారిపోతున్న క్రమంలో కాలిపై తుపాకీతో కాల్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం నిందితుడు లారెబ్ హష్మీ(Loreb Hashmi)(20) అనే వ్యక్తి కండక్టర్ హరికేష్ విశ్వకర్మ(24)తో(Vishwakarma) టికెట్ ధరపై గొడవ పెట్టుకున్నాడు. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న హష్మీ, విశ్వకర్మపై పదునైన కత్తితో దాడి చేశాడు. అతని మెడ, ఇతర శరీర భాగాలకు గాయాలయ్యాయి. ఘటన అనంతరం హష్మీ బస్సు నుంచి పారిపోయి కాలేజీ క్యాంపస్‌లోకి ప్రవేశించి దాక్కున్నారు. కాలేజీలో ఉన్న సమయంలోనే నేరాన్ని అంగీకరిస్తూ, బస్ కండక్టర్(Bus conductor) దైవదూషణకు(Blasphemy) పాల్పడ్డట్లు ఆరోపించాడు, అందుకు దాడి చేశానని వెల్లడించాడు. ఈ వీడియోలో నిందితుడు ప్రధాని మోడీ(PM Modi), సీఎం యోగిల(CM Yogi) పేర్లను కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. బస్సు లోపల శబ్ధం విని బస్సు నిలిపేసినట్లు బస్సు డ్రైవర్ మంగ్లా యాదవ్(Mangla Yadav) తెలిపారు.

తరువాత, 20 ఏళ్ల యువకుడు ఒక వీడియోను పంచుకున్నాడు, అందులో అతను తన హేయమైన చర్యను సమర్థించుకున్నాడు. "(బస్సు కండక్టర్) ముస్లింలను దుర్భాషలాడుతున్నాడు. అందుకే అతనిపై క్లీవర్‌తో దాడి చేశాను. అతడు బతకలేడు. త్వరలో చనిపోతాడు. భారత్ నుండి ఫ్రాన్స్ వరకు మన ప్రవక్తను (Mahmad pravakta) ఎవరు అవమానించినా అంతమొందిస్తారు" అని హష్మీ (Loreb Hashmi) చెప్పడం క్లిప్‌లో ఉంది. "ముహమ్మద్ ప్రవక్త(Mahmad pravakta) , మేము మీ కోసం చనిపోవడానికి మరియు జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రియమైన ముస్లింలారా, ఈ ప్రపంచ భౌతికవాదం గురించి ఎదగండి మరియు ప్రవక్త కోసం మీ జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండండి" అని లారెబ్ హష్మీ జోడించారు. ఇస్లాం మత విశ్వాసాలు కలిగిన వ్యక్తి "అల్లాహు అక్బర్" అని ప్రకటించాడు.

మహ్మద్ ప్రవక్త (Muhammad prophet) ధర్మం కోసం అన్యాయాలను, ఆక్రమాలను నిరసించారు. పాలితులు ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలని, జనమంతా సుఖసంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. మహమ్మద్ ప్రవక్త మరణానంతరం హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ , హజ్రత్ అలీ, హజ్రత్ ఉమర్ సైతం సుపరిపాలన అందించారని మరియు హిందూ బస్సు కండక్టర్‌(Bus conductor)పై జరిగిన దుర్మార్గపు దాడిని హేతుబద్ధం చేస్తూ "లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్" అని పఠించాడు.

ఈ ఘటన తర్వాత హష్మీ(Loren Hashmi) కాలేజీలో దాక్కున్నట్లు ప్రయాగ్‌రాజ్ పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు అతనిని తీసుకెళ్లినప్పుడు, అతను వారిపై కాల్పులు జరిపినట్లు సమాచారం. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో కాలికి గాయమైంది. హష్మీని వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని.. అతను ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతన్ని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ప్రయాగ్‌రాజ్‌(Prayagraj)లోని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అభినవ్ త్యాగి(Abhinav Tyagi), యునైటెడ్ ఇంజినీరింగ్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న హష్మీ ఈ సంఘటనలో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. అతని తండ్రి మహమ్మద్ యూనస్ ప్రయాగ్‌రాజ్‌లో పౌల్ట్రీ ఫారమ్ నడుపుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.