Murder: మ్యాచ్ కోసం కొడుకుని హత్య చేసిన తండ్రి

అసలు ఏం జరిగిందంటే..

Courtesy: Twitter

Share:

Murder: ప్రతి ఒక్క దేశం తమ దేశం వరల్డ్ కప్ (World Cup) లో గెలుపొంది తీరాలని ఆత్రుతగా ఎదురు చూసినప్పటికీ చివరికి ఆస్ట్రేలియా వరల్డ్ కప్ (World Cup) సాధించుకుంది. ఈ మ్యాచ్ చూడాలని చాలామంది లక్షలు ఖర్చు పెట్టి మరి టిక్కెట్లు హోటల్స్ బుక్ చేసుకున్నారు. మరికొందరు ఇళ్లలోనే ఉండి ఆసక్తిగా వరల్డ్ కప్ (World Cup) టీవీ (TV)లోనే చూశారు. అయితే వరల్డ్ కప్ (World Cup) మ్యాచ్ అనేది అన్ని దేశాలు కలిసికట్టుగా ఆడుకునే మ్యాచ్. ఈ రకంగా ప్రతి ఒక్క దేశం క్రికెట్ (Cricket) ఆటపరంగా ఒకటి అవుతాయి అనే ఉద్దేశం. కానీ క్రికెట్ (Cricket) చూస్తున్న కొంతమంది మాత్రం తమ సొంత వాళ్ళని దూరం చేసుకున్నారు. అనుకోని సంఘటన వల్ల మ్యాచ్ చూసినప్పుడు అంతరాయం వచ్చిందని సొంత వాళ్ళని కడతేర్చారు. ఇలాంటి ఒక సంఘటన ఖాన్ పూర్ లో చోటు చేసుకుంది. వరల్డ్ కప్ (World Cup) చూస్తున్నప్పుడు టీవీ (TV) కట్టేసాడు అని కన్న కొడుకుని హత్య (Murder) చేశాడు తండ్రి.

అసలేం జరిగింది: 

ఖాన్ పూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న గణేష్ అనే వ్యక్తి వరల్డ్ కప్ (World Cup) చివరి మ్యాచ్ ఆసక్తిగా టీవీ (TV)లో చూస్తూ ఉన్నాడు. అదే సమయంలో దీపక్ అనే అతని కొడుకు టీవీ (TV) చూడటం మానేసి ముందు వెళ్లి వంట చేయమని అడగడం జరిగింది. కానీ అప్పటికే మద్యం మత్తులో ఉన్న గణేష్, దీపక్ మాటలు వినిపించుకోకుండా టీవీ (TV) చూస్తూ ఉంటాడు. ఎంత పిలిచినా, టీవీ (TV) ముందు నుంచి లేచి వంట చేయట్లేదని గణేష్ మీద కోపంతో టీవీ (TV) కట్టేస్తాడు దీపక్. చాలా ఆత్రుతగా వరల్డ్ కప్ (World Cup) తిలకిస్తున్న తండ్రి గణేష్ కోపంతో ఉన్నాడు అందులోకి మద్యం మత్తులో ఉన్నాడు. అయితే టీవీ (TV) కట్టేసినందుకు దీపక్ ను మందలించాడు గణేష్, దీపక్ కూడా తన తండ్రి గణేష్ తో వాగ్వాదానికి దిగాడు. ఈ గొడవలోనే అనుకోకుండా మద్యం మత్తులో ఉన్న గణేష్ తీవ్రమైన కోపంతో అక్కడే ఉన్న మొబైల్ చార్జర్ తో, దీపక్ పీక నులిమి చంపేశాడు (Murder). అక్కడికక్కడే మృతి చెందాడు. 

 

గణేష్ వాళ్ళ ఇంటికి వెళ్లిన తమ చుట్టాలు, గణేష్ కొడుకు దీపక్ ఉలుకు పలుకు లేకుండా మెట్ల మీద పడి ఉండడం చూసినట్లు, అనుమానంతో దగ్గరికి వెళ్లి చూసేసరికి దీపక్ మృతి చెందినట్లు పోలీసులు దర్యాప్తులో వెళ్లడానికి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మొత్తం తెలుసుకుని, వరల్డ్ కప్ (World Cup) చూస్తున్న సమయంలో దీపక్ అదే విధంగా తన తండ్రి గణేష్ మధ్య తీవ్రమైన గొడవ కారణంగానే, తండ్రి గణేష్ మొబైల్ చార్జర్ ఉపయోగించి దీపక్ ను చంపేశాడని వెల్లడించారు. ప్రస్తుతం నిందితుడు గణేష్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే ఇలాగే ఇంతకుముందు కూడా గొడవలు జరుగుతూ ఉండేవని, మద్యం మత్తులో తండ్రి కొడుకులు గొడవ పడుతూ ఉండేవారని, ఈ గొడవల కారణంగానే గణేష్ భార్య వారం రోజులు క్రిందటే పుట్టింటికి వెళ్ళిపోయినట్లు కూడా పోలీసులు వెల్లడించారు.

 

ఏది ఏమైనప్పటికీ ప్రతి ఒక్క విషయం కూడా ఆచితూచి ఆలోచించి అడుగు వేయాల్సి ఉంటుంది. ఆలోచనలు లేకుండా విచక్షణ రహితంగా ప్రవర్తించిన కారణంగా చాలామంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ఇప్పుడు మద్యం మత్తులో దీపక్ గణేష్ మధ్య జరిగిన వాగ్వాదం, ఒక నిండు ప్రాణాన్ని బలికొంది. మనం ఏం చేస్తున్నా అనే విషయం మర్చిపోయి ప్రవర్తిస్తే మన సొంత వాళ్లు కూడా మనకి దూరం అవుతారు. హత్య (Murder)లు, కుతంత్రాలు, కుట్రలు ఇవన్నీ మనిషిని తమ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. మనం ఎప్పుడు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా.. మన వల్ల ఎదుటి వారికి హాని కలగకూడదు. ఏది ఆలోచించకుండా వ్యవహరించకూడదు. ముఖ్యంగా హత్య (Murder)లు చేసే ముందు మనుషులం అని గుర్తుంచుకోవాలి. మనలాగే వారికి కూడా ప్రాణం ఉంటుందని గమనించాలి. లేదంటే, హత్య (Murder) కు గురైన వ్యక్తే కాకుండా.. చంపిన వ్యక్తి కుటుంబం కూడా జీవితాంతం బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.