Tunnel: నిలిచిపోయిన టన్నెల్ ఆపరేషన్

వారమైనా కార్మికులు లోపలే

Courtesy: Twitter

Share:

Tunnel: దేవ భూమిగా అందరూ వ్యవహరించే ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రంలోని ఉత్తర కాశీలో ఘోరం జరిగి నిర్మాణంలో ఉన్న ఓ సొరంగం (టన్నెల్) (Tunnel) కూలిపోయిన (Collapse) విషయం తెలిసిందే. ఈ విషయం తెలియగానే ప్రభుత్వం (Government) హుటాహుటిన స్పందించి అక్కడ సహాయక చర్యలకు ఆదేశించింది. కానీ అక్కడ సహాయక చర్యలు (Help) మాత్రం ఆశించినంత వేగంగా జరగడం లేదు. దీంతో ప్రభుత్వంతో పాటు సామాన్య ప్రజలు (Common People) కూడా పెదవి విరుస్తున్నారు. అక్కడ సహాయక చర్యలు అంత స్లోగా జరిగేందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఒక్క రీజన్ అని కాకుండా అనేక రీజన్స్  (Reasons) సహాయక చర్యలకు విఘాతం కలిగిస్తున్నాయి. 

 

వారమైనా కార్మికులు లోపలే.. 

ఈ సొరంగం (Tunnel) 12 నవంబర్ రాత్రి కూలిపోయింది. అంటే మళ్లీ శుక్రవారం (Friday) కూడా పూర్తైంది.వారం రోజుల నుంచి కార్మికులు (Labour) లోపలే ఉన్నారు. వారికి కావాల్సిన పదార్థాలు అందిస్తున్నా వారు వారం నుంచి బిక్కుబిక్కుమంటూ లోపలే గడుపుతున్నారని వారి బంధువులు (Relations), ఆత్మీయులతో పాటు అనేక మంది సాధారణ జనం కూడా ఫీలవుతున్నారు (Feel). కొత్త డ్రిల్లింగ్ మెషీన్ ను తీసుకొచ్చి శిథిలాలను తొలగించేందుకు రెస్క్యూ (Rescue) టీం ప్రయత్నాలు చేపట్టింది. కానీ ఆ ప్రయత్నాలు కూడా మధ్యలోనే ఆగిపోయాయి. రెస్క్యూ మరియు రిలీఫ్ (Relief) ఆపరేషన్లు శనివారం ఏడవ రోజుకి ప్రవేశించాయి. సొరంగంలో(Tunnel) చిక్కుకున్న కార్మికుల సంఖ్య 41కి చేరుకుందని ఎన్‌హెచ్ఐడీసీఎల్ డైరెక్టర్ పేర్కొన్నారు. గతంలో పేర్కొన్న జాబితా ప్రకారం 40 మంది కార్మికులే సొరంగంలో (Tunnel) చిక్కుకున్నారని అంచనా వేశారు. కానీ తాజాగా 41వ వ్యక్తి కూడా సొరంగంలో ఉన్నట్లు గుర్తించారు. 

 

41వ వ్యక్తిగా దీపక్ కుమార్

ఈ సొరంగం (Tunnel) ప్రమాదంలో అందులో 40 మంది కార్మికులు చిక్కుకున్నారని మొదట అంచనా వేశారు. కానీ తాజాగా 41వ కార్మికుడు కూడా అందులో ఉన్నట్లు ప్రకటించారు. బీహార్‌ (Bihar) కు చెందిన ముజఫర్‌ పూర్ జిల్లా వాసి అయిన దీపక్ కుమార్ ను లోపల చిక్కుకున్న 41వ వ్యక్తిగా గుర్తించారు. రెస్క్యూ ఆపరేషన్‌ (Rescue Operation) ను సమీక్షించేందుకు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) (PMO) బృందం కూడా ఘటనాస్థలికి చేరుకుంది. వారు అక్కడే ఉండి ఎప్పటికప్పుడు వివరాలను సేకరిస్తున్నారు. అంతే కాకుండా సహాయక చర్యలు త్వరగా పూర్తయేందుకు తగు సలహాలు (Suggestions) ఇస్తున్నారు. 

అందుకే ఆపరేషన్ నిలిచిపోయింది.. 

రెస్క్యూ ఆపరేషన్ ఎందుకు నిలిచిపోయిందని అంతా ఆలోచిస్తున్నారు. అసలు రెస్క్యూ ఆపరేషన్ నిలపాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు (Question). మెషీన్‌ (Machine) లో లోపం కారణంగానే రెస్క్యూ ఆపరేషన్‌ నిలిచిపోయింది. శుక్రవారం మధ్యాహ్నం 2.45 గంటలకు, ఐదవ పైపును అమర్చే సమయంలో, సొరంగంలో పెద్దగా పగుళ్లు వచ్చిన శబ్దం వినిపించి.. ఆ తర్వాత రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేయబడిందని అధికారులు పేర్కొన్నారు. ఆ శబ్దం (Sound) రెస్క్యూ టీమ్‌ లో భయాందోళనను కలగజేసింది. ప్రాజెక్ట్‌ తో సంబంధం ఉన్న నిపుణుడు సమీపంలో మరింత కూలిపోయే అవకాశం ఉందని హెచ్చరించడంతో పైపులు నెట్టడం ఆపివేసి.. రెస్క్యూ ఆపరేషన్ ను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి (CM) పుష్కర్ సింగ్ ధామి డెహ్రాడూన్‌ లోని తన అధికారిక నివాసంలో అధికారులతో సమావేశమై సిల్క్యారాలోని సొరంగం వద్ద రెస్క్యూ ఆపరేషన్‌ ల గురించి సమాచారం తెలుసుకున్నారు. అత్యాధునిక యంత్రాలు రెస్క్యూ ఆపరేషన్స్‌ లో విజయవంతమవుతాయని ఆశిస్తున్నట్లు ధామి తెలిపారు. ప్రధాని కార్యాలయం మార్గదర్శకత్వంలో, సొరంగం ప్రాంతాలలో చిక్కుకున్న కార్మికులను తరలించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలను చేస్తోందని ఆయన వెల్లడించారు.  మేము త్వరలో మిషన్‌ లో విజయం సాధిస్తామని ఆశిస్తున్నట్లు తెలిపారు. 

డ్రిల్ చేసింది అంతే.. 

ఇప్పటి వరకు దాదాపు వారం (Week) రోజులు పూర్తయింది. ఈ వారంలో ఎంత మేర డ్రిల్ చేశారని చాలా మందికి అనుమానాలు రెయిజ్ (Raise) అవుతున్నాయి. అసలు రెస్క్యూ ఆపరేషన్ ఎంత స్పీడ్ తో జరుగుతోందని అంతా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు, రెస్క్యూ వర్కర్లు 24 మీటర్ల వరకు శిథిలాల ద్వారా డ్రిల్ చేయగలిగారు. కార్మికులు తప్పించుకోవడానికి 60 మీటర్లు (195 అడుగులు) వరకు అవసరం కావచ్చు. చిక్కుకున్న కార్మికులందరూ ఇప్పటివరకు శారీరకంగా మరియు మానసికంగా దృఢంగా ఉన్నారని అక్కడి రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్న అధికారులు తెలిపారు. చిక్కుకున్న కార్మికులకు ఆక్సిజన్ (Oxygen), మందులు, ఆహారం మరియు నీరు వంటి అవసరమైన సామగ్రి చేరేలా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. ప్రజల మనోధైర్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని.. చిక్కుకుపోయిన కార్మికుల మానసిక స్థితి బాగానే ఉందని ఎన్‌హెచ్ఐడీఎల్ డైరెక్టర్ అన్షు మనీష్ ఖల్ఖో పేర్కొన్నారు. మానసిక నిపుణులు చిక్కుకున్న పోయిన కార్మికులతో మాట్లాడుతున్నారని తెలిపారు. ఆ కార్మికులు (Labours) మానసికంగా చాలా ధృడంగా ఉన్నారని అతడు పేర్కొన్నాడు. 

కుటుంబీకులతో మాట్లాడుతున్న కార్మికులు

శిథిలాల్లో చిక్కుకుపోయిన కార్మికులు దాదాపు వారం నుంచి లోపలే ఉంటున్నారు. వారు కుటుంబీకులతో (Family Members) కూడా మాట్లాడుతున్నట్లు అధికారులు తెలిపారు. చిక్కుకున్న కార్మికులలో ఉన్న వారి బంధువులతో మాట్లాడేందుకు ఉత్తరప్రదేశ్‌ కు చెందిన ఇద్దరు వ్యక్తులు అనుమతించబడ్డారు. ఒడిశా ప్రభుత్వ కార్మిక శాఖ అధికారి కూడా చిక్కుకున్న రాష్ట్ర కార్మికులతో మాట్లాడారు. అక్కడ చిక్కుకున్న 40 మంది కార్మికుల్లో ఒడిశాకు చెందిన ఐదుగురు కూలీలు ఉన్నారు. నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిపోయిన భాగంలో చిక్కుకున్న 40 మంది కార్మికులలో రాష్ట్రానికి చెందిన కార్మికుల శ్రేయస్సు గురించి ఆరా తీయడానికి జార్ఖండ్ (Jharkhand) ప్రభుత్వం సిల్క్యారాకు అధికారుల బృందాన్ని కూడా పంపింది. అంతకుముందు రెస్క్యూ టీమ్ శుక్రవారం రాత్రికి డ్రిల్లింగ్‌ ను పూర్తి చేసి, వెల్డింగ్ చేయబడిన పైపుల (Pipes) ఎస్కేప్ టన్నెల్‌ ను రూపొందించాలని భావించింది. కానీ వారు అనుకున్నవాటికి అడ్డంకులు వచ్చాయి. అనేక కారణాల వల్ల అనుకున్న దాని కంటే రెస్క్యూ ఆపరేషన్ చాలా నెమ్మది గా (Slow) కొనసాగుతోంది.