Uttarakhand: కార్మికుల ప్రాణాలకోసం కొనసాగుతున్నసెర్చ్ ఆపరేషన్..

థాయ్ ఏజెన్సీతో సంప్రదింపులు...

Courtesy: Twitter

Share:

Uttarakhand: ఉత్తరాఖండ్‌(Uttarakhand) లోని ఉత్తర కాశీ(Uttarkashi)లో టన్నెల్‌లో(Tunnel) చిక్కుకున్న కార్మికులను కాపాడడానికి సహాయక చర్యలు మరింత వేగవంతమయ్యాయి. నాలుగో రోజు విదేశాల నుంచి తెప్పించిన యంత్రాలతో సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. 

ఉత్తర కాశీలో(Uttarkashi) సహాయక చర్యల కోసం విదేశీ నిపుణుల సాయాన్ని కూడా అధికారులు తీసుకుంటున్నారు. సొరంగం నుంచి కార్మికులను ఎలా సురక్షితంగా రక్షించాలనే దానిపై, థాయ్‌లాండ్(Thailand), నార్వే(Norway) నుండి ప్రత్యేక రెస్క్యూ బృందాలను(Rescue teams) కూడా సంప్రదించారు.

టన్నెల్‌లో(Tunnel)  ఇంకా 40 మంది కార్మికులు చిక్కుకుపోయారు. నాలుగు రోజులు గడిచినా సహాయక చర్యలకు సాంకేతిక సమస్యల కారణంగా(Technical issues)  అంతరాయం ఏర్పడుతోంది. చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు భారత వైమానిక దళం(Air force) మూడు ప్రత్యేక విమానాల్లో 25 టన్నుల పైపులను పంపుతోంది. మరో వైపు సొరంగం నుంచి కార్మికులను ఎలా సురక్షితంగా రక్షించాలనే దానిపై, థాయ్‌లాండ్, నార్వే నుండి ప్రత్యేక రెస్క్యూ బృందాలను కూడా సంప్రదించారు.

 2018లో థాయ్‌లాండ్‌లోని(Thailand) గుహలో చిక్కుకున్న చిన్నారులను రక్షించేందుకు సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్‌(Rescue operation) చేపట్టిన సంస్థను కూడా సంప్రదించినట్లు తెలుస్తోంది. దాదాపు 10,000 మంది కార్మికులు వారం రోజుల రెస్క్యూ ఆపరేషన్ (Rescue operation) తర్వాత జూనియర్ అసోసియేషన్ ఫుట్‌బాల్ జట్టును రక్షించారు.  ఈ థాయ్ రెస్క్యూ ఆపరేషన్ బృందం(Thai rescue operation team) అనుభవాన్ని ఉపయోగించి ఉత్తరకాశీలో(Uttarkashi) కూలిపోయిన నిర్మాణ సొరంగం నుండి చిక్కుకున్న 40 మంది కార్మికులను ఎలా రక్షించాలనే దానిపై సహాయం కోరింది.

మరోవైపు వాయుసేన ప్రత్యేక విమానంలో ఢిల్లీ(Delhi) నుంచి ప్రత్యేక యంత్రాలను తెప్పిస్తున్నారు. ఈ యంత్రం ఒక గంటలో 4-5 మీటర్ల వరకు రాళ్లను తవ్వగలదు. ఉత్తరకాశీ సొరంగంలో ఈ యంత్రాన్ని ఉపయోగించగలిగితే.. అక్కడ నుండి 90 మిమీ పెద్ద పైపును అమర్చవచ్చు.. దీని ద్వారా కార్మికులు సురక్షితంగా బయటకు రావచ్చు. గురువారం నుంచి ఈ యంత్రాన్ని వినియోగించే అవకాశం ఉంది.

సొరంగం లోపల రెస్క్యూ ఆపరేషన్లలో(Rescue operation) సహాయం చేయవలసిందిగా జియోటెక్నికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నార్వేని(Geotechnical Institute of Norway) కూడా కోరింది. భారతీయ రైల్వేలతో పాటు, రైల్ బికాష్ నిగమ్(Rail Vikas Nigam), రైల్ ఇండియా టెక్నికల్‌తో(Rail India Technical) సహా పలు కేంద్ర ఏజెన్సీల నిపుణుల నుండి కూడా సలహాలను తీసుకుంటుంది.

ఇప్పటి వరకు చిక్కుకున్న కార్మికులు క్షేమంగా ఉన్నారని అధికారులు చెప్పారు. వీరికి పైపుల ద్వారా ఆహారం, నీరు(Water), ఆక్సిజన్‌(Oxygen) ​​అందిస్తున్నారు. రెస్క్యూ టీమ్(Rescue Team).. కార్మికుల కుటుంబ సభ్యుల్లో మనోధైర్యాన్నికలిగించేలా వీరితో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. ప్రస్తుతానికి ఉత్తరకాశీ సొరంగంలోని కార్మికులు తమ ప్రాణాల కోసం కాలంతో పోరాటం చేస్తున్నారు.

ఉత్తరఖండ్‌లోని(Uttarakhand) ఉత్తరకాశీలో (Uttarkashi) స్వల్పంగా భూమి కంపించింది. గురువారం తెల్లవారుజామున 2.02 గంటలకు ఉత్తరకాశీలో భూకంపం (Earthquake) వచ్చింది. దీని తీవ్రత 3.1గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (NCS) తెలిపింది. భూఅంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని పేర్కొంది. భూకంప కేంద్రం రాజధాని డెహ్రూడూన్‌కు(Dehradun) 140 కిలో మీటర్ల దూరంలో ఉన్నదని వెల్లడించింది. కాగా, అర్ధరాత్రివేళ భూమి కంపించడంతో ప్రజలు ఇండ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. అయితే ఈ భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియ రాలేదని అధికారులు వెల్లడించారు.

ఉత్తరకాశీలో(Uttarkashi) గత 15 రోజుల్లో భూకంపం రావడం ఇది మూడో సారి. ఈ నెల 3న అర్ధరాత్రివేల భూ ప్రకంపణలు వచ్చాయి. అయితే అప్పుడు భూకంప కేంద్రం నేపాల్‌(Nepal) ఉన్నది. ఇక నవంబర్‌ 5న 3.2 తీవ్రతో భూమి కంపించింది. యమునా నది(Yamuna River) లోయ ప్రాంతాల్లో ప్రకంపణలు ఎక్కువగా వచ్చాయి. నాలుగు రోజులుగా సొరంగంలో చిక్కుకున్న కార్మికుల పరిస్థితిపై ఆందోళనల మధ్య, అందరూ క్షేమంగా ఉన్నారని నేషనల్ హైవేస్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHIDCL) గిర్ధారిలాల్(Girdharilal) తెలిపారు.