కాళేశ్వరంపై కాంగ్రెస్ సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదు: బండి సంజయ్

MP Bandi sanjay: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో రూ.లక్ష కోట్ల అవినతీతి జరిగిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్, దానిపై సీబీఐ విచారణను ఎందుకు కోరడం లేదని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు.

Courtesy: Top Indian News

Share:

కరీంనగర్‌: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో రూ.లక్ష కోట్ల అవినతీతి జరిగిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్, దానిపై సీబీఐ విచారణను ఎందుకు కోరడం లేదని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కోరితే సీబీఐ విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని బండి సంజయ్ అన్నారు. రామమందిర నిర్మాణం భాజపా కార్యక్రమం కాదని.. దీన్ని రాజకీయం చేయడం కాంగ్రెస్‌కు తగదన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా బండి సంజయ్‌ కరీంనగర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో యువతను డ్రగ్స్‌, మద్యానికి బానిసలుగా చేస్తున్నారని భాజపా బండి సంజయ్‌  విమర్శించారు. మద్యం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.40వేల కోట్లు ఆర్జిస్తోందన్నారు. విద్యాసంస్థల అడ్డాగా మత్తుపదార్థాల దందా జరుగుతోందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో రూ.లక్ష కోట్ల అవినతీతి జరిగిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్, దానిపై సీబీఐ విచారణను ఎందుకు కోరడం లేదని విమర్శించారు.  రాష్ట్ర ప్రభుత్వం కోరితే సీబీఐ విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని బండి అన్నారు. కాంగ్రెస్‌ నేతల తీరు చూస్తుంటే భారాస నేతల అవినీతిని కప్పిపుచ్చేలా ఉంటోందని మండిపడ్డారు.  నేటి యువతని మద్యానికి, డ్రగ్స్‌కు కొన్ని పార్టీలు బానిసలు చేస్తున్నాయని, కాలేజీలను అడ్డాలుగా చేసుకుని డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు అంటూ సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 

అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సంలో పార్టీలతో సంబంధం లేకుండా అందరూ, ప్రతీ భారతీయుడు పాల్గొనాల్సిన చారిత్రక, ధార్మిక కార్యక్రమమిది అని సంజయ్ అన్నారు. అయోధ్య విషయంలో కాంగ్రెస్‌ ఇలా ఎందుకు వ్యవహరిస్తుందో తెలియడం లేదన్నారు. అయోధ్య రాముడు భారతీయ జనతా పార్టీకి మాత్రమే రాముడు కాదు, అందరివాడని, అయోధ్య రామమందిరాన్ని కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఎందుకు వ్యతిరేకిస్తుందో అర్థం కావడం లేదన్నారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రతి భారతీయుడూ పాల్గొనాల్సిన చారిత్రక, ధార్మిక కార్యక్రమం అది అని బండి సంజయ్ వెల్లడించారు.