Photo: సరదాగా బాయ్ ఫ్రెండ్ ఫోన్ చూసి షాక్ అయిన గర్ల్ ఫ్రెండ్

బయటపడిన నిజాలు..

Courtesy: Pexels

Share:

Photo: ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరిని బడితే వాళ్ళని నమ్మడం, వాళ్లతోనే కలిసి తిరగడం, వాళ్లతో కలిసి ఇష్టం వచ్చినట్లు ఫోటో (Photo)లు దిగడం తీరా వాళ్ళు బ్లాక్మెయిల్ (Blackmail) చేసేసరికి ఆత్మహత్య చేసుకునే ప్రాణాలు వినవడం చాలా మంది అమ్మాయిలు చేస్తున్న పొరపాటు. ఒక్కరోజు కలిసి తిరిగినంత మాత్రాన వాళ్లని నమ్మి మన గురించి చెప్పడం, మన కుటుంబ వివరాలు చెప్పడం వాళ్లతో కలిసి ప్రైవేటుగా ఫోటో (Photo)లు దిగడం అనేది అసలు మంచి పద్ధతి కాదని మరొక సంఘటనతో బయటపడింది. మరోవైపు మరి ముఖ్యంగా ఆడపిల్లలం ఫోటో (Photo)లు తీసి మార్ఫింగ్ చేయడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి డీప్ ఫేక్ ఫోటో (Photo)లకు సంబంధించిన వార్తలు వినబడుతున్నాయి.

షాక్ అయిన గర్ల్ ఫ్రెండ్:

బెంగళూరుకు చెందిన 22 ఏళ్ల తన్వి తన బాయ్ ఫ్రెండ్ ఫోన్ గ్యాలరీని తెరిచినప్పుడు, ఆమెతో సహా వివిధ మహిళల సుమారు 13,000 నగ్న ఫోటో (Photo)లు కనిపించేసరికి షాకుకు గురైంది. ఐదు నెలల క్రితం తను పనిచేస్తున్న బీపీఓ కంపెనీలో చేరిన తర్వాత 25 ఏళ్ల ఆదిత్య సంతోష్తో తన్వి పరిచయమైంది. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, వారు గత నాలుగు నెలలుగా రిలేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. సంతోష్ రికార్డ్ చేసిన కొన్ని సన్నిహిత క్షణాలను డిలీట్ చెయ్యాలనే ఉద్దేశంతో తన్వి అతనికి తెలియకుండానే సంతోష్ ఫోన్‌ (Phone)ని తెరిచింది.

అప్పుడే విస్తీపోయే నిజాలను తెలుసుకుంది తన్వి. ఆమె వెంటనే సంతోష్తో సంబంధాలను తెంచుకుంది. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తన ఇతర సహోద్యోగులను రక్షించేందుకు నవంబర్ 20 వారి కార్యాలయ సీనియర్లకు విషయాన్ని చెప్పడం జరిగింది. సంతోష్ ఫోన్‌ (Phone)లో 13,000 నగ్న చిత్రాలలో, కొన్ని వారి మహిళా సహోద్యోగులు కూడా ఉన్నారు. నివేదిక ప్రకారం, చాలా ఫోటో (Photo)లు మార్ఫింగ్ చేయబడ్డాయి అని తన్వి అనుమానించారు.

పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న అర్చన,బెల్లందూర్కు చెందిన BPO కంపెనీ నవంబర్ 23 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో సంతోష్పై అధికారికంగా ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులను ఆశ్రయించిన తన్వి అందించిన సమాచారం ప్రకారం కంపెనీలో పనిచేస్తున్న సంతోష్ని అరెస్టు చేయడం జరిగింది. ఇంకా అసలు ఫోటో (Photo)లకు సంబంధించిన మరింత సమాచారం అదేవిధంగా ఫోటో (Photo)లను ఉపయోగించి బ్లాక్మెయిల్ (Blackmail) చేయడానికి ట్రై చేశాడా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుందని పోలీసులు వెల్లడించారు.

డీప్ ఫేక్:

మరి ముఖ్యంగా సోషల్ మీడియా (Social Media) విస్తరిస్తున్న వేళ, ఫేక్ (Fake) తప్పుడు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో, పెద్ద సెలబ్రిటీల విషయంలో సోషల్ మీడియా (Social Media)లో తప్పుడు వార్తలు రావడం సహజంగా మారిపోయింది. ఇటీవల వైరల్ అయిన రష్మిక (Rashmika Mandanna) ఫేస్ ఉన్న, ఫేక్ (Fake) వీడియో (Video) సోషల్ మీడియా (Social Media)లో హల్చల్ చేసింది. మొన్నటికి మొన్న కాజోల్ ఫేక్ (Fake) ఫోటో (Photo) ఒకటి వైరల్ గా మారింది. ఆన్లైన్ ప్లాట్ఫారమ్లలో డీప్ఫేక్ ముప్పును పరిశీలించడానికి మరియు ఆన్లైన్లో ఫేక్ (Fake) కంటెంట్ను గుర్తించినప్పుడు, పౌరులు ఎఫ్ఐఆర్లను దాఖలు చేయడంలో వారికి సహాయపడటానికి ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమిస్తుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.

ఇంటర్నెట్లో డీప్ఫేక్ (Fake) వీడియోలు పెరిగిన సందర్భంలో నిర్ణయం బయటికి వచ్చింది. రష్మిక మందన్న, కత్రినా కైఫ్ మరియు కాజోల్తో సహా బాలీవుడ్ నటీనటుల డీప్ఫేక్ ఫేక్ (Fake) వీడియోల స్ట్రింగ్ గత నెలలో ఆన్లైన్లో వైరల్ అయ్యింది, ఇది తీవ్రమైన ఆందోళనలను రేకెత్తించింది.