Kerala: మాతృతనానికే మచ్చ తెచ్చిన తల్లి

దగ్గరుండి కూతుర్లను.. కామాంధుల చేతుల్లో పెట్టింది

Courtesy: Pexels

Share:

Kerala: ఇప్పుడున్న కాలంలో కొంతమంది తల్లి (Mother)దండ్రులు కూడా తమ పిల్లలను హింసకు గురి చేస్తూ తమ సంతోషాలకు అడ్డంగా ఉన్నారని పిల్లల్ని కూడా చంపడానికి ప్రయత్నిస్తున్న వైనం కనిపిస్తోంది. నిజానికి ఇలాంటి సంఘటనలు ఎక్కడో గాని చోటు చేసుకోవు. ఎందుకంటే తల్లి (Mother)తండ్రులకు బిడ్డలకు మధ్య మధ్య ఉండే బంధం చాలా గొప్పది. కానీ కొంతమంది రాక్షసుల కారణంగా మాతృతనానికి కూడా మచ్చ కలుగుతుంది. కేరళ (Kerala)లో జరిగిన ఒక సంఘటన ఒక మహిళకు 40 ఏళ్ల జైలు (Jail) శిక్ష (Sentence) పడేలా చేసింది. 

కామాంధుల చేతుల్లో పెట్టింది: 

కేరళ (Kerala)కు చెందిన ఒక మహిళకు 40 సంవత్సరాల జైలు (Jail) శిక్ష (Sentence) 20వేల రూపాయల పెనాల్టీ విధించింది కేరళ (Kerala) స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు. మార్చి 2018 సెప్టెంబర్ 2019 మధ్య జరిగిన కొన్ని సంఘటనల కారణంగా ఇప్పుడు కేరళ (Kerala)కు చెందిన మహిళ శిక్ష (Sentence)కు అర్హురాలైంది. ఒక మహిళ తన మతిస్థిమితం లేని తన భర్తను వదిలేసి, శిశుపాలన్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఆ మహిళకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఈ క్రమంలోనే ఆ మహిళ ప్రియుడు శిశుపాలన్, మహిళ ఇద్దరు కూతుర్లతోనూ అసభ్యంగా ప్రవర్తిస్తూ.. లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. ఈ విషయాన్ని ఆ ఇద్దరు కూతుర్లు ఆ మహిళకు చెప్పినప్పటికీ పట్టించుకోని వైనం.. అంతేకాకుండా తన ప్రియుడి దగ్గరికి, కావాలని తన కూతుర్లను తీసుకుని ప్రియుడు ఇంటికి వెళ్ళేది ఆ మహిళ. ఈ విధంగా దగ్గరుండి తన కూతుర్లను లైంగికంగా వేధించే సంఘటనలో మహిళ ప్రధాన సూత్రధారిగా మారింది. ఏదో ఒకలా తన ఇద్దరు కూతుళ్లు తప్పించుకుని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళగా, విషయాన్ని తెలుసుకున్న పిల్లల అమ్మమ్మ ఇంటివాళ్ళు, ఆ పిల్లలను పిల్లల రక్షణ కేంద్రంలో ఉంచారు. ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేయగా జరిగిన విషయం బయటపడింది. పోలీసులు ఈ మేరకు దర్యాప్తు చేయగా, మహిళా ప్రధాన స్తోత్రధారిగా దొరికింది. ఇంక ఆ మహిళ ప్రియుడు శిశుపాలన్ ఆత్మహత్యకు పాల్పడడంతో, ప్రస్తుతం మహిళను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, మాతృతనానికే మచ్చ తెచ్చిన ఆ మహిళకు క్షమాపణ అనేదే ఉండకూడదు అంటూ 40 ఏళ్ల జైలు (Jail) శిక్ష (Sentence)ను విధించింది కోర్టు. 

 

బిడ్డ‌కు శాపంగా మారిన క‌న్న‌త‌ల్లి: 

 

వైజాగ్‌లోని గాజువాక ప్రాంతానికి చెందిన స్నేహ కొన్నేళ్ల క్రితం తన ప్రియుడు సాయితో కలిసి పారిపోయి, విజయవాడలో ఇద్దరు కలిసి ఉంటున్నట్లు విచారణలో తేలింది. అయితే సంవత్సరం క్రితమే ఆమెకు ఆడబిడ్డ పుట్టింది. స్నేహ బాయ్ ఫ్రెండ్ అయిన సాయి, మద్యానికి బానిసై స్నేహతో గొడవలు పడేవాడు. వేధింపులు భరించలేక, స్నేహ తన కూతురు గీతాశ్రీతో కలిసి మూడు నెలల క్రితం వైజాగ్ నగరానికి తిరిగి వచ్చింది. అంతేకాకుండా నగరంలోనే ఆమె తన మాజీ ప్రియుడు రమణతో జీవితాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంది. ఆడబిడ్డతో పాటు స్నేహ అలాగే తన మాజీప్రియుడు రమణతో కలిసి వైజాగ్ నగరంలోని మంగళపాలెంలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. అయితే వారిద్దరి బంధానికి, సంతోషానికి స్నేహ కి పుట్టిన ఆడబిడ్డ అడ్డుగా ఉందని భావించారు ఆ జంట. అందుకే ఒక కఠినమైన, దుర్మార్గమైన ఆలోచన చేశారు. 

అయితే తనకు పుట్టిన బిడ్డను ఎప్పటినుంచో అడ్డు తొలగించుకోవాలని తలచిన స్నేహ, పాపం ఆ పసికందు మీద కోపాన్ని పెంచుకోసాగింది. జులై 15న బాలిక ఏడుస్తున్న సమయంలో స్నేహ పసికందును అన్నం గరిటెతో కొట్టడంతో తలకు గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. అయితే ఇదంతా తెలుసుకున్న రమణ, స్నేహతో కలిసి ఆ పసికందు మృతదేహాన్ని మాయం చేయాలనుకున్నారు. ప్లాన్ లో భాగంగా ఆ పసిబిడ్డని పొదల్లో పాతిపెట్టి పరారయ్యారు. అయితే తప్పు ఎంత కాలం ఉండదు కాబట్టి, పాక్షికంగా కుళ్లిపోయిన చిన్న పాప మృతదేహాన్ని, పాతిపెట్టిన స్థలం నుంచి వీధికుక్కలు బయటకు లాగడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మృతి చెందిన బాలికను గీతశ్రీగా గుర్తించారు. పాప తల్లి (Mother) బంగారు స్నేహ అలాగే తన మాజీ బాయ్‌ఫ్రెండ్ ఎన్. రమణ, ఇద్దరూ కలిసి జూలై 17న బాలికను కనికరం లేకుండా చంపి, పొదల్లో పాతిపెట్టారని పోలీసులు తెలిపారు. స్నేహ, రమణలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని దువ్వాడ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ బి. శ్రీనివాసరావు తెలిపారు.