Pune: బర్త్ డే రోజు దుబాయ్‌కి తీసుకెళ్లలేదని.. భర్తను కొట్టి చంపిన భార్య..

ముక్కు, పళ్లపై పిడిగుద్దులు కురిపించిన భార్య

Courtesy: Twitter

Share:

Pune: భర్త పీకలదాక తాగేసి ఏదైనా మరిచిపోయినా భార్య పుట్టిన రోజు(Birthday), వివాహ వార్షికోత్సవాన్ని (Wedding anniversary) మర్చిపోకూడదని చాలా మంది తరచుగా బుద్దిమాటలు చెబుతుంటారు. అలా చేస్తే లేనిపోని సమస్యలు వస్తాయని, కాపురంలో గొడవలు వస్తాయని, నువ్వు ఎంత మందు తాగినా నీ భార్య (Wife) విషయంలో జాగ్రత్తగా ఉండాలని స్నేహితులు భర్తలకు సలహాలు ఇస్తుంటారు. ఈ రెండు రోజుల్లో భార్యలు వారి భర్తల నుంచి బహుమతులు కోరుకుంటారు.

ఇక్కడ భార్య పుట్టిన రోజు వేడుకల విషయంలో నిర్లక్ష్యం  చేసి ఓ కోటీశ్వరుడు చివరికి అతని ప్రాణాలు పోగొట్టుకున్నాడు. తన పుట్టిన రోజు జరుపుకునేందుకు తనను దుబాయ్(Dubai) తీసుకెళ్లేందుకు నిరాకరించినందుకు ఓ భార్య ఆమె భర్త ముక్కుపై బలంగా కొట్టింది. ఆవేశంలో భార్య కొట్టిన దెబ్బలతో గిలగిలలాడిన భర్త ప్రాణాలు గాలిలో కలిసిపోయిన షాకింగ్ ఘటన మహారాష్ట్రలో (Maharastra) చోటుచేసుకుంది.

పుణేలోని వనవాడి ప్రాంతంలోని ఓపోష్ రెసిడెన్షియల్ సొసైటీలోని(Oposh Residential Society) అపార్ట్‌మెంట్‌లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. నిర్మాణ రంగంలో (రియల్ ఎస్టేట్, బిల్డర్) వ్యాపారి అయిన నిఖిల్ ఖన్నా(Nikhil) అనే వ్యక్తి అతని భార్య దాడిలో చనిపోయాడని పోలీసులు తెలిపారు. నిఖిల్ ఖన్నా(Nikhil Khanna) అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి రేణుకా(38) అనే మహిళను ఆరు ఏళ్ల క్రితం ప్రేమ వివాహం(Love Marriage) చేసుకున్నాడు.

ఈ కేసుకు సంబంధించి పూణేలోని (Pune) వానవాడి పోలీస్ స్టేషన్‌కు (Vanawadi Police Station) చెందిన సీనియర్ పోలీసు అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ శుక్రవారం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగిందని ప్రాథమిక విచారణలో తేలందని అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి నిఖిల్ ఖన్నా(Nikhil Khanna) భార్య రేణుకా (Renuka) ఆమె పుట్టినరోజు జరుపుకోవడానికి దుబాయ్‌కు తీసుకువెళ్లాలని భర్తకు చెప్పింది. ఇదే విషయంలో కొన్ని రోజుల నుంచి రేణుకా ఆమె భర్త నిఖిల్ ఖన్నా మీద ఒత్తిడి చేస్తోందని తెలిసింది.

అయితే భార్య రేణుకాను (Renuka) దుబాయ్ (Dubai) తీసుకెళ్లకపోవడంతో దంపతుల మధ్య గొడవ జరిగినట్లు తెలిసింది. అలాగే తన బర్త్ డే రోజు, మ్యారేజ్ డే రోజు ఖరీదైన బహుమతులు ఇవ్వలేదని భార్య రేణుకా ఆమె భర్త నిఖిల్ ఖన్నాతో చాలా రోజుల నుంచి గొడవలు పడుతోందని, భార్య తీరుతో నిఖిల్ ఖన్నా చిరాకు పడుతున్నాడని పోలీసుల విచారణలో (Police investigation) వెలుగు చూసింది. ఇదే సమయంలో బధువుల పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు ఢిల్లీ వెళ్లిన నిఖిల్ ఖన్నా(Nikhil Khanna) కొన్ని రోజులు అక్కడే ఉన్నాడని తెలిసింది.

తన బర్త్ డే వేడుకలు దుబాయ్ లో జరుపుకునే విషయంలో భర్త నిఖిల్ ఖన్నా సరిగా స్పందించకపోవడంతో అతని భార్య రేణుకా మనస్తాపానికి గురైనట్లు వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. శుక్రవారం మద్యాహ్నం ఇదే విషయంలో రేణుకా(Renuka), నిఖిల్ ఖన్నా(Nikhil Khanna) దంపతుల మధ్య గొడవ(Fight) జరిగింది. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన భార్య రేణుకా ఆమె భర్త నిఖిల్ ఖన్నా ముఖంపై పిడిగుద్దులు కురిపించింది.

భార్య రేణుకా కొట్టిన ఆ పంచ్‌ లకు రియల్ ఎస్టేట్ వ్యాపారి నిఖిల్ ఖన్నా ముక్కు బద్దలు అయ్యింది. నిఖిల్ ఖన్నా మూతిమీద ఉన్న కొన్ని పళ్లు విరిగిపోయాయి. అలాగే, తీవ్ర రక్తస్రావం కారణంగా నిఖిల్ స్పృహ కోల్పోయాడని మహారాష్ట్ర పోలీసులు సమాచారం అందించారు. వెంటనే నిఖిల్ ఖన్నాను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స విఫలమై నిఖిల్ ఖన్నా ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని పోలీసులు తెలిపారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారి (Real Estate Dealer) నిఖిల్ ఖన్నాను హత్య కేసిన అతని భార్య రేణుకా మీద హత్య కేసు (Murder Case) నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం ఆమెను అదుపులోకి తీసుకున్నామని పూణే సిటీ పోలీసు కమీషర్ (Pune City Police Commissioner) స్థానిక మీడియాకు చెప్పారు. మొత్తం మీద భార్య బర్త్ డే పార్టీ భర్త చావుకు వచ్చిందని వెలుగు చూడటం పూణేలో కలకలం రేపింది.