వైఎస్ రాజారెడ్డి వివాహ తేదీని వెల్లడించిన వైఎస్ షర్మిల

వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆమె కుమారుడు వైఎస్ రాజారెడ్డి పెళ్లిపీఠలు ఎక్కుబోతున్నారు. త‌న కుమారుడి వివాహంపై వైఎస్ ష‌ర్మిల ట్వీట్ చేశారు.

Courtesy: x

Share:

హైదరాబాద్: వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆమె కుమారుడు వైఎస్ రాజారెడ్డి పెళ్లిపీఠలు ఎక్కుబోతున్నారు. త‌న కుమారుడి వివాహంపై వైఎస్ ష‌ర్మిల ట్వీట్ చేశారు. ఫిబ్ర‌వ‌రి 17వ తేదీన వైఎస్ రాజా రెడ్డి అట్లూరి ప్రియా ఒక్క‌టి కాబోతున్నార‌ని ఆమె ప్ర‌క‌టించారు. జనవరి 18న అట్లూరి ప్రియతో తన కొడుకు ఎంగేజ్ మెంట్ , ఫిబ్రవరి 17న పెళ్లి జరగబోతున్నట్లు షర్మిల తన ట్విట్టర్లో ప్రకటించారు.  జనవరి 2న కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో తాము ఇడుపుల పాయలోని వైఎస్సార్ ఘాట్ ని సందర్శిస్తామని తెలిపారు. తొలి ఆహ్వాన పత్రికను ఘాట్ దగ్గర  పెట్టి తన తండ్రి వైఎస్సార్ ఆశీస్సులు తీసుకుంటామని చెప్పారు. తన కొడుకు పెళ్లి వేడుక విషయాలను మీతో పంచుకోవడం ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు.

వైఎస్ రాజారెడ్డి చేసుకోబోయే అమ్మాయితో కలిసి ఉన్న ఫోటోలు కొన్ని  రోజుల నుంచి సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. వీరిది ప్రేమ వివాహమని..ఇరు కుటుంబాలు వారి పెళ్లికి ఒప్పుకున్నాయని టాక్ వినిపిస్తోంది. 

అమెరికాలోని డల్లాస్ యూనివర్శిటీలో చదువు పూర్తి చేసిన వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి, చట్మీస్ అధినేత ప్రసాద్ అట్లూరి మనుమరాలు అట్లూరి ప్రియలు నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు గత కొద్దికాలంగా సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. అయితే ఇప్పటి వరకూ ఇరువురి కుటుంబాల నుంచి అధికారిక ప్రకటన లేదు. ఇప్పుడు తన కుమారుడి ప్రేమ పెళ్లి వ్యవహారంపై వైఎస్ షర్మిల అధికారికంగా స్పందించారు. ఇద్దరి నిశ్చితార్ధం, పెళ్లి తేదీలను ప్రకటించారు.

అమెరికాలో స్థిరపడ్డ అట్లూరి శ్రీనివాస్ , అట్లూరి మాధవి దంపతుల కుమార్తె ప్రియా. వీళ్ల స్వస్థలం ఎన్టీఆర్ జిల్లా.. అట్లూరి శ్రీనివాస్ ది విజయవాడ, ఆయన భార్య మాధవిది ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచిప్రోలు. అమెరికాలో స్థిరపడ్డారు. అయితే పెళ్లి ఎక్కడ జరుగుతుంది, ఎవరెవరికి ఆహ్వానం అందుతుందనే వివరాలు తెలియాల్సి ఉంది. సోదరి కుమారుడి పెళ్లికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరు కానున్నారా లేదా అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.