ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన వైఎస్ షర్మిల..

YS Sharmila: వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. న్యూఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు.

Courtesy: Top Indian News

Share:

దిల్లీ: వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. న్యూఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ.. వైఎస్సార్‌ టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం సంతోషంగా ఉందన్నారు. నేటి నుంచి కాంగ్రెస్‌లో వైటీపీ ఒక భాగమని చెప్పారు. దేశంలోనే అతిపెద్ద పార్టీ కాంగ్రెస్‌ అని తెలిపారు. దేశంలో అన్ని వర్గాలను న్యాయం చేసే పార్టీ అని వెల్లడించారు.

నాన్న అడుగు జాడల్లో నడుస్తున్నా: షర్మిల
వైతెపాను కాంగ్రెస్‌లో విలీనం చేయడం సంతోషంగా ఉందని వైఎస్‌ షర్మిల అన్నారు. ఇవాళ్టి నుంచి కాంగ్రెస్‌లో వైతెపా ఒక భాగమని చెప్పారు. కాంగ్రెస్‌లో చేరిన అనంతరం ఆమె మాట్లాడారు. ‘‘వైఎస్సార్‌ తన జీవితమంతా కాంగ్రెస్‌ పార్టీ కోసమే పనిచేశారు. మా నాన్న అడుగుజాడల్లోనే నడుస్తున్నా. దేశంలో అతిపెద్ద లౌకిక పార్టీ కాంగ్రెస్‌. కేసీఆర్‌ వ్యతిరేక ఓటు చీలకూడదనే తెలంగాణ ఎన్నికల్లో వైతెపా పోటీ చేయలేదు. రాహుల్‌గాంధీని ప్రధానిగా చూడటం మా నాన్న కల. అది నెరవేర్చడానికి మనస్ఫూర్తిగా పనిచేస్తాను. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా శక్తివంచన లేకుండా కృషిచేస్తా’’ అని షర్మిల అన్నారు.

కాంగ్రెస్‌లో షర్మిల చేరిన నేపథ్యంలో ఆమెకు పార్టీ ఏ బాధ్యతలు అప్పగిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఏఐసీసీలో పదవి ఇస్తారా? ఏపీ కాంగ్రెస్‌ బాధ్యతలు అప్పగిస్తారా? అనేదానిపై జోరుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి.