చక్రశాస్త్రం.. చక్రాలు ఎన్ని.. వాటిలో సహస్ర చక్రాన్ని మహిళలు ఏ విధంగా అదుపులో ఉంచుకుంటారు..?

మన భావాలు మరియు భావోద్వేగాలు నిజంగా మన శరీరంలోనే ఉంటాయి, మన చుట్టూ ఉన్న శక్తితో మన శరీరం కదులుతుంది. కొన్ని శక్తివంతమైన ప్రేరణలు సాధారణంగా శరీరంలోని నిర్దిష్ట భాగానికి నేరుగా సంబంధం కలిగి ఉంటాయి, దీని వలన చక్రం బలహీనంగా, నిరోధించబడి లేదా అసమతుల్యతగా మారుతుంది. మనం శరీరాన్ని కలిగి ఉండి.. ఆహారం , పానీయాలతో శరీరాన్ని వృద్ధి చేస్తున్నాము అంటే అందులో ఏమాత్రం నిజం లేదు. మనకు తెలియని అతి సూక్ష్మమైన శక్తిని కూడా […]

Share:

మన భావాలు మరియు భావోద్వేగాలు నిజంగా మన శరీరంలోనే ఉంటాయి, మన చుట్టూ ఉన్న శక్తితో మన శరీరం కదులుతుంది. కొన్ని శక్తివంతమైన ప్రేరణలు సాధారణంగా శరీరంలోని నిర్దిష్ట భాగానికి నేరుగా సంబంధం కలిగి ఉంటాయి, దీని వలన చక్రం బలహీనంగా, నిరోధించబడి లేదా అసమతుల్యతగా మారుతుంది.

మనం శరీరాన్ని కలిగి ఉండి.. ఆహారం , పానీయాలతో శరీరాన్ని వృద్ధి చేస్తున్నాము అంటే అందులో ఏమాత్రం నిజం లేదు. మనకు తెలియని అతి సూక్ష్మమైన శక్తిని కూడా మనం కలిగి ఉన్నాం. ఇది మనకు కనిపించని శక్తిగా ఉంటుంది. అంతేకాదు ఆహార పానీయాల ద్వారా పొందలేని శక్తి కూడా ఇదే. ఈ కనిపించని సూక్ష్మమైన శక్తి పురాణ గ్రంథాలలో ప్రాణంగా పరిగణించబడింది. ఒక్కొక్క మతంలో ఒక్కొక్క పేరుతో పిలవబడుతున్న ఈ శక్తి ఫలితాలను మాత్రం ఒకే విధంగా అందజేస్తుంది. మన శక్తి గురించి మనం అవగాహన పెంచుకున్నప్పుడే ఎన్నో సానుకూల ఫలితాలను పొందుతాము. మరి ఈ అంతులేని అనంతమైన శక్తి ఎలా ఉంటుంది. యోగ, ఆధ్యాత్మికత, జ్యోతిష్య శాస్త్రంతో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉంది వంటి సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

చక్రశాస్త్రం

మనిషి ఏదో ఒక సందర్భంలో నీరసించినట్టు కనిపిస్తాడు.. దీనికి కారణం మానసిక సంతృప్తి లేకపోవడం. అయితే మన శరీరంలో అంతర్గతంగా నిక్షిప్తమైన శక్తి ఎంతగానో మనల్ని ప్రభావితం చేస్తుంది. ఇలాంటి సందర్భాలలో కొన్నింటిని పాటించడం వల్ల ఆ శక్తిని తిరిగి పొందుతారు. తద్వారా శరీరం శక్తిని తిరిగిపొంది నూతన ఉత్సాహంతో పరుగులు వేస్తుంది. మానవుని శరీరంలో ఉన్న వెన్నెముకలో ఏడు అంశాలు ఉన్నాయి. వెన్నెముక చివరి భాగం నుండి నాడీ కణజాలం ద్వారా మెదడు కణాలను కలుస్తుంది. ఇవి గుర్తులుగా కేంద్రీకృతమై ఉంటాయి. ఈ గుర్తులనే చక్రాలుగా పిలుస్తారు. మనిషికి తెలియకుండానే మనిషిలో ఉన్న శక్తికి ఈ చక్రాలు నిదర్శనంగా నిలుస్తాయి. 

చక్రాలు…

మొదటి చక్రాన్ని మూలాధార చక్రం అని పిలుస్తారు. ఇది వెన్నుపాము స్థావరం వద్ద ఉంటుంది. భద్రత భావాలను కలుగజేసి ఈ చక్రం స్థిరంగా ఉన్నవారికి జీవితం చక్కగా ఉంటుంది అని చెప్పబడింది.

రెండవ చక్రం కఠి ప్రాంతం వద్ద ఉంటుంది. దీనిని స్వాధీష్టాన చక్రమని అంటారు. ఇది పంచేంద్రియాల భావాలను,  స్పర్శలను మనకు తెలిసేలా చేస్తుంది. భావోద్వేగాలను కలిగిన చక్రంగా ఇది పేరుగాంచింది. మూడవది నాభి స్థానంలో ఉన్న మణిపుర చక్రం. మణిపుర చక్రంలో మానసిక స్థితిగతులు మరియు ఆత్మ నిగ్రహం ఆధీనంలో ఉంటాయి. ఇక నాలుగవ చక్రం అనాహత చక్రం. ఇది గుండె దగ్గర ఉంటుంది. ప్రేమ,  ఆవేశం , భావోద్వేగాలకు నిలయం ఈ చక్రం. గొంతు దగ్గర ఉండే ఐదవ చక్రాన్ని విశుద్ధ చక్రం అని అంటారు. సృజనాత్మకతకు , భావవ్యక్తీకరణకు కేంద్రంగా ఉంటుంది. తదుపరి చక్రం కళ్ల మధ్య ఉన్న ఆజ్ఞ చక్రం. దీనిని అంతర్బుద్ధి కేంద్రంగా.. త్రినేత్రంగా పిలుస్తారు. ఈ చక్రం సక్రమంగా పనిచేసే వారికి అనేక విషయాలపై అవగాహనను మెండుగా ఉండి.. అంచనాలు సరిగా వేయగలిగేలా ఉంటారు. 

ఇక చివరి చక్రం సహస్ర చక్రం. ఇది తల పైన ఉంటుంది. అన్ని చక్రాలలో ముఖ్యమైన చాక్రంగా  ఈ సహస్ర చక్రాన్ని భావిస్తారు. ప్రతి ముఖ ఆలోచనకు, నిర్ణయానికి,  మానసిక సంతోషాలకు,  భావోద్వేగాలకు ఇలా ప్రతి ఒక్క అంశానికి ఈ చక్రం ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది. ఈ చక్రాలు శరీరంలో శక్తి ప్రవాహంలో కలుస్తాయి. ఈ చక్రాలలో ఏదైనా మార్పులు వచ్చినప్పుడు మానసికంగా, శారీరకంగా మనలో ప్రతికూల ప్రభావాలు కలుగుతాయి.

మహిళలు ఈ సహస్ర చక్రాన్ని ఏ విధంగా అదుపులో ఉంచుకుంటారు

ఇకపోతే మహిళలు ఈ సహస్ర చక్రాన్ని ఏ విధంగా అదుపులో ఉంచుకుంటారు అంటే ముందుగా తమ ఆలోచనలకు పదును పెట్టే విధంగా తమ ప్రయత్నాలను వారు చేస్తారు. సాధ్యమైనంత వరకు యోగ , మెడిటేషన్ తో పాటు ఎంతో సహనాన్ని కూడా కలిగి ఉంటారు. ఈ సహస్ర చక్రం మహిళల్లో అన్ని భావాలను అదుపులో ఉంచుకునేలా చేస్తుంది. సాధారణంగా మహిళలకు భూదేవి అంత ఓర్పు ఉంటుందని చెబుతూ ఉంటారు కదా అయితే ఈ సహస్ర  చక్రం కారణంగా వారు తమ కోపం,  భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు. ముఖ్యంగా భావోద్వేగాలకు ఈ చక్రం నిలయంగా ఉంటుంది కాబట్టి మగవారితో పోల్చుకుంటే మహిళలు ఈ చక్రాన్ని తమ అధీనంలో ఉంచుకోవడానికి చాలా చక్కగా ప్రయత్నం చేస్తారు.