మీ పుట్టిన తేదీ మీకు ఏ విధమైన కెరీర్ ఎంచుకోవాలో సూచిస్తుంది

సంఖ్యలు మీ కెరీర్ గ్రాఫ్‌ని ఎలా నిర్ణయిస్తాయి సంఖ్యలు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసే లక్షణాలను కలిగి ఉంటాయని న్యూమరాలజీ చెబుతుంది. ఈ సంఖ్యలు మీ సామర్థ్యాలకు బాగా సరిపోయే వృత్తిని లేదా పనిని ఎంచుకోవడానికి మీకు మార్గనిర్దేశం చేస్తాయి. అవి కెరీర్‌లో మీ విజయావకాశాలను కూడా పెంచుతాయి. 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారు ఈ తేదీలను పాలించే గ్రహం సూర్యుడు. ఈ తేదీలలో పుట్టిన వారు పుడుతూనే  నాయకులు. […]

Share:

సంఖ్యలు మీ కెరీర్ గ్రాఫ్‌ని ఎలా నిర్ణయిస్తాయి

సంఖ్యలు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసే లక్షణాలను కలిగి ఉంటాయని న్యూమరాలజీ చెబుతుంది. ఈ సంఖ్యలు మీ సామర్థ్యాలకు బాగా సరిపోయే వృత్తిని లేదా పనిని ఎంచుకోవడానికి మీకు మార్గనిర్దేశం చేస్తాయి. అవి కెరీర్‌లో మీ విజయావకాశాలను కూడా పెంచుతాయి.

1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారు

ఈ తేదీలను పాలించే గ్రహం సూర్యుడు. ఈ తేదీలలో పుట్టిన వారు పుడుతూనే  నాయకులు. వీళ్ళు రిస్క్ తీసుకుంటారు.  వీరు వ్యాపారంలో రాణిస్తారు. ధీరూభాయ్ అంబానీ, రతన్ టాటా, ముఖేష్ అంబానీ, బిల్ గేట్స్ అందరూ ఈ తేదీలలో పుట్టినవాళ్ళే. వీరికి వ్యాపారమే ఉత్తమ కెరీర్.

2, 11, 20, 29 తేదీల్లో పుట్టిన వారు

ఈ తేదీలను పాలించే గ్రహం చంద్రుడు. ఈ తేదీలలో పుట్టినవారు చాలా సృజనాత్మకంగా ఉంటారు. చాలా మంచి దౌత్యవేత్తలుగా ఉంటారు. కళలు, నటన, ఫ్యాషన్ డిజైనింగ్ వంటివి ఎంచుకొంటే మంచిది. షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్, లియోర్నాడో డికాప్రియో ఈ తేదీలలో జన్మించారు.

3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వారు

ఈ తేదీలను పాలించే గ్రహం బృహస్పతి. ఈ తేదీలలో పుట్టినవారికి లెక్కలు బాగా వస్తాయి. 3వ తేదీన జన్మించిన వ్యక్తులు బ్యాంకింగ్, ఫైనాన్స్‌లో చాలా విజయవంతమవుతారు. రిటైల్ వ్యాపారం కూడా మరొక ప్రయత్నించదగిన రంగం. వీరు బ్యాంకింగ్, ఫైనాన్స్ సంబంధిత రంగాలు, రిటైల్ వ్యాపారం వంటి కెరీర్ ఆప్షన్స్ ఎంచుకోవడం మంచిది.

4, 13, 22, 31 తేదీల్లో పుట్టిన వారు

4వ తేదీన జన్మించిన వ్యక్తులు అసాధారణమైనవారిగా, ప్రత్యేకమైనవారిగా చెప్పబడతారు. వీళ్ళు  రిస్క్ తీసుకుంటారు. కానీ తప్పుడు నిర్ణయాల కారణంగా తరచుగా తమను తాము ఇబ్బందుల్లోకి నెట్టుకుంటారు. 4వ తేదీన జన్మించిన వారికి కళ, నటన.. వారికి విజయాన్ని అందిస్తాయి.

5, 14, 23 తేదీల్లో పుట్టిన వారు

మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, నిర్ణయం తీసుకునే శక్తి వీరి సొంతం. అద్భుతమైన స్టాక్ మార్కెట్ వ్యాపారులవ్వగలరు. వీరికి ఎదుటివారిని సులభంగా ఒప్పించే శక్తి ఉంది. రొటీన్ లేదా సురక్షితమైన ఉద్యోగాలు వారికి విసుగు తెప్పిస్తాయి., ఎందుకంటే వారు ఎప్పుడూ రిస్క్‌ల కోసం వెతుకుతూ ఉంటారు. అందుకే సాంకేతికత, క్రీడలు, మార్కెటింగ్ లేదా విక్రయాలు వీరికి ఉత్తమమైన రంగాలు.

6, 15 లేదా 24 తేదీల్లో పుట్టిన వారు

ఈ తేదీకి అధిపతి శుక్రుడు. వీరు ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వారికి అనువైన ఉద్యోగాలు హోటల్ లేదా రెస్టారెంట్ వ్యాపారం, లగ్జరీ లేదా వినోద పరిశ్రమలు కీర్తిని తీసుకురాగలవు.

7, 16 లేదా 25 తేదీల్లో పుట్టిన వారు

7వ తేదీన పుట్టినవారు పరిశోధనా రంగంలో చాలా బాగా రాణిస్తారు. వారు ప్రత్యేకమైన వినూత్న, సృజనాత్మక సామర్థ్యాలను కలిగి ఉంటారు. అది వారిని ప్రత్యేకంగా చేస్తుంది. వారి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచనలు వారికి విజయాన్ని అందిస్తాయి. ఈ తేదీన పుట్టినవారికి పరిశోధన సంబంధిత రంగాలు ఉత్తమమైనవి.

8, 17, 26 తేదీల్లో పుట్టిన వారు

వీరు 35 సంవత్సరాలు వచ్చే వరకు పోరాడుతూ కనిపిస్తారు. కష్టపడి పని చేస్తారు. ఇది కొంచెం ఆలస్యం అయినా.. వారికి విజయాన్ని అందిస్తుంది. రాజకీయాలు, ఉక్కు, మెటల్ పరిశ్రమ, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ రంగాలు వీరికి కలిసి వస్తాయి.

9, 18, 27 తేదీల్లో పుట్టిన వారు

వీరు క్రీడా రంగంలో బాగా రాణిస్తారు. ఈ తేదీల్లో ప్రపంచంలోని అత్యుత్తమ క్రీడాకారులు జన్మించారు. వీరికి చాలా ధైర్యం ఉంటుంది. క్రీడలు కాకపోతే రక్షణ, రసాయనాలు లేదా రియల్ ఎస్టేట్ కూడా ఎంచుకోవచ్చు.