సూదులు గుచ్చే పని లేదు, చెమటతోనే షుగర్ టెస్టులు: పరికరం కనిపెట్టిన ఏపీ శాస్త్రవేత్త

Sugar test: సూదులతో కుచ్చే బాధ లేకుండా నేరుగా చమటతోనే షుగర్ టెస్టులు నిర్ధారించే పరికరాన్ని కనిపెట్టారు శాస్త్రవేత్తలు. రక్త నమునాల కోసం సూదులతో తీయించుకునే సమస్య ఉండదు.

Courtesy: IDL

Share:

హైదరాబాద్‌: ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల 18 ఏండ్ల లోపు వారూ ఈ వ్యాధిబారిన పడుతున్నారు. కొందరు ఈ వ్యాధిని వెంటనే గుర్తించి సరైన జాగ్రత్తలు తీసుకుంటుండగా.. మరికొందరు నిర్లక్ష్యం చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా.. మధుమేహంతో బాధపడుతున్న వారికి ఉపశమనం కలిగించే వార్త వెలుగులోకి వచ్చింది. 

సూదులతో కుచ్చే బాధ లేకుండా నేరుగా చమటతోనే షుగర్ టెస్టులు నిర్ధారించే పరికరాన్ని కనిపెట్టారు శాస్త్రవేత్తలు. రక్త నమునాల కోసం సూదులతో తీయించుకునే సమస్య ఉండదు. ఆసుపత్రికి వెళ్లకుండా, సూది గుచ్చకుండా ఇంటివద్దే షుగర్ టెస్టు చేసుకునేలా ఏపీకి చెందిన వూసా చిరంజీవి శ్రీనివాసరావు అనే శాస్త్రవేత్త కొత్త పరికరం కనిపెట్టారు. చెమటను పరీక్షించి రక్తంలో షుగర్ స్థాయిలను చెప్పే కొత్త పరికరాన్ని చిరంజీవి కనుగొన్నారు. ఈ పరికరం ఖర్చు కూడా తక్కువే. టైప్‌1, టైప్‌2 డయాబెటిస్‌ పేషెంట్ల ఇరువురికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. చెమటతోనే గ్లూకోజ్ ​ను నిర్ధరించే ఈ పరికరాన్ని నిశితంగా పరీక్షించిన భారత ప్రభుత్వం పేటెంట్ రైట్స్ ఇస్తూ ధ్రువపత్రం జారీ చేసింది.

కేవలం చెమట ద్వారా మధుమేహాన్ని నిర్ధారించే ఎలక్ట్రో కెమికల్‌ పరికరాన్ని కనుగొనగా, దానిని రెండేళ్ల పాటు పరీక్షించిన ఇండియన్‌ పేటెంట్‌ అథారిటీ గత నెల 29న పేటెంట్‌ హక్కులు కల్పించింది. నిరుపేద కుటుంబంలో పుట్టిన శ్రీనివాసరావు ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ చదివిన ఆయన ఆంధ్రా యూనివర్సిటీలో పీజీ, తర్వాత పీహెచ్‌డీ చేసి, ప్రస్తుతం ఐఐటీ కాన్పూర్‌లో కెమికల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో సైంటిస్టుగా పనిచేస్తున్నారు. శరీరంలోని గ్లూకోజ్‌ స్థాయిని నిర్ధారించడానికి రక్తాన్ని తీయనవసరం లేకుండా కేవలం చెమటను పరీక్షించి నిమిషంలో ఈ పరికరంతో మధుమేహాన్ని లెక్కించవచ్చని ఆయన తెలిపారు. ఈ పరికరం అందుబాటులోకి వస్తే సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని, ఖర్చు కూడా తగ్గుతుందని శ్రీనివాసరావు చెప్పారు.

నాలుగేళ్లు కష్టంతోనే సాధ్యమైంది
జీవ రసాయన శాస్త్రంలో పీహెచ్‌డీ చేసిన శ్రీనివాసరావు ప్రస్తుతం ఐఐటీ కాన్పుర్‌లో కెమికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో సైంటిస్ట్ ​గా పనిచేస్తున్నారు. 18 ఏళ్లలోపు చిన్నారులు టైప్‌-1 మధుమేహం బారిన పడుతున్నారు. ఈ సమస్యతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ నాలుగు సార్లు గ్లూకోజ్‌ పరీక్షలు చేసుకుని ఇన్సులిన్‌ వేసుకోవాలి. క్రమం తప్పితే కోమాలోకి వెళ్లి పోయే అవకాశాలు ఎక్కువ. టైప్‌-2 మధుమేహం బాధితులదీ ఇదే పరిస్థితి. దీంతో వారి కోసం ఏమైనా చేయాలనే లక్ష్యంతో శ్రీనివాసరావు ఎలక్ట్రోకెమికల్‌ పరికరాన్ని కనుగొన్నారు. ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రోకెమికల్‌, సెన్సర్లను వినియోగించి నాలుగేళ్ల పాటు కష్టపడి ఈ పరికరాన్ని రూపొందించినట్లు శ్రీనివాసరావు తెలిపారు. దీనిని రెండేళ్ల పాటు భారత ప్రభుత్వం(ఇండియన్‌ పేటెంట్‌ అధారిటీ) అన్ని విధాలుగా పరీక్షించి గత నెల 29న పేటెంట్‌ హక్కులు నిర్ధరిస్తూ ధ్రువపత్రం జారీ చేసిందని ఆయన వివరించారు.