గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైఎస్ జగన్ పర్యటన

ముఖ్యమంత్రి జగన్ ,గోదావరి వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.. .. జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. వరదల సమయంలో మీ అందరికీ ఇబ్బందులు కలగకుండా, నిత్యావసర సరుకులు, ఆర్థిక సాయం అందించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను కోరుతున్నాను అని తెలిపారు  అధికారిక యంత్రాంగాన్ని రక్షించే మరియు సహాయక చర్యలను అన్ని చేస్తున్నందున నేను వరదలు ఎక్కువగా ఉన్న ప్రదేశాలను సందర్శించడం మానుకున్నాను అని  నేను ప్రచారం లేదా ఫోటో కోసం చేరుకోవడానికి ఇది […]

Share:

ముఖ్యమంత్రి జగన్ ,గోదావరి వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.. .. జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. వరదల సమయంలో మీ అందరికీ ఇబ్బందులు కలగకుండా, నిత్యావసర సరుకులు, ఆర్థిక సాయం అందించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను కోరుతున్నాను అని తెలిపారు 

అధికారిక యంత్రాంగాన్ని రక్షించే మరియు సహాయక చర్యలను అన్ని చేస్తున్నందున నేను వరదలు ఎక్కువగా ఉన్న ప్రదేశాలను సందర్శించడం మానుకున్నాను అని  నేను ప్రచారం లేదా ఫోటో కోసం చేరుకోవడానికి ఇది సమయం కాదు అని తెలిపారు. 

 గోదావరి వరదల్లో ముంపుతో పాటు గ్రామాల్లో కోతకు కారణమవుతున్న ప్రాంతాల్లో నదికి రక్షణ గోడ నిర్మిస్తామని సిఎం జగన్ ప్రకటించారు. నెల రోజుల్లో టెండర్లు పిలిచి రెండు నెలల్లో పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. కోనసీమ జిల్లాలో సిఎం పర్యటిస్తున్నారు.

అధికారులు మీ అందరికి ఏవిధంగా సహాయం అందించారో తెలుసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. అవసరమైన అన్ని చర్యలు తీసుకునేందుకు జిల్లా కలెక్టర్లకు నేను అధికారం ఇచ్చాను అని ఆయన తెలిపారు 

జిల్లా అధికారులు తమకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించారని, స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తమ కాలనీలను సందర్శించి జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని వరద బాధితులను అన్ని విధాలా ఆదుకున్నారని కె.లక్ష్మి సీఎంకు తెలిపారు.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ గృహసారధి రజనీ మాట్లాడుతూ.. వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న మాకు నిత్యావసర సరుకులు, ఆర్థిక సాయం అందించామని, ఆదుకున్నందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

వీఆర్ పురం, కూనవరం నుంచి చింతూరు వరకు రోడ్డు సౌకర్యం కల్పించాలని సీఎంకు సునీత విజ్ఞప్తి చేశారు.

గోదావరి లంక గ్రామాల ను వరదనీరు ముంచెత్తుతోంది… 

ఉగ్రరూపం దాల్చిన గోదావరి లోతట్టు ప్రాంతాలను జలదిగ్బంధనం చేసింది. వరద ఉధృతి ఎగువున చల్లారిన దిగు పరిస్థితి అయితే ఇంకా చక్కబడలేదు వ్యవసాయ ఉద్యాన పంటలు పూర్తిగా నీటి మునిగిపోయి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితి ముఖ్యంగా కోనసీమ జిల్లా ను కుదిపేస్తుంది ప్రస్తుతం కోనసీమ జిల్లాలో చాలా మండలాలు ఇంకా నీటి ముంపులోనే ఉన్నాయి. ఇక్కడ వరదనీరు పూర్తిగా ఇళ్ల చుట్టూ చేరడంతో ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి పనికి కూడా వారు పడవ ప్రయాణం చేస్తున్నారంటే పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఐ.పోలవరం, ముమ్మిడివరం, కాట్రేనికోన, తాళ్లరేవు మండలాలపై ఈ వరద ప్రభావం ఎక్కువగా ఉంది.

ఇక్కడ జనం బయటకు రాలేని దుస్థితిని ఎదుర్కొంటున్నారు. కనీసం పశువులకు మేత దొరకడం లేదు. ఇది ఇలా ఉంటే రాజోలు నియోజకవర్గం లో సఖినేటిపల్లి మండలంలో కొన్ని గ్రామాలు అయితే ఇక పూర్తిగా నీటిలోనే మునిగి ఉన్నాయి. ఇక్కడ రహదారులు కనిపించకపోవడంతో ప్రజలు బయటకు రాలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అమలాపురం నియోజకవర్గ పరిధిలో అల్లవరం మండలంలో కూడా ఇదే దుస్థితి నెలకొంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి లంక గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో ఉండిపోవడంతో అధికారులు కూడా సహాయక చర్యలు చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం తాత్కాలికంగా ఆహారాన్ని మాత్రమే అందిస్తున్నారు. తాగునీటి విషయంలో కూడా ఇక్కట్లు పడుతున్నారు ఇక్కడ జనం. 

అనంతరం సిఎం మాట్లాడుతూ మానవతా దృక్పథంతో నిరుపేదలను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని, దెబ్బతిన్న ప్రతి ఇంటి ఇంటికీ 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు. వరద బాధితులు సహాయ శిబిరాల నుండి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు బాధిత కుటుంబాలు మరియు వ్యక్తులందరికీ వరుసగా 2,000 మరియు 1,000 సహాయం అందాయా అని ఆయన వరద బాధితులను అడిగి తెలుసుకున్నారు. 

Tags :