దెయ్యంతో మహిళ లవ్‌ ఎఫైర్‌.. 20 ఏళ్ల పాటు..

దెయ్యాలు ఉన్నాయా? లేవా? అన్నదానిపై క్లారిటీ లేదు. కొంతమంది దెయ్యాలు ఉన్నాయి అంటే.. కొందరు లేవు అంటున్నారు.  ఇంకా కొంతమంది తాము దెయ్యాలు చూశామంటూ తమకెదురైన అనుభవాలను చెప్పుకొస్తున్నారు. కానీ, ఇంకా కొందరు ఓ అడుగు ముందుకు వేసి దెయ్యాలతో తాము ప్రేమలో పడ్డామని, కాపురం కూడా చేశామని అంటున్నారు. అరె, అసలు దెయ్యం కంటికే కనిపించదు, ఇక దెయ్యంతో శృంగారమా? అంతా అబద్ధం అని కొట్టిపారేయకండి. కంటికి కనిపించకపోతే ఏం.. ఒంటికి స్పర్శ తెలియదా?  అంటూ […]

Share:

దెయ్యాలు ఉన్నాయా? లేవా? అన్నదానిపై క్లారిటీ లేదు. కొంతమంది దెయ్యాలు ఉన్నాయి అంటే.. కొందరు లేవు అంటున్నారు.  ఇంకా కొంతమంది తాము దెయ్యాలు చూశామంటూ తమకెదురైన అనుభవాలను చెప్పుకొస్తున్నారు. కానీ, ఇంకా కొందరు ఓ అడుగు ముందుకు వేసి దెయ్యాలతో తాము ప్రేమలో పడ్డామని, కాపురం కూడా చేశామని అంటున్నారు. అరె, అసలు దెయ్యం కంటికే కనిపించదు, ఇక దెయ్యంతో శృంగారమా? అంతా అబద్ధం అని కొట్టిపారేయకండి. కంటికి కనిపించకపోతే ఏం.. ఒంటికి స్పర్శ తెలియదా?  అంటూ తాజాగా, ఇలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అదేంటో తెలుసుకుందాం రండి. 

కొలంబియాకు చెందిన పౌలా ఫ్లోర్స్‌ అనే మహిళ తన అనుభవాల గురించి చెబుతూ..‘‘చిన్నప్పుడు ఓ రోజు నేను మంచంపై పడుకుని ఉన్నా. ఓ చెయ్యి నా కాళ్ల మీద నుంచి ఛాతి వరకు వచ్చింది. అది దెయ్యం చెయ్యి. దీంతో నాకు భయం వేసింది. ఇక, అప్పటినుంచి ఆ దెయ్యం తరచుగా మా ఇంటికి వస్తూ ఉండేది. నాతో ఆ దెయ్యం శృంగారం చేస్తోందన్న భావన కలిగేది. దాదాపు 20 ఏళ్ల పాటు ఇలా జరిగింది. నేను ఇదంతా వద్దు అనుకున్నా. తర్వాతి నుంచి అది నా దగ్గరకు రావటం మానేసింది’’అని చెప్పుకొచ్చింది.

ఈ విషయంపై సైకాలజిస్ట్ మారిట్జా మాంటెలెగ్రే పౌలా కథపై మాట్లాడుతూ.. ఇటువంటి కేసులు చాలా అసాధారణమైనవని తెలిపింది. దెయ్యాలు లేదా దెయ్యాలకు సంబంధించిన కేసులు చాలా అరుదు మరియు అసాధారణమైనవి అని ఆమె పేర్కొన్నారు. మరొకవైపు పారాసైకాలజిస్ట్ జైరో ఉర్బెక్స్ పౌలా కథను నమ్మాడు. ఆమె ఇంక్యుబస్ అని పిలవబడే దానితో సంబంధం కలిగి ఉండవచ్చని అతను భావించాడు. ఇంక్యుబస్ అనేది ఒక దెయ్యం లాంటిదని, సంతోషంగా లేని ప్రదేశంలో నివసించే ఒక రకమైన జీవి అని ఆయన వివరించారు.

అయితే, ఈ కథనం మనకు 2019లో జరిగిన వింత సంఘటనను గుర్తు చేస్తుంది. అమెథిస్ట్ రియల్మ్ అనే బ్రిటిష్ మహిళ ఆమె దెయ్యంతో ప్రేమలో పడ్డానని, విమాన ప్రయాణంలో వారి వింత బంధం తారస్థాయికి చేరిందని పేర్కొంది. పదేళ్ల కిందట మొదలైన కథ… దెయ్యాలతో తాను శృంగారంలో పాల్గొన్నానని అమెథిస్ట్ రియల్మ్(27) అనే మహిళ బల్లగుద్ది మరీ వాదించింది. ఆమె ఈ విషయాన్ని ఇటీవల ఐటీవీ ఛానెల్‌లో ప్రసారమయ్యే ‘దిస్ మార్నింగ్’ అనే కార్యక్రమంలో వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచింది. 

విశాలమైన ఇల్లు.. అందులో ఒంటరిగా అమెథిస్ట్. ఆ ఇంట్లో ఓ దెయ్యం ఉండేదట.రాత్రిళ్లు ఒంటరిగా ఉండే అమెథిస్ట్‌తో ఆ దెయ్యంతో పరిచయం పెంచుకుంది. ఒకరోజు ఆ పురుష దెయ్యంతో శృంగారంలో పాల్గొనాలనే కోరిక అమెథిస్ట్‌కు కలిగింది. దీంతో ఆమె ఆ దెయ్యాన్ని కవ్వించి రెచ్చగొట్టాలని నిర్ణయించుకుందట. రాత్రిళ్లు ఒంటిపై కేవలం లోదుస్తులు మాత్రమే ధరించి దెయ్యాన్ని రెచ్చగొట్టేదట. అలా అమెథిస్ట్, ఆ పురుష దెయ్యం ఒక్కటయ్యారట. ఒకటి, రెండు రోజులు కాదు ఈ సంబంధం మూడేళ్లపాటు నడిచిందట. పసిగట్టి నిలదీసిన భర్త… ఓరోజు ఈ విషయం అమెథిస్ట్ భర్తకు తెలిసిందట. ఈ విషయంలో అతడు ఆమెను నిలదీయడంతో ఆమెకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆ సమయంలో ఆ దెయ్యమే అమెథిస్ట్‌తో తనకు ఉన్న సంబంధాన్ని ఆమె భర్తకు వివరించిందట. అయితే.. అదే ఆఖరుసారి.. మళ్లీ ఆ దెయ్యం అమెథిస్ట్ దగ్గరికి రాలేదట. ఇంతటితో ఈ కథ ఆగిపోతే ఇంత సంచలనం అయ్యేది కాదు. ఆ తరువాత కూడా అమెథిస్ట్ మరో దెయ్యంతో సెక్సువల్ రిలేషన్‌షిప్ స్టార్ట్ చేసిందట. ఇలా.. మొత్తం 20 దెయ్యాలతో శృంగారంలో పాల్గొన్నదట. అంతేకాదు, ఆ దెయ్యాలతో సంతానాన్ని కూడా కని, ఓ ఘోస్ట్ ఫ్యామిలీని మెయిన్‌టెయిన్ చేయాలని కూడా అమెథిస్ట్ అనుకుందట.

అయితే ప్రస్తుతం కొలంబియాకు చెందిన పౌలా ఫ్లోర్స్‌ అనే మహిళ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వార్తపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ఆమెకు పిచ్చి పట్టినట్లు ఉంది. లేకపోతే దెయ్యం ఉండటం ఏంటి.. ఆమెతో శృంగారం చేయటం ఏంటి?’’.. ‘‘ ఆమెను ఆస్పత్రిలో చేర్పించటం మంచిది’’.. అమ్మో దెయ్యంతో ప్రేమా? భయంకరంగా ఉంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.