డాక్టర్ కుటుంబం పై దాడి చేసిన సెక్యూరిటీ గార్డ్

హర్యానాలోని గురుగ్రామ్‌లో ఒక డాక్టర్ మరియు అతి కుటుంబ సభ్యులైన ముగ్గురు పై దాడి చేసినందుకు గాను 12 మంది పై కేసు నమోదు అయ్యింది. విషయం లోకి  వెళ్తే నగరం లోని సెక్టార్ 51 లోని ఒక కండోమినియం  ఎంట్రీ నుండి డాక్టర్ కి సంబందించిన బ్రేక్ డౌన్  కార్ ని తొలగించడం వల్లే ఈ సంఘటన చోటు చేసుకుంది. డాక్టర్ జితేంద్ర సింగ్ తన  తండ్రి సురేశ్ చంద్,సోదరుడు దీపక్ సింగ్ మరియు అతని […]

Share:

హర్యానాలోని గురుగ్రామ్‌లో ఒక డాక్టర్ మరియు అతి కుటుంబ సభ్యులైన ముగ్గురు పై దాడి చేసినందుకు గాను 12 మంది పై కేసు నమోదు అయ్యింది. విషయం లోకి  వెళ్తే నగరం లోని సెక్టార్ 51 లోని ఒక కండోమినియం  ఎంట్రీ నుండి డాక్టర్ కి సంబందించిన బ్రేక్ డౌన్  కార్ ని తొలగించడం వల్లే ఈ సంఘటన చోటు చేసుకుంది. డాక్టర్ జితేంద్ర సింగ్ తన  తండ్రి సురేశ్ చంద్,సోదరుడు దీపక్ సింగ్ మరియు అతని తల్లి బంధువు ప్రియాంషు సింగ్‌లపై  కండోమినియం  వద్ద బ్రేక్ డౌన్ అయిన కార్ ని ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనితో చుట్టూ పక్కన ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ మొత్తం అక్కడ గుమ్మిగూడి జితేంద్ర సింగ్ పై అతని కుటుంబ సభ్యులపై దాడి చేసి , ఆ కారుని అక్కడి నుండి తొలగించారు.

ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా దౌర్జన్యానికి పాల్పడ్డ సెక్యూరిటీ సిబ్బంది :

ఆదివారం రాత్రి 9:45 గంటలకు డాక్టర్ జితేంద్ర సింగ్ మరియు అతని భార్య డాక్టర్ మాన్సీ బయటకి వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు వారి టాటా ఆల్ట్రోజ్ కారు కండోమినియం సమీపంలో ట్రబుల్ ఇచ్చి ఆగిపోవడం వల్ల ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి.  కండోమినియం ఎంట్రన్స్  వద్ద కార్ ఆగిపోవడం తో అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ కార్ ని వెంటనే తొలగించాల్సిందిగా డిమాండ్ చేసారు. కానీ బ్రేక్ డౌన్ అయిన కార్ ని ఎంత ప్రయత్నం చేసిన ఇంజిన్ స్టార్ట్ అవ్వడం లేదు. దీంతో జితేంద్ర సింగ్ కాస్త సమయం కావాలని కోరాడు. కానీ సెక్యూరిటీ గార్డ్ మాత్రం చాలా కఠినంగా వ్యవహరించింది. తప్పు చేసిన వారిపై ఎలా అయితే దాడి చేస్తారో తమ ప్రమేయం లేకుండా కార్ ఆగినందునే విషయం తెలిసి కూడా సింగ్ కుటుంబం పై దాడులు చెప్పి చాలా బలవంతంగా కార్ ని అక్కడి నుండి తొలగించారు. దీనితో డాక్టర్ జితేంద్ర  సింగ్ పోలీసులను ఆశ్రయించి తమపై దాడి చేసిన ఆ  సెక్యూరిటీ సిబ్బంది పై కేసు నమోదు చేసారు. 

గోల్డ్ చైన్స్ దొంగతనం :

ఎంతో రిక్వెస్ట్ చేసుకునే పద్ధతిలోన్ మేము ఉన్నప్పటికీ సెక్యూరిటీ  గార్డ్ రెచ్చిపోయి మాట్లాడాడని, అంతే కాకుండా తన భార్య పట్ల చాలా అసభ్యంగా కూడా వ్యవహరించాడని పోలీసులకు చెప్పుకొచ్చాడు జితేంద్ర సింగ్. ఆ తర్వాత సెక్యూరిటీ  గార్డు సెక్టార్ 57లోని టిగ్రా గ్రామం నుండి తన సహచరులను పిలిచాడు అని, వాళ్ళు క్రికెట్ బ్యాట్స్ మరియు ఐరన్ రాడ్స్ తో అక్కడికి వచ్చి మాపై దాడి చేసాడని చెప్పుకొచ్చాడు సింగ్. ఇక కాసేపటి తర్వాత మాకు సహాయం చెయ్యడానికి వచ్చిన నా సోదరుడు మరియు తండ్రి పై కూడా అమానుషంగా దాడి చేసారు. అంతే కాదు ఇద్దరు సెక్యూరిటీ  గార్డ్స్ తమ దగ్గర ఉన్న గోల్డ్ చైన్స్ ని దొంగతనం చేసి అక్కడికి నుండి పరారు అయ్యినట్టుగా చెప్పుకొచ్చాడు సింగ్. ఈ సంఘటన లో జితేంద్ర సింగ్ తండ్రి మరియు సోదరుడు చాలా తీవ్రంగా గాయపడ్డారు. దీంతో సెక్టార్ 51 సమీపం లో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఆ తర్వాత కాసేపటికి డిశ్చార్జ్ అయ్యారు. ఇది ఇలా ఉండగా గురుగ్రామ్ పోలీసు పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, సుభాష్ బోకెన్ మాట్లాడుతూ, ఈ సంఘటనలో పాల్గొన్న అనుమానితులలో ఎక్కువ మంది తిగ్రా గ్రామానికి చెందినవారని, హెచ్‌టి నివేదిక ప్రకారం, ఏడుగురు వ్యక్తుల గుర్తింపులు దొరికాయి అంటూ చెప్పుకొచ్చాడు.