నితిన్ దేశాయ్ ఆత్మహత్య

ప్రముఖ సినీ ఆర్ట్ డైరక్టర్ నితిన్ దేశాయ్ ఆత్మహత్య చేసుకొని మరణించడం బాలీవుడ్ ని షాక్ కి గురి చేసింది…ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్ బుధవారం ఉదయం ముంబై సమీపంలోని కర్జాత్‌లో గల తన ఎన్‌డి స్టూడియోలో శవమై కనిపించారు .ఆర్ట్ డైరెక్టర్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పని చేసిన నితిన్‌ దేశాయ్‌ నేడు తెల్లవారుజామున ముంబైలో ఉన్న తన ND స్టూడియోలో ఆత్మహత్య చేసుకున్నారు.  1980లలో సినీ పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చిన […]

Share:

ప్రముఖ సినీ ఆర్ట్ డైరక్టర్ నితిన్ దేశాయ్ ఆత్మహత్య చేసుకొని మరణించడం బాలీవుడ్ ని షాక్ కి గురి చేసింది…ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్ బుధవారం ఉదయం ముంబై సమీపంలోని కర్జాత్‌లో గల తన ఎన్‌డి స్టూడియోలో శవమై కనిపించారు .ఆర్ట్ డైరెక్టర్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పని చేసిన నితిన్‌ దేశాయ్‌ నేడు తెల్లవారుజామున ముంబైలో ఉన్న తన ND స్టూడియోలో ఆత్మహత్య చేసుకున్నారు.

 1980లలో సినీ పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చిన నితిన్‌ దేశాయ్‌ 1989లో పరిందా సినిమాతో ఆర్ట్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పట్నుంచి దాదాపు 100 సినిమాలకు పైగా ఆర్ట్ డైరెక్టర్ గా, మరో 50 సినిమాలకు పైగా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేశారు .

నేషనల్ అవార్డు గెలిచిన ఆర్ట్ డైరెక్టర్  లహమ్‌ దిల్‌ దే సనమ్‌, లగాన్‌, దేవదాస్‌, జోధా అక్బర్‌, ప్రేమ్‌ రతన్‌ ధన్ పాయో, 1942 ఏ లవ్‌ స్టోరీ, ఫ్యాషన్‌, పాని పట్‌, దోస్తానా.. లాంటి ఎన్నో సూపర్ హిట్ బాలీవుడ్ సినిమాలకు పనిచేసారు నితిన్‌ దేశాయ్‌. అనేక అవార్డులు కూడా అందుకున్నారు.

మూవీస్‌తో పాటు గా నటుడిగా కూడా పలు సినిమాల్లో మెరిపించారు. దర్శకుడిగా నూ రెండు సినిమాలు తెరకెక్కించారు నితిన్‌ దేశాయ్‌. నిర్మాతగా కూడా రెండు సినిమాలు తెరకెక్కించారు.

అప్పుల బాదే ఆత్మహత్యకు కారణమా ? 

2005లో ముంబై శివార్లలోని కర్జత్ లో అతడు ఎన్డీ స్టూడియోస్ ఓపెన్ చేశాడు. 52 ఎకరాల్లో విస్తరించిన ఈ స్టూడియోలో ఎన్నో సినిమా సెట్లు వేశారు. జోధా అక్బర్ సినిమా కూడా ఈ స్టూడియోలోనే తీశారు.

 20 ఏళ్లుగా బాలీవుడ్‌లో ఫేమస్ ఆర్ట్ డైరక్టర్‌గా ఉన్న నితిన్ దేశాయ్ ఆత్మహత్య బాలీవుడ్‌ను షాక్ కు గురిచేసింది. నితిన్ మరణంతో సినిమా ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే, అప్పుల భారంతో నితిన్ ఒత్తిడి ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. 

నితిన్ చంద్రకాంత్ దేశాయ్ చెల్లించాల్సిన మొత్తం అప్పు రూ. 252 కోట్లు..అయితే 2016, 2018 సంవత్సరాల్లో నితిన్ సీఎఫ్ఎం ఫైనాన్స్ సంస్థ నుంచి మొత్తం రూ.180 కోట్లను అప్పుగా తీసుకున్నారట. దీని కోసం  42 ఎకరాల స్థలం, ఇతర ఆస్తులను తాకట్టు పెట్టారు అని తెలుస్తుంది.

ఈ మొత్తాన్ని ఆయన సకాలంలో తిరిగి చెల్లించలేకపోవడంతో సీఎఫ్ఎం సంస్థ ఈ అప్పు రికవరీ చేసే బాధ్యతను ఎడల్‌వీస్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ సంస్థకు అప్పగించింది.దీంతో ఎడల్‌వీస్ లా ట్రైబ్యునల్‌ను ఆశ్రయించగా అప్పు రికవరీ ప్రక్రియ ప్రారంభించేందుకు ట్రిబ్యునల్‌ అనుమతించింది. 

నితిన్ మొత్తం 252 కోట్లు బాకీ పడ్డట్టు ఈ విచారణలో వెలుగులో కి వచ్చింది..ఆయన  పని చేసిన ఎన్నో చిత్రాలకు జాతీయ అవార్డులు రాగా.. వ్యక్తిగతంగా ఆయన నాలుగు సార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు. ఆర్ట్ డైరెక్టర్‌గానే కాకుండా దర్శకుడి గా, నిర్మాత గా కూడా పని చేశారు. మరాఠీ భాషలో ఆయన సినిమాలు చేశారు.  అలాగే కొన్ని సినిమాలో నటించారు కూడా..  అయితే కరోనా తర్వాత నుంచి ఆయన చెప్పుకోదగ్గ సినిమాలు ఏమి చేయలేదు. స్టార్ హోదాలో ఉన్న ఆయన ఇలా 57 ఏళ్ళ వయసు లో ఆత్మహత్య చేసుకోవడం తో బాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. 

ఆత్మహత్య కావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అనే దాని పై కారణాలు ఇంకా తెలియలేదు. అయితే అప్పుల బాధ తో, ప్రస్తుతం ఆఫర్లు లేకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నారని పలువురు  భావిస్తున్నారు.

Tags :