Aadhaar Card పోయిందా.. నో టెన్షన్, మ‌ళ్లీ డౌన్‌లోడ్ చేసుకోండిలా!

Aadhaar Card : ఇండియాలో నివ‌సించే ప్ర‌తి ఒక్క‌రికి Aadhaar Card తప్పనిసరి అయింది. వ్యక్తుల గుర్తింపు కోసం ప్ర‌భుత్వం ఆధార్ కార్డుల‌ను జారీ ప్రక్రియ చేస్తున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే.

Courtesy: Top Indian News

Share:

ఇండియాలో నివ‌సించే ప్ర‌తి ఒక్క‌రికి Aadhaar Card తప్పనిసరి అయింది. వ్యక్తుల గుర్తింపు కోసం ప్ర‌భుత్వం ఆధార్ కార్డుల‌ను జారీ ప్రక్రియ చేస్తున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం అంద‌రికీ Aadhaar Card త‌ప్ప‌నిస‌రిగా మారింది. ఏ అప్లికేష‌న్ పెట్టుకోవాల‌న్నా, ప్ర‌భుత్వానికి సంబంధించి ఏదైనా ప‌థ‌కానికి ద‌ర‌ఖాస్తు పెట్టుకోవాల‌న్నా ఆధార్ నంబ‌ర్ త‌ప్ప‌నిస‌రి అయింది. ఇప్పుడు తెలంగాణలో ప్రజా పాలన దరఖాస్తులకు కూడా ఆధార్ కార్డు తప్పనిసరి అయింది. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడానికి మహిళల కోసం ప్రవేశ పెట్టిన మహాలక్ష్మీ పథకానికి కూడా ఆధార్ కార్డు తప్పనిసరి అయింది. 

అయితే, కొంత మంది ఒరిజినల్ ఆధార్ కార్డు పోగొట్టుకు పోవడంతో టెన్షన్ కు గురవుతున్నారు. బస్సుల్లో ఏం చూపించాలో అర్థం కాక సతమతం అవుతున్నారు. కానీ, ఒక‌సారి ఆధార్ పొందిన త‌ర్వాత అది పోగొట్టుకుపోయినా చింతించాల్సిన అవ‌స‌రం లేదు. మ‌ళ్లీ Aadhaar Cardను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డు డౌన్‌లోడ్ ప్ర‌క్రియ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా తెలుసుకుందాం. మీరు కూడా మీ ఆధార్ కార్డు పోగొట్టుకున్న‌ట్ల‌యితే ఈ కింద మేం ఇచ్చే ప్ర‌క్రియ‌ను అనుస‌రించి మ‌ళ్లీ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌:
* ముందుగా UIDAI అధికారిక వెబ్‌సైట్‌  (https://uidai.gov.in/my-aadhaar/get-aadhaar.html) ను ఓపెన్ చేయాలి.
* UIDAI వెబ్‌సైట్లోకి ఎంట‌ర్ అయిన త‌ర్వాత  "మై ఆధార్‌"  సెక్ష‌న్‌పై క్లిక్ చేయాలి. 
* మై ఆధార్ సెక్ష‌న్‌లో కింద కొన్ని ఆప్ష‌న్‌లు క‌నిపిస్తాయి. అందులో గెట్ ఆధార్ అనే ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి.
* గెట్ ఆధార్ ఓపెన్ అయిన తర్వాత డౌన్‌లోడ్ ఆధార్ అనే ఆప్ష‌న్ ఉంటుంది. దాన్ని ఎంపిక చేసుకోవాలి. 
* ఇప్పుడు మీకు లాగిన్ విత్ ఆధార్ అండ్ ఓటీపీ అని ఒక బ‌ట‌న్ క‌నిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. 
* అనంత‌రం మీ ఆధార్ నంబ‌ర్ టైప్ చేసిన త‌ర్వాత, రిజిస్ట‌ర్‌డ్ మొబైల్ నంబ‌ర్‌కు వ‌చ్చిన ఓటీపీని ఎంట‌ర్ చేసి లాగిన్ బ‌ట‌న్ క్లిక్ చేయాలి. 
* లాగిన్ విజ‌య‌వంతం అయిన త‌ర్వాత మీకు మీ డౌన్‌లోడ్ ఆధార్ కార్డు ఆప్ష‌న్ క్లిక్ చేస్తే మీకు కార్డు ఓపెన్ అవుతుంది. 
* అక్క‌డే డౌన్‌లోడ్ ఆధార్ కార్డు అనే ఆప్ష‌న్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి మీ ఆధార్ కార్డును మీరు డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. 
* అయితే, ఇక్క‌డ మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే.. డౌన్‌లోడ్ అయిన ఆధార్ ఫైల్ ను మీరు ఓపెన్ చేయ‌డానికి పాస్‌వ‌ర్డ్ అడుగుతుంది. 
* ఆ పాస్‌వ‌ర్డ్‌ ఏంటంటే.. మీ పేరులోని నాలుగు అక్ష‌రాలు, మీరు పుట్టిన సంవ‌త్స‌రం అంకెలు టైప్ చేస్తే ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది. 
ఉదాహ‌ర‌ణ‌కు.. మీ పేరు SURESH, పుట్టిన సంవ‌త్స‌రం 1994 అనుకుంటే, పాస్ వ‌ర్డ్ వ‌చ్చేసి.. పేరులో మొద‌టి 4 అక్ష‌రాలు.. పుట్టిన సంవ‌త్స‌రం అంకెలు క‌లిపి SURE1994 అని టైప్ చేయాలి. ఇక మీ ఆధార్ మీకు క‌నిపిస్తుంది.