iPhone 15పై ఫ్లిప్‌కార్ట్ లో భారీ డిస్కౌంట్.. ఓ లుక్కేయండి!

Apple Iphone 15 : ప్రముఖ టెక్ దిగ్గజం Apple సెప్టెంబర్ 2023లో iPhone 15 సిరీస్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే.

Courtesy: x

Share:

ప్రముఖ టెక్ దిగ్గజం Apple సెప్టెంబర్ 2023లో iPhone 15 సిరీస్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ iPhone 15ను ఎవరైనా కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే వారికి ఇదే మంచి సమయం. ఎందుకంటే Flipkart లో రిపబ్లిక్ డే సేల్ లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు అతి తక్కువ ధరకు అందుబాటులో ఉంది. యాపిల్ ఫోన్ కు స్విచ్ అవ్వాలనుకునే వారికి ఇది సువర్ణావకాశంగా చెప్పొచ్చు. అయితే, ఫ్లిప్‌కార్ట్ లో ఈ సేల్ శాశ్వతంగా ఉండదు. జనవరి 13న ప్రారంభమైన ఈ సేల్... జనవరి 19 వరకు అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి, మీరు iPhone 15ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, ఇదే మంచి సమయంగా చెప్పొచ్చు. ఇప్పుడు దాని ధర, స్పెసిఫికేషన్లు ఇతర వివరాలు తెలుసుకుందాం. 

Flipkart సేల్ లో iPhone 15 ధర
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సేల్ లో iPhone 15 రూ.66,999 ధరకు అందుబాటులో ఉంది. ఒకరోజు ముందు అనగా ఆదివారం ధర రూ.65,999 కు అందుబాటులో ఉంది. కాబట్టి ప్రతి రోజు ధర మారుతుంది. ఇది 128GB వేరియంట్ ధర కావడం గమనార్హం. ఇతర వేరియంట్లపై కూడా డిస్కౌంట్ అందుబాటులో ఉంది. 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.76,999కి మరియు 512GB వేరియంట్ రూ.96,999కి విక్రయిస్తున్నారు. మీరు మీ ఓల్డ్ డివైజ్ ను ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ICICI బ్యాంక్ మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్‌లతో పాటు UPI లావాదేవీలపై రూ.750 తగ్గింపును పొందవచ్చు.

iPhone 15 స్పెసిఫికేషన్స్
iPhone 15 స్మార్ట్ ఫోన్ 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 48MP ప్రైమరీ సెన్సార్ మరియు 12MP సెకండరీ సెన్సార్‌తో వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెల్ఫీల కోసం, 12MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ డివైజ్ iPhone 14 ప్రో మోడల్‌లలో ఇచ్చిన A16 బయోనిక్ చిప్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది వినియోగదారులకు చాలా ప్రయోజనాన్ని జోడిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ లో మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే ఇది టైప్-సి పోర్ట్‌ను కలిగి ఉంటుంది, ఇది వినియోగదారులు ఏదైనా ఛార్జర్‌తో ఛార్జ్ చేయడానికి సౌకర్యంగా ఉంటుంది.