Israel-Hamas War: గాజా ఆసుపత్రిలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్‌ సైన్యం.. అణువణువూ సోదాలు

రణరంగం అల్‌-షిఫా

Courtesy: Canva

Share:

Israel-Hamas War: గాజా(Gaza)లో నెల రోజులకుపైగా హమాస్మిలిటెంట్లపై(Hamas militants) ఇజ్రాయెల్సైన్యం(Israeli army) సాగిస్తున్న యుద్ధం కీలక దశకు చేరుకుంది. గాజాలో అతిపెద్దదైన అల్‌-షిఫా ఆసుపత్రిలోకి బుధవారం ఉదయం ఇజ్రాయెల్సేనలు(Israeli forces) ప్రవేశించాయి. హమాస్కమాండ్సెంటర్‌(Hamas command center) ఇక్కడే భూగర్భంలో ఉందని ఇజ్రాయెల్‌(Israel) ఆరోపిస్తోంది. ఆసుపత్రి కింది భాగంలో సొరంగాల్లో హమాస్నాయకులు మాటు వేశారని చెబుతోంది. మిలిటెంట్లపై ఖచ్చితమైన, లక్షిత ఆపరేషన్‌(Targeted operation) ప్రారంభించామని ప్రకటించింది.

అల్‌–షిఫా హాస్పిటల్‌(Al-Shifa Hospital) ఇప్పుడు రణభూమిగా మారిపోయింది. ఇజ్రాయెల్సైనికులు(Israeli soldiers) ప్రతి గదినీ అణువణువూ గాలిస్తున్నారు. ప్రతి ఒక్కరినీ క్షుణ్నంగా ప్రశ్నిస్తున్నారు . అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. అన్ని డిపార్టుమెంట్లలో తనిఖీలు(Inspections) కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్యుద్ధ ట్యాంకులు(Israeli battle tanks), సైనిక వాహనాలు(Military vehicles) సైతం అల్‌–షిఫా ఆసుపత్రి(Al-Shifa Hospital) ప్రాంగణంలో మోహరించాయి.

అల్‌–షిఫా హాస్పిటల్లో(Al-Shifa Hospital) ఇజ్రాయెల్సైనికులు దారుణంగా ప్రవర్తిస్తున్నారని ప్రత్యక్ష సాక్షులు, ఆసుపత్రి సిబ్బంది(Hospital staff) చెప్పారు. పురుషులను నగ్నంగా మార్చి, కళ్లకు గంతలు కట్టి నిర్బంధిస్తున్నారని తెలిపారు. తరచుగా తుపాకీ మోతలు వినిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ వార్డుల్లో 180కి పైగా మృతదేహాలు(Dead Bodies) పడి ఉన్నాయని, బయటకు తరలించేవారు లేక కుళ్లిపోతున్నాయని పేర్కొన్నారు. ఇక్కడ పరిస్థితి భయానకంగా ఉందన్నారు.

16 నుంచి 40 ఏళ్ల లోపు పురుషులంతా ఆసుపత్రి గదుల నుంచి బయటకు వెళ్లాలని, బయట అందరూ ఒకే చోటుకు చేరుకోవాలని లౌడ్స్పీకర్లో అరబిక్భాషలో ఇజ్రాయెల్సైనికులు హెచ్చరికలు(Warnings) జారీ చేశారని ప్రత్యక్ష సాక్షి చెప్పారు. పురుషులను బట్టలు విప్పించి ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. 200 మందిని దూరంగా తీసుకెళ్లారని తెలిపారు. ఆసుపత్రి ప్రాంగణాన్ని మొత్తం ఇజ్రాయెల్సైనికులు(Israeli soldiers) అదుపులోకి తీసుకున్నారని, ఇతర భవనాలతో కాంటాక్ట్లేకుండాపోయిందని ప్రధాన భవనంలోని డాక్టర్లు చెప్పారు.

గాజాలో(Gaza) బందీల విడుదలపై ప్రయత్నాలు మొదలైనా రెండు పక్షాల మధ్య అప నమ్మకంవల్ల అవి అంత తేలిగ్గా కొలిక్కి వచ్చేట్లు లేవు. అక్టోబరు 7 దాడి చేసినప్పుడు హమాస్బందీలుగా(Hamas hostages) పట్టుకుపోయిన వారిలో 100 మందిని విడుదల చేయాలని ఇజ్రాయెల్కోరుతుంటే.. 70 మందిని విడుదల చేస్తామని హమాస్‌(Hamas )అంటోంది. ఇక ఇజ్రాయెల్జైళ్ల నుంచి 120 మంది పాలస్తీనా వారిని విడుదల చేస్తామని ప్రతిపాదించింది. వారంతా మహిళలు, పిల్లలు, వృద్ధులే. బందీల మార్పిడి సజావుగా జరగడానికి 5 రోజులపాటు కాల్పుల విరమణ (ceasefire) పాటిస్తామని తెలిపింది.

బందీల విడుదలకు ఇజ్రాయెల్ప్రభుత్వం, హమాస్ప్రతినిధుల మధ్య నేరుగా కాకుండా పరోక్షంగా చర్చలు జరగడం సమస్యను జటిలం చేస్తోంది. వారి బదులు అమెరికా, ఇజ్రాయెల్గూఢచార సంస్థలైన సీఐఏ (CIA), మొస్సాద్‌ (Mossad), ఈజిప్టు (Egypt), ఖతార్ (Qatar) ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్సలీవాన్‌ (Jake Sullivan) చురుకైన పాత్ర పోషిస్తున్నారు. గాజాలో కమ్యూనికేషన్వసతులు(Communication facilities) విచ్ఛిన్నమవడం చర్చలు వేగంగా సాగకుండా అడ్డుపడుతోంది.

అమెరికా మద్దతు

అల్‌–షిఫా హాస్పిటల్‌(Al-Shifa Hospital) కింద సొరంగాల్లో హమాస్కమాండ్సెంటర్‌(Hamas command center) ఉందన్న ఇజ్రాయెల్వాదనకు అమెరికా మద్దతు పలికింది. కమాండ్సెంటర్ను తమ నిఘా వర్గాలు గుర్తించాయని వెల్లడించింది. అయితే, ఇజ్రాయెల్, అమెరికా ప్రకటనలను హమాస్తీవ్రంగా ఖండించింది. అల్‌–షిపా ఆసుపత్రిలో ఇజ్రాయెల్సేనల తనిఖీలను ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ఆంటోనియో గుటేరస్‌(Antonio Gutierrez) ఖండించారు. ఇజ్రాయెల్చర్య ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్వైమానిక దాడులు బుధవారం కూడా కొనసాగాయి. దాడుల్లో కనీసం 14 మంది మరణించినట్లు తెలిసింది.

అల్‌–షిఫా ఎందుకంత ముఖ్యం?

అల్‌–షిఫా (Al-Shifa Hospital) అంటే స్వస్థత కేంద్రం అని అర్థం. గాజాలోనే అతిపెద్దదైన ఆసుప్రతిని 1946లో అప్పటి బ్రిటిష్పాలనలో విశాలమైన ప్రాంగణంలో నిర్మించారు. దీన్ని గాజా గుండెచప్పుడు, ఆరోగ్య ప్రదాయినిగా పరిగణిస్తుంటారు. వైద్య సేవల విషయంలో ఇదొ వెన్నుముక లాంటింది. ఇజ్రాయెల్‌–హమాస్మధ్య ఘర్షణలు తలెత్తినప్పుడల్లా అల్‌–షిఫా హాస్పిటల్పై దాడులు జరగడం పరిపాటిగా మారింది. 2008–2009లోనూ ఒక్కడ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. 2014లో జరిగిన ఇజ్రాయెల్‌–హమాస్యుద్ధ సమయంలో అల్‌–షిఫా హాస్పిటల్లో 9 రోజులపాటు వైద్య సేవలు నిలిచిపోయాయి. హమాస్మిలిటెంట్లు ఆసుపత్రిని ప్రధాన స్థావరంగా మార్చుకున్నారని ఇజ్రాయెల్గత కొన్ని దశాబ్దాలుగా ఆరోపిస్తోంది.