ప్రపంచంలోనే పవర్ ఫుల్ మిలిటరీ జాబితాలో భారత్.. ర్యాంక్ ఎంతంటే!

2024 military strength rankings: భారత ఆర్మీ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. 2024లో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మిలిటరీ వ్యవస్థ కలిగిన దేశాల్లో భారత్ టాప్ 5 లో నిలిచింది.

Courtesy: Top Indian News

Share:

భారత ఆర్మీ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. 2024లో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మిలిటరీ వ్యవస్థ కలిగిన దేశాల్లో భారత్ టాప్ 5 లో నిలిచింది. తాజాగా, గ్లోబల్ ఫైర్ పవర్ అనే సంస్థ ప్రపంచలో ఉన్న దేశాల మిలిటరీ స్ట్రెంత్ ర్యాంకింగ్స్(శక్తివంతమైన మిలిటరీ దేశాల ర్యాంకులు) విడుదల చేయగా.. అందులో భారత్ మొదటి ఐదు దేశాల్లో ఒకటిగా నిలవడం విశేషం. మొత్తం 145 దేశాల ఆర్మీలను 60 కంటే ఎక్కువ ప్రమాణాల ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ నిర్ధారణ చేస్తారు. ఆయా దేశం యొక్క ట్రూప్ ఫిగర్స్(మిలిటరీ సైన్యం సంఖ్య), పరికరాలు, ఆర్థిక స్థిరత్వం(ఫైనాన్షియల్ స్టెబిలిటీ), భౌగోళిక స్థానం, మిలిటరీకి వారి యొక్క వనరులు సహా 60కి పైగా ప్రమాణాల ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ డిసైడ్ చేస్తారు. 

2024 మిలిటరీ స్ట్రెంత్ ర్యాంకింగ్స్ ప్రకారం, యునైటెడ్ స్టేట్స్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన మిలిటరీని కలిగి ఉంది. అమెరికా తర్వాత రష్యా (రెండో స్థానం), తర్వాత చైనా (మూడో స్థానం) ఉన్నాయి. కాగా, భారత్ నాలుగో స్థానంలో ఉంది. ఇకపోతే దక్షిణ కొరియా ఐదో స్థానంలో, యునైటెడ్ కింగ్‌డమ్ ఆరో స్థానంలో నిలిచాయి. ఇక పాకిస్థాన్ 9 వ స్థానంలో, ఆస్ట్రేలియా 16 వ స్థానంలో, ఇజ్రాయెల్ 17 వ స్థానంలో, ఉక్రెయిన్ 18వ స్థానంలో ఉన్నాయి. ఉన్నాయి. 

అత్యంత శక్తివంతమైన మిలిటరీ కలిగిన టాప్ 10 దేశాలు ఇవే

1) యూఎస్ఏ
2) రష్యా
3) చైనా
4) భారతదేశం
5) దక్షిణ కొరియా
6) యునైటెడ్ కింగ్‌డమ్
7) జపాన్
8) టర్కీ
9) పాకిస్తాన్
10) ఇటలీ