పాక్ లో క్షిపణి దాడులతో విరుచుకుపడ్డ ఇరాన్.. ఖండించిన పాక్

పాకిస్థాన్‌ లోని బలూచిస్థాన్‌ ప్రాంతంలో ఇరాన్ దాడులతో విరుచుకు పడింది. ఆ ప్రాంతంలో ఉన్న తీవ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసింది.

Courtesy: Top Indian News

Share:

పాకిస్థాన్‌ లోని బలూచిస్థాన్‌ ప్రాంతంలో ఇరాన్ దాడులతో విరుచుకు పడింది. ఆ ప్రాంతంలో ఉన్న తీవ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసింది. ఈ మేరకు ఇరాన్ స్వయంగా ప్రకటన చేసింది. జైష్‌ అల్‌ అదిల్‌ అనే ఉగ్ర సంస్థకు చెందిన 2 ప్రధాన కార్యాలయాలపై దాడులు చేసినట్లు ఇరాన్ తెలిపింది. ఈ దాడుల్లో జైష్ అల్ అదిల్ రెండు స్థావరాలు ధ్వంసమైనట్లు పేర్కొంది. అయితే ఇంతకు ముందు బలూచిస్థాన్ కేంద్రంగా ఉన్న జైషే అల్ అదిల్ మిలిటెంట్లు తమ భద్రతా బలగాలపై దాడి చేశారని ఇరాన్ ఆరోపించింది. దీనికి ప్రతీకారంగానే బలూచిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడి చేసినట్లు సమాచారం. సున్నీ మిలిటెంట్‌ గ్రూపు అయిన జైష్‌ అల్‌ అదిల్‌.. పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ కేంద్రంగా పని చేస్తూ ఇరాన్‌లోని సిస్థాన్‌-బలూచిస్థాన్‌లో కార్యకలాపాలను నిర్వహిస్తోంది.

ఇరాన్ దాడులను ఖండిస్తున్నాం పాక్
ఇరాన్‌ దాడులను పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. దాడిలో ఇద్దరు అమాయక పిల్లలు చనిపోయారని, మరో ముగ్గురు బాలికలు గాయపడ్డారని వెల్లడించింది. ఇది పాకిస్థాన్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని, ఈ దాడి తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించింది. ఇరాన్‌ (Iran) చర్యలను ఖండిస్తూ ఆ దేశ రాయబారిని పిలుపించుకొని పాక్‌ విదేశాంగ కార్యాలయం తమ నిరసనను తెలియజేసింది. పాక్‌ గగనతలాన్ని దుర్వినియోగం చేస్తూ.. దేశ సౌర్వభౌమాధికారాన్నే సవాల్‌ చేశారని ఆక్షేపించింది. ఇరు దేశాల మధ్య సమాచార మార్పిడికి వ్యవస్థాపిత మార్గాలున్నాయని పాక్ గుర్తుచేసింది. అయినప్పటికీ ఇరాన్‌ ఇలా దాడులు చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నామని పేర్కొంది. 

2023 డిసెంబర్ లో ఇరాన్‌లోని పోలీస్‌ స్టేషన్‌పై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడికి సంబంధించిన పాకిస్థాన్‌ను ఇరాన్‌ మందలించింది. ఇరాన్‌లోని సిస్తాన్-బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని రాస్క్‌లోని పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ దాడిలో 11 మంది భద్రతా సిబ్బంది మరణించారు. అప్పటి నుంచి ఇరాన్ పాకిస్థాన్‌ను లక్ష్యంగా చేసుకుంది. అదేవిధంగా పాకిస్థాన్‌కు తన సరిహద్దులపై నియంత్రణ లేదని విమర్శించింది. మరోవైపు, గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్లకు మధ్య జరుగుతున్న యుద్ధం రోజురోజుకు విస్తరిస్తున్న విషయం తెలిసిందే. క్రమంలో ఈ తాజా దాడులు చోటుచేసుకోసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు సోమవారం ఇరాకీ నగరం ఇర్బిల్‌లోని యుఎస్ కాన్సులర్ కాంపౌండ్‌కు సమీపంలో ఉన్న ఇజ్రాయెల్ గూఢచారి ప్రధాన కార్యాలయం, తీవ్రవాద ఇస్లామిక్ స్టేట్ గ్రూపుతో సంబంధం ఉన్న లక్ష్యాలపై కూడా ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్‌ దాడికి ఇరాక్‌ కూడా ఖండించింది.